Friday, October 3, 2014

part -7


ఓడిపోయిన క్షణాలు...
ఇది పోటీ ప్రపంచం. పుట్టిన నాటినుండే అవసరాలకు వరుసలు కట్టాల్సిన బ్రతుకులు మనవి. ఆ ఎమోషన్ లేకపోతే మనకి కూర్చునే రేషన్ కూడా మిగలదు. ఒక్కొక్కదానిలో ఒక్కొక్కరకం పోటీ వుంటుంది. దానిని తట్టుకొని నిలబడిన వారి ముందుకు వెళతారు. మరి మిగిలినవారు సంగతేంటని ప్రశ్నిస్తే??? అది కోటి డాలర్ల ప్రశ్నగా వినతికెక్కుతుంది. ఒక రకంగా ఇప్పుడు మనముందు గెలుపుకోసం జరుగుతున్న ఈ ప్రయత్నాలన్నీ అలా ఓడిపోతున్న వారికోసమే.
ఒక ప్రభుత్వ ఉద్యోగాన్నే తీసుకుంటే... రెండువందల ఉద్యోగాలకి రెండు లక్షలమంది పోటీపడుతున్నారు. అంటే ఒక ఉద్యోగానికి నీతో పోటి పడేవారు సుమారుగా వెయ్యిమంది. ఇందులోనే నువ్వు మెరిట్ సాధించాలి, దానితో పాటూ రిజర్వేషన్ల వంటి సామాజికాంశాలనేకం నీ విజయాన్ని ప్రభావితం చేస్తుంటాయి. వాటన్నిటినీదాటుకుని ఈ రోజులలో ఒక ప్రభుత్వ ఉద్యోగం మెరిట్ ద్వారా సంపాదించాలంటే ఆ కష్టం కేవలం అనుభవించినవాడికే అర్ధం అవుతుంది.అలాంటిదారిలో నేను అనేక ఓడిపోయిన క్షణాలను అనుభవించాను. ఆ క్షణాలలో మనఓటమికంటే అందరూ చేసే వెలివేసినట్లుండే చూపే నరకప్రాయం. దానినుండికూడా మనం మనసాధనని సాగించాలంటే తప్పకుండా మనదైన ఒక ప్రపంచాన్ని నిర్మించుకోవాలి. అలా నాలోని ఆ భావాలని తరువాత వచ్చేవారికి ముందుగానే అందించాలని రచనని మొదలుపెట్టాను. అదే "అంతర్ భ్రమణం" పుస్తకం.
చాలామంది తాము సాధించిన విజయాన్ని ఎలా సాధించామన్నది చెప్పటమే ప్రధాన సూత్రంగా వ్యక్తిత్వ వికాసపు పుస్తకాలను రాశారు. కానీ నేను అలాంటి పుస్తకాన్ని నా ఓటమినుండే మొదలుపెట్టి విజయం అందుకున్నప్పుడు ముగించాను. అందుకే ఆ పుస్తకం రాయటానికి 4సంవత్సరాల కాలం పట్టింది.
ఈ పుస్తకాన్ని రాయటం ప్రారంభించినప్పుడు మనసులో వున్నది పై భావనొక్కటే. కానీ దీనికొరకు తవ్వుతున్న గతం, ఇతరుల జీవితాలూ, భావావేశాలూ, తర్కం.. ఇవన్నీ నాలో నన్నే విమర్శించాయి. ముందు నన్ను నేను మార్చుకోవలసింది చాలావుందని దీన్ని రాస్తున్నప్పుడు నాకు అర్ధమైంది. ఒకరకంగా అది నాకు మొదటి గెలుపు. అలా కొనసాగించిన ఈ రచన పూర్తి అయ్యేనాటికి…. నాకు ఓటమి నుండి తప్పించుకోవాలన్న అభధ్రతాభావం కంటే, విజయాన్ని అందుకోవాలన్న వాంచకంటే,
“విజయంపైనే గెలిచితీరటం జీవితపు సహజగుణం అని తెలిసిపోయింది".
ఒక గొప్ప విజయం మనిషి చేసిన తప్పుల్ని మర్చిపొయేలా చేస్తుంది. ఒక అపజయం అదే మనిషిలో లేని లోపాల్ని కూడా వెతికి తెచ్చి మరీ కృంగదీస్తుంది. ఎందువల్ల జరుగుతుందిలా? మన ఆశయాన్ని నిర్ణయించుకున్నప్పుడే.. దానికి పుల్ స్టాప్ కూడా పెట్టేసుకుంటున్నాం మరి. బ్రతికేది వందేళ్ళే అని తెలిసినా, అందులోనూ సాధారణ జీవితకాలం అరవై నుండి డెబ్బై మధ్యలోనే అని రుజువవుతున్నా, ఇంకా ఇంకా బ్రతుకీడ్చాలని ప్రాణంపై తీపి పెంచేసుకుంటున్న మనం.. మరి.. ఆ కాలమంతా ఎదుగుతూ వుండటం కూడా అంతే అవసరమని ఎందుకు భావించలేకపోతున్నాం?
అదే. ఆ అన్ బ్యాలెన్సింగ్ థాటే..మనల్ని ఓటమి దగ్గర ఓడిపోయేలా చేస్తుందని గ్రహించండి ముందుగా.
అప్పుడు జయానికీ, అపజయానికీ మధ్యనున్న తేడా పెద్దవిషయంలా మనల్ని భయపెట్టదు. ఓటమి అనుభవంగా మారుతుంది. విజయం అలవాటవుతుంది. సాగుతూవుండే జీవితగమనం మనల్ని మరింతగా ఎదిగేందుకు నిరంతరం అధ్బుతాలను చేయిస్తూనే వుంటుంది.
"అదే విజయాన్ని గెలుచుకోవటమంటే"
ఇక్కడ విజయమంటే.. నువ్వు బ్రతికీతేరాలనుకుంటున్న కాలమంతా సంపూర్ణంగా గెలుచుకొనే అలవాటుని సొంతం చేసుకోవటమే.
విజయవాడ విక్టరీ పబ్లికేషన్స్ వారు ప్రచురించిన ఆ పుస్తకం నాకు రచయితగా మంచిపేరు సంపాదించిపెట్టింది. అంతకంటే ఎక్కువగా ఆ పుస్తకం చదివిన కొందరు తమ జీవితపు విలువను తెలుసుకోగలిగామని నాతో చెప్పటం నాకు మరింత శక్తినిచ్చింది.
దానికి చెందిన ఫొటోలనే ఇక్కడ పెడుతున్నాను.
మరోపుస్తకం గురించి ఇక్కడే  తరువాత కలుద్దాం.
మీ
శ్రీఅరుణం
9885779207
విశాఖపట్నం

Friday, August 29, 2014

part-6
నా జీవితంలో నాకేదీ తేలిగ్గానో, అదృష్టంకలిసొచ్చో లభించినవి కాదు. ప్రతీదీకూడా విపరీతమైన శ్రమా, ధారుణమైన సమస్యలను అధిగమించగలిగితేనే దొరొకేవి. ఆ దారిలో అందరిలానే నన్నూ మరికొన్ని సహజమైన అంశాలుకూడా ప్రభావితం చేస్తుండేవి.
ప్రేమపేరిట విఫలమైన బంధం...
చుట్టుముట్టిన ఆర్ధికసమస్యలూ...
పరాజయాలను కత్తులుగా మార్చి నిరంతరం నన్ను ప్రశ్నించి చంపే సమాజం...
ఇవి చాలవన్నట్లు నా నమ్మకాన్ని తమ స్వార్ధానికి వాడుకుని మోసం చేయడానికి సిద్దపడిన కొందరు మహానుభావులూ... ఇలాంటివన్నీ నన్ను నిరంతరం వేధనకు గురిచేశాయి.కానీ వాటిని అనుభవిస్తున్ననేను ఎప్పుడూ సమస్యనుండి బయటకిరావాలన్న వాస్తవాన్నే నమ్ముకునేవాడిని. ప్రతీ సమస్యనీ ఒక శాస్త్రంలా అనుభవించసాగాను. అలా నేను అనుసరించిన ధృక్పధం నన్నొక కవిగా, రచయితగా మార్చింది.
సమస్యలు నాలో రేకెత్తిస్తున్న ఆవేధన, ఆక్రోశం, ఆవేశం....ఇలాంటివాటిపై నేను చేస్తున్న పోరాటంలో కొన్నిక్షణాలలో అలిసిన నా ఆత్మ నాలో ఒక ప్రశ్నను ఉదయింపచేసేది. అది
"నా సమస్యని నేను దాటేసి వెళ్ళిపోవటం నన్ను ఒక మనిషిగా నిలబెట్టవచ్చు. కానీ, ఆ సమస్యని అనుభవించి దానినుండి బయటకు రావటానికి నేను నిర్మించుకున్న సూత్రం అందరికీ అందచేయటం వల్ల నన్ను కాపాడుకున్న ఈ సమాజానికి నేను కొంత రుణంతీర్చుకున్నవాడినవుతానుకదా?" ఈ ప్రశ్నే నాతో కలం పట్టుకునేలా చేసింది. అందుకే నా కలానికున్న ప్రత్యేక లక్షణం "ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇన్నర్ సెల్ఫ్"
నా ఫీలింగ్స్ నీ, సమాజం దానిని ఏక్సెప్ట్ చేసిన విధానాన్ని అందరికీ తెలపటమే నా సాహిత్యానికి మూలం అని నమ్మాను. ఆ జాగృతిని అందరికీ అందించాలనే అరుణోదయంలోని చెతన్యం ప్రపంచానికి దీపికలా, నా పేరులోని మొదటి అక్షరం శ్రీ కి జతపరిచి "శ్రీఅరుణం" అనే కలం పేరిట నా అక్షరాలను అందరికీ అందించటం ప్రారంభించాను. అలా మొదలుపెట్టిన నా తొలికవిత 2007లో ఆంధ్రభూమిలో అచ్చయింది. అలా ఇప్పటికి సుమారు వందకవితలవరకూ వివిధ పత్రికలలోనూ, దినపత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. అందులో నా తొలికవితను ఇక్కడ వుంచుతున్నాను.

ఈ గుండె గదులలో…

కనురెప్పలు శ్వాసిస్తే కలలు మేల్కొంటాయి
హృదయపు కొలను నుండి ….
ఙ్ఞాపకాల రంగులను ముంచి తెచ్చుకుంటాయి
నేను నువ్వుగా..నువ్వు నేనుగా చిత్రితమవుతున్న ఆశలను..
విరహమనే కాన్వాసుపై..ముద్రించుకుంటాయి .
అనంతవిశ్వాన్నీ జయిoచగల వూహల గమ్యo..
నీ దగ్గరకొచ్చేసరికి ఆగిపోతుంది.
నేనంటే ఇంకేంలేదు..అంతా నువ్వేనంటూ.
నా గుండెలపై తారాట్లాడిన.. నీ చేతివ్రేళ్లు
నా నుదిటిన చుంభించిన నీ బుజ్జి పెదవులు
ఆస్వాదనతో నిండిన మెడపై చెమటను
తుడిచిన అమ్మలాంటి చేతులూ,
ముద్దుగా నెత్తిపై కొట్టి “అమ్మోదేవుడిపేరంటూ”
వెనుకగా హత్తుకొని భుజంపై వాల్చిన తల
.....ఎన్నని చిత్రించనూ..ఈ గుండె గదులలో …..
నిజంగా...
అరుణానికి సంపూర్ణ వర్ణం ఎవరు గీయగలరు???

ఇక నా పోరాటంలో నేను నిలదొక్కుకోవటానికి నా సాహిత్యం నాకు ఎలా సహకరించిందో తరువాత భాగంలో చెప్పుకుందాం.
మీ
శ్రీఅరుణం
9885779207
విశాఖపట్నం

Thursday, July 24, 2014

part 5


  1. ప్రత్యమ్నాయం
    ఇది నిజానికి మన ఓటమిని ఎదుర్కొనే మార్గంలో భాగం కాదు.సమస్యను ఎదుర్కొనే దిశలో మనలో సహజంగా ఏర్పడే వత్తిడి, భవిషత్తుపట్ల భయం వంటి లోపాలను తొలగించుకోవటానికి ప్రత్యమ్నాయం అనేది గొప్ప శక్తినిస్తుంది. మనం ఇంతగా తెగించి చేస్తున్న ఈపనిలో ఏదైనా కీడు జరుగుతుందేమోనన్న సంశయం, ఆశించింది దొరకకపోతే... ఏం చేయాలి? ఏమయిపోతాం? మళ్లీ ఈ కాలమూ,డబ్బూ, అవకాశమూ దొరకకపోతే ఏమైపోతాం? నిజంగా చాలామంది ఈ ఆలోచనవద్దనే ముందడుగు వేయలేక ఆగిపోతున్నారు.ఇటువంటి ఆలోచన వీరిని ఒక అడుగు ముందుకు వేస్తే.. రెండగులు వెనక్కి వేసేలా తయారుచేస్తుంది. అటువంటివారు ప్రత్యామ్నయవ్యవస్థనూ తమ దారిలో భాగంగా చేసుకోవటం ఉత్తమం.
    అప్పటికే నాకు పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలున్నారు.దిగువ మధ్యతరగతి కుటుంబం.ఆదాయం నష్టాలతో వుంది.అందువల్ల మరో మార్గం చూసుకుందామని ప్రయత్నం.కానీ దానికో తెగించి డబ్బుకానీ, సమయంకానీ, బిజినెస్ కానీ త్యాగం చేయలేని పరిస్థితి???
    ఇంతా చేసి నేను అనుకున్నది సాధించలేకపోతే???
    నా ఈ ప్రయత్నం వలన ప్రతికూలమైన ప్రభావం తనతో పాటూ తన కుటుంబం కూడా అనుభవించాల్సి వస్తుంది కదా???ప్రస్తుతం చేస్తున్న బిజినెస్ కూడా దెబ్బతినవచ్చుకదా???
    మళ్ళీ నాకు జీవితాన్ని సాధించుకునే అవకాశం వుంటుందా???
    ఈ నాలుగు ఆలోచనలతో భారమైన నాఅడుగులకు నేను చూపించుకున్న సూత్రమే... "ప్రత్యామ్నాయంతో నీవనుకున్న దానిని ముందుకు తీసుకువెళ్ళగలగటం".
    మొదట నా మనసులో వున్నది ఒక పరీక్షలో విజయం సాధించటం ద్వారా సమస్యలనుండి బయటపడటం మాత్రమే. కాకపోతే.. ఆ ప్రయత్నానికి ముందు నేను కోల్పోవాల్సివున్న సమయం, డబ్బు వంటివాటిని పూరించే మార్గం కుడా కోరుకున్నాను. అవి దొరుకుతాయన్న ధైర్యం ఏర్పడితే తన ప్రయత్నం విజయవంతంగా పూర్తిచేసుకోగలననిపించింది. అందువల్ల అప్పటినుండీ నా మార్గాన్ని రెండుగా విభజించాను.
    ఒకటి... విజయం సాధించేదిశగా ప్రణాళిక.
    రెండు... ఏమాత్రం ఓటమి ఎదురైనా..నేను చేస్తున్న ప్రయత్నం ద్వారానే మళ్ళీ ఎదగటం.
    అందుకే నేను ప్రిపేరవుతున్న అంశాలను ఎప్పటికప్పుడూ క్రోడీకరించుకుంటూ..సొంతంగా తయారు చేసుకున్న నోట్స్ ప్రింట్ చేసుకుని దాచుకున్నా. నా ప్రిపరేషన్ లో భాగంగా అద్దం ముందు కూర్చుని తనకితానే క్లాస్ చెప్పుకునేవాడ్ని.అలా చెప్పుకున్న క్లాస్ ని సెల్ ఫొన్ లో రికార్డ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ వింటూ తప్పుల్ని సవరించుకునేవాడ్ని.
    ఇలా ఒక విధ్యార్ధిగానేను చేస్తున్న కృషినే, ఒక అధ్యాపకుడిగా మలుచుకున్నాను.
    రెండుమూడుసార్లు ప్రయత్నం కొనసాగింది.అతనికి మంచి మార్కులే వచ్చాయి, కానీ రిజర్వేషన్లూ మరియూ ఇతర రోస్టర్ పాయింట్ల వలన ఉద్యోగం మాత్రం దోబూచులాడుతూనేవుంది. మొదట్లో నా మనస్తత్వంలోనే నేను ఇప్పటికీ వున్నట్లయితే ఆ ఫలితానికి అతను ఎంతగా కృంగిపోయివుండేవాడినో??? కానీ ఇప్పుడు అలా జరగలేదు.
    నిజానికి పరీక్షలవగానే ఫలితాలకోసం ఎదురు చూడలేదు. అప్పటి వరకూ తయారుచేసుకున్న మెటీరియల్ అంతా సిధ్ధం చేసుకుని, పుస్తకాల రూపంలో మార్కెటింగ్ చేయటం ప్రారంభించాను. సొంతంగా ఒక ఎడ్యుకేషన్ హెల్ప్ డెస్క్ పెట్టుకుని, దాని ద్వారా చాలామందికి పరీక్షల విషయమై సహాయం చేయసాగాను.ఇలా పెరిగిన నా సర్కిల్ మరింతగా ముందుకు సాగేందుకు అవకాశం కలిగించింది. ఇంటిదగ్గరలో వున్న ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులుని సంప్రదించి, స్కూలు ఖాళీ సమయంలో తరగతులు నడుపుకునేలా అనుమతులు పొందాను. అలా కొందరికి ఉచితంగా శిక్షణ ఇస్తూ, తన బోధనాపటిమనూ మరియూ పరిచయాలనూ మరింతగా అభివృధ్ధి చేసుకున్నాను.
    ఫలితాలొచ్చేసరికి దాని గురించి బాధపడుతూ కూర్చోకుండా.....ఇలా తన సొంత అనుభవాలే పెట్టుబడిగా చరిత్ర, రాజనీతి శాస్త్రం, ఇంగ్లీష్ అధ్యాపకుడిగా నిలదొక్కుకున్నాను. ప్రత్యమ్నాయపు బలం అదే.
    ఇలా ఇవన్నీ సమస్య పరిష్కారానికి మార్గాలే. అయితే వాటిని ఆయా కాల మాన పరిస్థితులకు అనుగుణంగా మన అవసరాలకు దగ్గరగా ప్రణాళికాబధ్ధమైన రీతిలో నిర్వహించగలిగినప్పుడు..జయం మీకు నల్లేరుమీద నడకే.
    ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, సమస్యని పరిష్కరించటమూ విజయం సాధించటమూ ఒకటే కాదు. రెండు దారులతో సాగే ఒకే గమ్యం అవి. సమస్యని పరిష్కరించటంలో ఇప్పటివరకూ మనం చెప్పుకున్నవి సహాయపడుతుంటాయి. విజయం సాధించటానికి మాత్రం మరికొన్ని అంశాలు కావలసివస్తాయి.పరిష్కరించబడిన సమస్య మార్గాన్ని చూపెడుతుంది, కానీ సాధించబడిన తరువాతే విజయం గమ్యాన్ని చేరుతుంది. ఈ తేడాని మాత్రం ఎప్పుడూ మరచిపోకండి. విజయం ఒక నిరంతరయానం మనకు జీవితం వున్నంతవరకూ.అది మనం గుర్తిస్తేనే హృదయమూ మెదడూ నడవడికా అన్నీ చైతన్యవంతంగా ఉండి జీవితంలో ముసలితనం అనే జడత్వాన్ని మన చెంతకు రానీవు. 114 సంవత్సరాలు బ్రతికిన మనిషి ఇంకేం సాధిస్తాడులే అనుకోవద్దు. ఆ 114వయస్సే అతను సాధించిన గిన్నిస్ రికార్డ్ కదా.
    అయితే నా ప్రధానలక్ష్యం మాత్రం ఇంకా పోరాటం సాగిస్తూనేవుంది.కాకపోతే కొందరుమనుష్యులూ, మరికొన్నిమలుపులు నాతో ఆడుకోవటమూ ప్రారంభించాయి. వాటి గురించి తరువాత భాగంలో చెప్పుకుందాం మరో నాలుగురోజులతరువాత.
    మీ
    శ్రీఅరుణం
    9885779207
    విశాఖపట్నం

Tuesday, July 15, 2014

part-4


ఒక వృత్తిపనివాడిగా వుంటూ చదువుకున్న నాకు అందుబాటులోకి వచ్చిన మొదటి అవకాశం ప్రభుత్వౌద్యోగానికై పోటీపరీక్షలకు ప్రిపేర్ కావటం. పి.జి.వరకూ సంపాదించిన అర్హత నాకు ఆ మార్గాన్నిచ్చింది. దాంతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీష వారి ఉధ్యోగ ప్రకటన చూశాను.అవి గ్రూప్ 1,2,4 కేటగిరులకు సంబంధించినవి. నిజానికి అప్పటికి నా మనసులో వున్నది రెండే అంశాలకు చెందిన విఙ్ఞానం మాత్రమే. అవి..
నా డిగ్రీకి సంబంధించిన సబ్జెక్ట్స్ పై వున్న పట్టు,
మరియూ… ఆ ఉధ్యోగాలకు అప్లయ్ చేసి ప్రిపేర్ అవ్వాలన్న తపన. ఇవి రెండే నన్ను ముందుకు నడిపించాయి. వాటి సహాయంతో నేను ముందుగా ఇలా నిర్ధారించుకున్నాను.
"నా ఆదాయం తగ్గబోతుంది. ప్రస్తుతానికైతే నా అదనపు పని ద్వారా సంపాదించుకున్నది అక్కరకొస్తుంది. కానీ కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు, అందువల్ల ఇప్పటినుండే నేను మరో అవకాశం కోసం ప్రయత్నించాలి". అందుకోసం నాకు రెండు మార్గాలు తోచాయి. ఒకటి.. నాదగ్గరున్న డబ్బుతో బిజినెస్ ప్రారంభించటం,
రెండు.. కొంత కాలాన్నీ, కొంత డబ్బునీ వెచ్చించి నా దగ్గరున్న లక్షణాలతో మరింత మంచి పొజీషన్ సంపాదించటం. అందుకొరకు ప్రస్తుతం కాలం నా చేతుల్లో వుండనే వుంది. ఇక డబ్బుకుడా వుంది. కాకుంటే ఫలితం మాత్రం ఖచ్చితంగా మంచిగా రావాలి, లేకుంటే కాలంతో పాటు ఇన్నాళ్ళూ సంపాదించిన డబ్బు తిరిగిరాదు. ఇది ఒకరకంగా నాకు తప్ప మావాళ్ళెవరికీ ఇష్టం లేదు. అందువల్ల ఈసారి నేను మరింతగా హార్డ్ వర్క్ చేయాల్సివుంటుంది.
ఒకటి.. నేను గెలవటానికీ.
రెండవది.. నన్ను నమ్మిన వాళ్ళు ఓడిపోకుండా చూడటానికి.
అంటే నా వర్క్ ఇప్పుడు ఎంతో హార్డ్ గా వుండాలికదా.సరే అందుకే ఈ రెండు బాధ్యతలనీ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ నేను నా హార్డ్ వర్క్ ని రూపొందించుకున్నాను.
ఇప్పుడు మా పని వున్న స్థితిలో రోజు మొత్తం మీదా ఐదు గంటలకి మాత్రమే సరిపోతుంది. ఇది మాములు ఖర్చులకు సరిపోతుంది. అంటే మిగులు కానీ, అదనపు సంపద కానీ వుండవు.
"అందువల్ల నేను ఉద్యోగానికై బయట ప్రిపరేషన్ తీసుకొనే అవకాశం దాదాపు కత్తిమీద సామే"
అంతకంటే నాకు మిగులుతున్న అదనపు సమయాన్ని మరింత ఎక్కువగా చదవటం ద్వారా, మంచి జాబ్ సాధించి ఈ వెనకబడిన పరిస్థితుల నుండి బయటపడనూ వచ్చూ, అలాగే నా వాళ్ళకు అభధ్రతా భావం లేకుండా తొలగించనూవచ్చు.
అందుకోసం `నాకు పని లేక మదన పడుతున్న సమాయాన్ని హార్డ్ వర్క్ అనే దారిలో మళ్ళీంచగలిగితే చాలు`.
అలా సుమారు మరో ఆరు సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది. ఎ.పి.పి.యస్,సి, వారి గ్రూప్స్ పరీక్షలలో విజయంకోసం నేను హార్డ్ వర్క్ ప్రారంభించాను. నిజానికి మాములుగా కేవలం అదే పనిమీద మనసుపెట్టి హార్డ్ వర్క్ చేస్తే ఒక సంవత్సరంలొ జాబ్ సంపాదించవచ్చు. కానీ...
నా సొంత పరిస్థితులతో అంటే ఒకవైపు వృత్తిచేసుకోవాలి,
మరోవైపు కుటుంబబాధ్యత చూసుకోవాలి,
అన్నిటికంటే ముఖ్యమైన అడ్డంకి బయటకి వెళ్ళి చదువుకోలేని పరిస్థితి.
వీటిని ఎదుర్కొంటూ నేను ఆ విజయం సాధించాలి కనుక... ఆ సమయం పట్టింది. అయితే ఇక్కడ నాకు హార్డ్ వర్క్ అనేది నాతోపాటుగా అప్పటికే నా చుట్టూ అల్లుకున్న కుటుంబ బంధాలకు ఆలంబనగా నిలిచి, నాకు ఎంతో గొప్ప సాయం అందించగలిగిందన్నది మాత్రం వాస్తవం గా నిలిచిన సత్యం. ఇక్కడే మీకు మరో నిజం చెబుతున్నాను. నిజానికి అంతగా నేను నా లక్ష్యాన్ని నమ్మి నడుస్తున్నా...నాలోనూ కొన్ని అనుమానాలు వెంటాడుతుండేవి. అవి...
ఒకవేళ నేను ఈ ఉద్యోగసాధనలో నెగ్గలేకపోతే...తరువాత భవిష్యత్ లో ఎలా స్థిరపడాలి?
మరోక ప్రత్యమ్నాయం దొరికేంతవరకూ కాలం, డబ్బూ, బాధ్యతలూ ఆగవుకదా...వాటిని ఎలా అనుకూలంగా మలుచుకోవాలి?
ఈ ఆలోచనలే నాకు నా లక్ష్యసాధన నుండే భవిష్యత్ ప్రణాళికను కూడా తయారుచేసుకునే విధానాన్ని నేర్పాయి. అందువల్లనే నేను అధ్యాపకుడిగా కూడా మారగలిగాను. దానికి సంబంధించిన ఒక నిజాన్ని ఇక్కడ చెప్పాల్సివుంది. తరువాత భాగంలో చెప్పుకుందాం మరో రెండురోజులతరువాత.
మీ
శ్రీఅరుణం
9885779207
విశాఖపట్నం-1

Saturday, July 12, 2014

part-3
నాకు తెలిసీ ఈ ప్రపంచంలో ఓడిపోవటానికంటే గెలవటానికే ఎక్కువ మార్గాలున్నాయి. ఎందుకంటే?...ఓటమి ఒక ఫలితానికి గుర్తు. కానీ...ప్రతీ ప్రయత్నానికీ గెలుపన్ననమ్మకమే నాంది. అందుకే నా అవసరాలకుసరిపడినంతగా ఆదాయం రాకున్నా ప్రస్తుతానికి అవసరం కనుక పనిలోనే కొనసాగుతూ చదువనే ఒక్క అవకాశాన్ని నమ్ముకోవటంవలన నా భవిషత్తుకోసం నాకున్న అవకాశాలను వెతుక్కోవటం ప్రారంభించగలిగాను. అలా ఒక వృత్తిదారుడనైన నాకు ఎన్ని అవకాశాలు మార్గాలుగా మొదలయ్యాయంటే... 
1.అధ్యాపకుడిగా
2.ప్రభుత్వ ఉద్యోగానికై పోటీపడే అభ్యర్ధిగా 
3.క్రీడాకారుడిగా
4.రచయితగా 
5.సామాజికసేవా చేయగలిగే ఙ్ఞానం సంపాదించగలిగేలా
6.నాటక దర్శకుడిగా,నటుడిగా
7.కొందరి మాటల్ని నమ్మి అవే వాస్తవాలని ముందుకుసాగి మోసపోయినవాడిగా,
8.ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి, మళ్ళీ నాకునేనుగా నిలదొక్కుకొని, నాలాగా బాధపడుతున్నవారి ఊరట కల్పించాలన్న సంకల్పంతో ఇలా రాస్తున్న వ్యక్తిగా...ఇలా చెప్పుకుంటూపోతే చాలారకాలుగా నాకు అవకాశాలు కనిపించటం మొదలయ్యాయి. 
ఇక్కడే మీకొక విషయం చెప్పాల్సి వుంది. ఇన్ని అవకాశాలు దొరికాయికదా మరి నా విజయాల సంగతేంటని మీకు అనుమానం రావొచ్చు. అక్కడేవుంది అసలైన ట్విస్ట్. నిజానికి మొదట్లో చెప్పినట్లు నాకు లభించిన ప్రతీదానిలో నేను జీవితాన్ని సెటెల్ చేసుకునేంతగా విజయాలను సొంతం చేసుకోలేని పరిస్థితులే ఎదురయ్యాయి. అలాంటి స్థితులలో నేను ఆత్మహత్య వరకూ వెళ్ళాలని నిర్ణయించుకున్న సందర్భాలూ వున్నాయి. అప్పుడే వాస్తవాలకూ జీవితాలకు వున్న బ్యాలెన్స్ అర్ధంచేసుకోవటం మొదలుపెట్టాను. 
జీవితం బ్రతుకుతెరువుకోసం తాపత్రయపడితే...
వాస్తవం బ్రతుకుమీద తీపిని నిలుపుకోవటానికి పనికొస్తుందని తెలుసుకున్నాను. 
ఇదంతా తెలుసుకుని నిలబడటానికి నాకు లభించిన అవకాశాలను ఒక్కొక్కటిగా చెప్పుకుందాం.
మొదటగా అధ్యాపకుడిగా నాప్రస్థానం చెప్పుకుందాం తరువాత భాగంలో మరో రెండురోజులతరువాత.

శ్రీఅరుణం
9885779207
విశాఖపట్నం-530001

Tuesday, July 8, 2014

మనలో చాలామందిమి.....

PART.2
మనలో చాలామందిమి అవసరాలను తీర్చేసుకోవటానికి ఇచ్చేంత ప్రాధాన్యత, అవకాశాలను అందిపుచ్చుకోవటానికి ఇవ్వం. అయితే ఆ రెండిటికీ మద్యనున్న తేడాను స్పష్టంగా తెలుసుకొని ఆచరణలోకి తేగలిగినవారే జీవితమనే సుధీర్ఘకాలంలో వచ్చే మార్పులకు అనుగుణంగా సరైన ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ సూత్రం నాకు పుస్తకపఠనం ద్వారా లభించింది. నేను స్వర్ణకారవృత్తిలో వున్నప్పటికీ చదువంటే నాకున్న ఇష్టం ఎప్పుడూ తగ్గలేదు. చదువంటే కేవలం స్కూల్ కి వెళ్ళి చదివితే అబ్బేదికాదుకదా. అందుకే నాకున్న్నవీలునుబట్టీ పుస్తకాలు సేకరించి చదువుకునేవాడిని. అలా నాకున్న అవకాశాలను తెల్సుకుంటూ మెట్రిక్యులేషన్ ప్రైవేట్ గా రాశాను.ఉదయం 7.30 నుండి రాత్రి 9.30వరకూ నా పనిలో ఖాళీ వుండేదికాదు. మరి చదవటానికి సమయం ఎలా? ఇక్కడే నేను అవసరానికీ, అవకాశానికీ మద్యనున్న ఫలితాన్ని నమ్ముకున్నాను. నా పనివలన వచ్చే ఆదాయంతో కుటుంబ పరిస్థితులనే అవసరాలను తీరిస్తే, నా భాద్యతలు సర్దుకుంటాయి, కానీ...
సీజన్ పరంగానూ,
పోటీపరంగానూ,
మారుతున్న ఆధునికతపరంగానూ మనస్థానాన్ని నిరంతరం నిలుపుకోవాలంటేమాత్రం కొత్తకొత్త అవకాశాలకు అనుగుణంగా మనం మారాల్సివుంటుంది. ఆ మార్పుకు సరిపడేలా నన్నునేను నిలుపుకోవాలంటే మరికొంతసమయం తప్పదని నిర్ణయించుకున్నాను. దానికి సరిపడేలా రాత్రిసమయాన్ని మలుచుకున్నాను. అలా మెట్రిక్, ఇంటర్, డిగ్రీ, పి,జి. మంచి పర్సెంటేజ్ తో పాస్ కాగలిగాను. ఇదంతా నా పని మానకుండానే.
సరే....ఈలోపు పెళ్ళీ పిల్లలూ నాజీవితంలోకి వచ్చేశారు.
మరోవైపు తొంబైల్లో ప్రారంభమైన ఆర్ధికసంస్కరణల పూర్తి ప్రభావం ఈ పదిసంవత్సరాలలో పూర్తిగా అన్ని చేతివృత్తులపైనా విరుచుకుపడింది. నిజానికి నేను నా అవసరాలు తీరుతున్నాయని అక్కడే వుండిపోతే నా చేతిలో కేవలం ఒడిదుడుకుల్లో వున్న చేతివృత్తి మాత్రమే మిగిలిపోయుండేది. ఇప్పటికీ చాలామంది చేతివృత్తిదారులు అదే త్రిసంకుస్వర్గంలో నానావస్థలూ పడుతూనేవున్నారు. ఎందుకంటే వారికి అదితప్ప మరోప్రపంచం తెలీదు పాపం. చిన్నప్పుడే పనిలోకి రావటంవలన చదువుకూ దానివలన ప్రపంచవిధానాలకూ దూరంగావుండాల్సిన పరిస్థితికి వారు లోనవుతారు. దానికితోడు భద్రతలేని వృత్తి అవటంవలన నిరంతరంగా కాపాడుకోవటానికి విపరీతమైన ఒత్తిడిని అనుభవించాల్సినస్థితి!!! అందువల్లనే వారు మరోవైపుకివెళ్ళే ధైర్యం చేయలేకపోతారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితిలోనే నేను పూర్తిచేసిన ఉన్నతచదువు నాకు మరో అవకాశంవైపుకి నడిపింది.
ఆ అవకాశం ఎలాంటిదో మరో రెండురోజులుపోయాక ఇక్కడే కలిసి చెప్పుకుందాం.

మీ శ్రీఅరుణం
విశాఖపట్నం
9885779207
A.V.N.COLLEGE DEGREE PHOTO.

Sunday, July 6, 2014

తొంబైవ దశకంలో మొదలైన ఆర్ధిక సంస్కరణలు...

PART 1
మాది స్వర్ణకారవృత్తి చేసుకునే విశ్వబ్రాహ్మణ కుటుంబం. నేను 8వ తరగతిలో వున్నప్పుడు నాన్నగారికి ఆరోగ్యసమస్య రావటంవలన...డాక్టర్ గారి సూచనమేరకు నేను చదువుకు తాత్కాలికంగా స్వస్తిచెప్పి స్వర్ణకారవృత్తిలోకి ప్రవేశించాను. నేను పనిలోకి ప్రవేశించేనాటికి దేశంలో ఆర్ధికసంస్కరణలు మొదలవటం ప్రారంభమయ్యాయి. కొంతకాలంవరకూ సంపాదనగానేవుంది కానీ తరువాతపరిస్థితులలో మార్పొచ్చింది.
తొంబైవ దశకంలో మొదలైన ఆర్ధిక సంస్కరణలు దేశానికి ఏం చేశాయో చెప్పడానికి పెద్ద ఆర్ధిక వేత్తలున్నారు, కానీ... వాటి ప్రభావంవలన మాలాంటి చేతివృత్తులవారి జీవితాలు ఎంతగా బుగ్గిపాలయ్యాయో మాత్రం మాకు మాత్రమే తెలుసు. ప్రభుత్వాలు ఏవో చేశాయంటున్నాయి కానీ, పని చేసేవాడికి కల్పించాల్సిన సరైన ప్రత్యమ్నాయాన్నీ మాత్రం అందించలేక పోయాయనే చెప్పాలి. పనివాడికి కావలసింది పనే. అంతేకానీ కొంత డబ్బు ఇస్తే వాడికి జీవితం ఇచ్చినట్లా? దేశం కొసం సంస్కరణలు చేయటం మంచిదే, కానీ రోజు కూలీపై బ్రతికే వారిని రొడ్డున వదిలేసి దేశాన్ని ఎలా బాగుచేస్తారు? పోనీ వారికోసం ఏదైనా కార్యాచరణ చేశారా అంటే.. అది మధ్యవర్తుల వద్దనే మ్రింగుడైపోయింది. సొంత అనుభవంతో చెబుతున్నా.. సంస్కరణలు దేశంలో పేదవారికోసం, వృత్తిదారులకోసం, స్వయంగా బ్రతుకుతున్న వారికోసం చేసిందేమీలేదు. వారంతట వారు నిలదొక్కుకోవటమో, లేక చావటమో చేస్తున్నారు...ఇప్పటికి కూడా. అలాంటి స్థితులలో నా పని కూడా దెబ్బతింది. లైసెన్సులు రద్దుకావటంతో పెట్టుబడిదారులకి దారులు పూర్తిగాతెరుచుకున్నాయి. రెడీమేట్ సంస్కృతి విచ్చలవిడిగా మారింది అన్నిటిలోనూ. ఆ దారిలో మాలాంటి వారంతా నలిగిపోయారు. ప్రభుత్వానికి లెక్కలు పెరిగితే చాలు, ఇక ఎవడికి వాడే చచ్చీచెడీ తమ జీవితాలను పునర్ నిర్మించుకోవాల్సిన స్థితి!!!
తరువాతభాగం కొరకు మరో రెండురోజుల తరువాత ఇక్కడే కలుద్దాం

శ్రీఅరుణం
9885779207

Tuesday, June 24, 2014

పెళ్ళి ఇద్దరు మనుషుల జీవితాలను కలిపే వ్యవస్థ. పెళ్ళివేడుక కొన్ని కుటుంబాలను కలిపే వేధిక. ఎవరిపనులలోవారు మునిగిపోయే ఈ వేగపు ప్రపంచంలో అనేక ప్రాంతాలనుండి, అనేక పనులనుండి, అనేక వర్గాలనుండి ఆయా కుటుంబాలకు చెందిన వారంతా కాసేపు అన్నీ మర్చిపోయి ఆనందంతో కేరింతలుకొట్టే సందర్భం పెళ్ళివేడుక. మా కుటుంబంలో జరిగిన అలాంటి ఒక పెళ్ళివేడుకని మేమంతా ఇలా కలిసి ఎంజాయ్ చేశాము.

Saturday, June 21, 2014

షర్మిళమ్మ

అభివృద్ధిని నిరంతరం కోరుకునే మన సమాజంలో స్త్రీలు ఎంతగా గౌరవించబడుతున్నారో....మనందరికీ తెలుసు. 1961లో వరకట్ననిషేదచట్టం చేశారు, కాని ఇప్పటికీ వరకట్నం ఎంతగా మనమద్యనుండి నిషేదించామో మనహృదయాలకే తెలుసు. అలాగే నిర్భయచట్టం వంటివాటిని ఎంత కఠినతరం చేసినా ప్రతీరోజు మనచుట్టూ మహిళలపట్ల ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో చదువుతూనేవున్నాం. అలాంటి వాటికోవకు చెందినదే ఇటీవల షర్మిళ చెల్లి విషయంలో జరిగిన సంఘటన. 
విషయమంతా
 నేనిప్పుడు చెప్పాల్సిన అవసరంలేదు, ఒక చెల్లిపై జరిగిన పైశాచికవాదం అది అంతే. ఇలాంటివి సృష్టించేవారికి నేను చెప్పెదొకటే. ఇలాంటి నీతిమాలినపనులు చేసేముందు ఒక్కసారి మీఇంట్లో మీతోపాటు పెరిగిన మీ అక్కనీ చెల్లెలినీ గుర్తుకుతెచ్చుకోండి. ఒక ఆడపిల్లజీవితాన్ని బయటకులాగటమంటే మన జాతి సంస్కృతిని బజారుకీడ్చినట్లే. అది ముందు మీ తల్లితండ్రులు మీకిచ్చిన వారసత్వపు విలువల్నే విచ్చిన్నం చేస్తుంది.ఇలాంటి నీచపుపనులను ఎవరుచేసినా ప్రొత్సహించటం అతిపెద్దపాపం. ఈ తప్పు జరిగిన సమాజంలో ఒకడిగా షర్మిళమ్మకి క్షమాపణలు చెప్తున్నాను.
ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో...అక్కడ పవిత్రత, ధర్మం వర్ధిల్లుతాయి - భగవద్ఘీత.

శ్రీఅరుణం.


9885779207
విశాఖపట్నం-530001

Friday, June 20, 2014

సివిల్స్ ప్రణాళిక.....

నాకు తెలిసీ `ఈ ప్రపంచంలో ఓడిపోవటానికంటే గెలవటానికే ఎక్కువ మార్గాలున్నాయి` కావలసిందల్లా.. వాస్తవం గ్రహించగలిగిన అవసరం మాత్రమే. అప్పుడే ఆ అవసరం మనకు అవకాశాలను పెంచుతుంది.
సివిల్స్ కి ప్రిపేరవుతున్న ఇద్దరు స్నేహితులు, దానికి అవసరమైన టైం టేబుల్, డబ్బు, ఇతర అంశాలలో ఎంతో చక్కగా ప్రణాళిక సిధ్ధం చేసుకున్నారు. ఇందులో రెండవవాడు తన స్నేహితునితో పాటూ చదువుతూనే... అతనికి తెలియకుండా తనకి మరో ప్రణాళిక తయారుచేసుకున్నాడు. వారిద్దరి ప్రణాళిక ప్రకారం వుదయం ఏడు గంటలకి ప్రారంభించే చదువు రాత్రి పది గంటలవరకూ సాగుతుంది. అంటే సుమారుగా పదిహేనుగంటలు. నిజానికి వారి అవసరానికి అది సరైన హార్డ్ వర్కే. ఇది అలా కొనసాగటం ప్రారంభమైంది.
ఇక రెండవ వాని అదనపు పని రాత్రి పదకొండు గంటలకి తన ఇంట్లో మొదలవుతుంది. అలా మొదలైన చదువు అర్ధరాత్రి మూడువరకూ కొనసాగించి పడుకోనేవాడు. అందుకొరకు మొదటివాడికి తెలియకుండా మళ్ళీ ప్రత్యేకంగా బుక్స్, నోట్స్ తయారుచేసుకోవటం మొదలైంది. ఇది కొంత అదనపు పని అతనికి. అయితే
విపరీతమైన శ్రమా,
అవసరానికి మించిన సమయం,
అంతకంటే తను పొరపాటు చేస్తున్నానేమోనన్న చిన్న లోపలి భావం… ఇవన్నీ అతనిలో తన అవసరానికి మించిన డిస్టర్బెన్స్ ని కలిగించటం మొదలెట్టాయి. అది కన్ఫ్యూషన్ కి దారితీసింది. మాములు ప్రణాళికలో కూడా వెనక బడిపోయాడు. చివరికి పరీక్షలనాటికి తీవ్రమైన జ్వరంతో అనుకున్న లక్ష్యం పూర్తి చేయలేకపోయాడు. అతని మిత్రుడు మాత్రం తన ప్రణాళికని ఖచ్చితంగా పాటించి విజయాన్ని అందుకున్నాడు.
ఇప్పుడు నిర్ణయించుకోండి...పోటీప్రపంచంలో మీ స్థాయి ఏమిటో? దాన్ని ఖచ్చితంగా ఫిక్స్ చేసుకొని మీ లక్ష్యంవైపుకి సాగండి.

శ్రీఅరుణం.
9885779207
విశాఖపట్నం-530001

Tuesday, June 10, 2014

వివాహం :-

ఇద్దరు స్త్రీ పురుషులూ కలిసి జీవితకాలం గడుపుతూ, సమాజానికి క్రమబద్దమైన సంతానం, వారసత్వం, సంపదలను అందించటానికి ఏర్పడినదే వివాహవ్యవస్థ స్వరూపం. ఇందులో భార్యా భర్త ప్రధాన పాత్ర ధారులు.
భర్తంటే...తాళీ, తండ్రీ, తోడూ అనే మూడు ముళ్ళు కట్టి, వాటికి బద్దుడైన పురుషుడు.
ఆమెకూ, ఆమె బిడ్డలకూ తను ఒక నీడలా మారి బాధ్యత వహించాలి. అప్పుడే అతను భర్తగా మన్నింపబడతాడు.
తెలియని మనిషిని పెళ్ళి అనే ఒక కార్యక్ర
మంతోనే ఆడది అంతగా నమ్ముతుందంటే కారణం... ఈ విలువను అతను ఇచ్చితీరతాడనే విశ్వాసమే.
తన ప్రాణoకి సైతం తెగించి అతని బిడ్డలకు తల్లీ అవుతుందంటే కారణం, భర్త అనే స్థానానికి గల తండ్రి అనే రూపాంతరం.
ఆ విశ్వాసమే వివాహం అనే మహా వేధికకు నిలయమయ్యింది తప్ప, మరేదో మంత్రం వారిద్దరిమధ్యనా కట్లుకట్టలేదు.

శ్రీఅరుణం
9885779207
విశాఖపట్నం-530001

Wednesday, June 4, 2014

అందువల్లనే.....

అందువల్లనే అప్పటి నా స్థితిని నేను ప్రేమమయమో చేసుకోగలిగానుతప్ప… 
యాసిడ్ మయమో, 
ఆత్మహత్యమయమో, 
హత్యామయమో చేసుకోలేదు. 
అదే ప్రేమతో నువ్వు నడిస్తే... ప్రేమ నీకు దొరికే తోడుకి రూపం. ఆ మనస్సుతోనే తనకి సమాధానమిచ్చాను "ప్రేమ అంటే
అపూర్వమైన ఆనందా
ని అందించే మానసిక లోకం. 
ఒక మగాడికి ఒక స్త్రీ కావలసిరావటం పెళ్ళి. 
కానీ… ఒక మనిషికి మరో మనిషి తోడు కావలసిరావటం ప్రేమ. 
నన్ను వదులుకోవటం ద్వారా నువ్వు నీ జీవితానికి లాజిక్ దొరికిందనుకుంటున్నావ్. కానీ నీ మనసుకున్న లావణ్యాన్ని మాత్రం కోల్పోతావు. అది మాత్రమే ఇప్పటికి నేను చెప్పగలను. నీకు ఎప్పుడు ప్రేమ కావాలనిపించినా నేనున్నానని గుర్తుచేసుకో".
ఆమె తన జీవితాన్ని తను లాక్కెళ్ళిపోతుంది. అయితే ఆ యాత్రలో ప్రేమ అనే ఒక భావం తనకి ఎప్పుడు కలిగినా నేను గుర్తుకువస్తాను. నిజంగా అదే నేను సాధించుకున్న ప్రేమ. 


శ్రీఅరుణం
9885779207
విశాఖపట్నం-530001

Thursday, May 29, 2014

నా జీవితంలో ఒకరోజు మధ్యాన్నం.....

నా జీవితంలో ఒకరోజు మధ్యాన్నం రెండుగంటలసమయంలో, అప్పటికి సుమారుగా ఆరుసంవత్సరాలపాటుగా సాగిన ప్రేమ అనే సంబంధం…. కొన్ని పరిస్థితులనే అవసరాలు చుట్టుముట్టినప్పుడు, `పిరికితనం`అనే ఒక అవకాశాన్ని ఉపయోగిస్తూ ఇన్నాళ్ళ నా ప్రేమ బంధాన్ని ` టీనేజ్ లో తెలియక చేసిన తప్పు` అంటూ జస్టిఫై చేసి మార్చుకోవాలని చూసినప్పుడు...నేను కృష్ణతత్వం చదువుతూ ప్రేమతత్వం తెలుసుకుంటున్నాను. 
"కృష్ణుడంటే పాలసముద్రం. ఆ పాలు మధరమై మనకు అందాలంటే...తేనె కలాపాల్సిందే. ఆ తేనే మనం కోరుకొనే ప్రేమ. ఇక్కడ మనం ప్రేమ అనే తేనెని ఎంతగా పాలసముద్రంలో కలపగలమో... అంతగా కృష్ణుడు మనకి మధురమై లభిస్తాడు. ఇదే ప్రేమ తత్వం. అందువల్లనే ఎనిమిది మంది భార్యలనూ, వేలమంది గోపికలనూ, తనని మోహించిన ప్రతీ దాని వద్దనూ ఆయన ప్రేమ కనిపిస్తుంది" 
నేను ఆమె సంబంధాన్ని ప్రేమగానే నమ్మాను కనుకా...
ఆమెకి ఇవ్వటంలోనే తప్ప, తీసుకోవటంలో నాకు నమ్మకంలేదు కనుకా...
అంతగా నేను నమ్మిన ప్రేమని తను `తప్పు`గా చిత్రిస్తూ నా హృదయాన్ని గాయపరిచిన ఆ సమయంలో…….. నా చేతులలో కృష్ణుని ప్రేమ తత్వం వుందేమోనని నమ్ముతానిప్పటికీ. 
అలాంటి ఫలితం నాకు భగవంతుడిచ్చిందే కదా? 
అందువల్ల నాజీవితాన్ని నేను ఎలా మలుచుకోగలిగానన్నది తెలుసుకోవాలంటే...రేపు ఇక్కడే కలుద్దాం.

శ్రీఅరుణం


9885779207
విశాఖపట్నం-530001

Wednesday, May 28, 2014

ప్రేమ......

"ప్రేమ అనేది కూడా ఒక మానసిక భావనే" అంటూ నేను చెప్పడం ప్రారంభించగానే.. ఒక విధ్యార్ధి లేచి "అంతేనంటారా? సార్" అంటూ చాలా ఆతృత ప్రదర్శించాడు. ఇంతకీ అతని సమస్య ఏమిటంటే.. తను తీసుకుoటునట్లు తన ప్రేయసి.. తన ప్రేమని సీరియస్ గా తీసుకోవటం లేదని. తను ఎంత మనస్ఫూర్తిగా చెప్పినా, ఆమె మాత్రం "అంతుందా?" అంటూ తీసిపారేస్తూ రిప్లయ్ ఇవ్వటం, అతనిలో ఎన్నో సందేహాలను రేకెత్తిస్తుందట. అలాంటి సమయంలో నేను "ప్రేమ అనేది కూడా ఒక మానసిక భావనే" అంటూ చెప్పటం అతనికి చాలా రిలాక్స్ గా అనిపించింది. కానీ నిజానికి ఆ మాట నేను చెప్పకపోయినా అతని మనసు చెబుతూనే వుందతనికి. కానీ.. మరొక పుస్తకమో, పెద్దవారో, మేధావో... ఇలా అతని మనసుకు దగ్గర వున్నవి ఏవైనా, అదే మాటని చెబితే.. వెంటనే ఈ సందేహపు తలనొప్పినుండి బయట పడాదామని మనసులో చిన్న కోరిక. అది నా దగ్గర దొరకగానే అతను తన మనసు అప్పటివరకూ తయారుచేస్తున్న ఫైల్ ని ఇక ఏమాత్రమూ అలోచించకుండా.. సేవ్ చేసేశాడు.
ఏమిటీ ప్రాసేసంతా?
అసలు ప్రేమంటే ఏమిటి?
ఎలా అది మనల్ని చేరుతుందనేది నా అనుభవంలో ఎలా నాకు తెలిసిందో...ఈరోజునుండి 5రోజులవరకూ రాయబోతున్నాను.

శ్రీఅరుణం
విశాఖపట్నం
9885779207

Saturday, May 24, 2014

సాహిత్య సంస్కృతి



కలానికీ కాలానికి వివాహం నిశ్చయమైతే...
తెల్లనికాగితపు కాన్వాసుపై పొర్లాడే అక్షరాలే వారి తొలిరేయి ఙ్ఞాపకాలు.
జీవితకొక్కాలకు తగిలించేసిన ఆశల బూజు దులిపి
తెల్లారినా తరగని కావ్యకచేరీ చేస్తూనేవుంటారు.
గతజన్మలో వదిలేసిన గమకాలనూ ఏరుకొచ్చి
అనుభూతుల కోనేరుగట్టున.....
అనురాగపు మట్టిబొమ్మలను తయారుచేస్తుంటారు.
అంతస్థులచూరు పలకరిస్తున్నా...
తాటకులగుండెల్లోకి తొంగిచూస్తుంటారు,
అమృతంలో ఏముందంటారు?
గంజినీళ్ళతోనే ఘీంకరిస్తుంటారు,
శూన్యాన్ని అద్దంలో నింపేసి ప్రపంచంతో వాజ్యాన్ని మొదలెడతారు,
చందమామ సాంగత్యాన్నీ కాదని...
సూర్యుని భూజాలకెక్కాలని ప్రాకులాడుతుంటారు,
కర్ణున్నీ కృష్ణున్నీ కాదని...
మద్యలో లేచిన వికర్ణునిపై పుంఖానుపుంఖలు రాసిపడేస్తుంటారు,
భావాలను ఎక్కడ దొరుకుతాయో... అక్కడకు
పదాల అణుబాంబులను మూటలుగా భూజాన్న వేసుకుని
ప్రపంచవీదులన్నిటినీ ఊహల విమానాలతో చుట్టేస్తుంటారు,
కన్నీళ్ళు వారి కలానికి ఇంధనం
నోబుళ్ళూ, ఙ్ఞానపీఠ్ లూ వారి సాంగత్యానికి వారసత్వాలు
కక్షలలో బంధించబడిన కాంక్షలను సమాజానికి శుద్దిచేసి అందించే
వసుధైక కుటుంబానికి వారిద్దరే నిజమైన అమ్మా నాన్నలు.

శ్రీఅరుణం
విశాఖపట్నం-530001
సెల్ = 9885779207
e mail = sssvas123in@rediffmail.com

Wednesday, May 21, 2014

కామం అనేది......

కామం అనేది ఇద్దరు స్త్రీపురుషుల మధ్యన జరిగే ఒక మనసిక కళగా చెప్పిన వాత్యాయనుని కామసూత్రన్ని గౌరవించండి. జీవితంలోనే అలౌకికమైన అనుభూతిని అందించే కామరహస్యాన్ని అర్ధం చేసుకోండి. ప్రేమతో నిండిన ముద్దు కూడా నీకు జీవిత కాలం ఆనందించగలిగే అనుభూతిని అందిస్తుందన్న సత్యాన్ని, అనుభవపూర్వకంగా చెబుతున్నా నమ్మండి.
"వస్తాను నాకోసం చూస్తుండు" అని నా ప్రేయసి నాతో చెప్పిన ప్రేమ పలుకులే, నా ఊహలతో ఆశలై.. నాకు కవిగా గొప్ప అనుభూతులను అంధించగలిగాయి. ఇక ఆమె నా కౌగిళిలోకి వస్తే...అంతకంటే కామం నాకు ఏ దేవుడివ్వగలడు? అదే మీ ఆశ కావాలి కామసుఖం కొరకు.
వాంఛనీయమైన శృంగారానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి వివాహం. రెండు... నీకోసం ఏదైనా చెయ్యగల తోడుని అందించగలిగే ప్రేమ. ఇవిలేకుండా పొందే కామం... కేవలం అవసరం లేదా వ్యాపారం అంతే. అది మనిషికైనా పశువుకైనా ఒకటే. అలాకాకుండా...
సంద్రపు ఇసుక తిన్నెలపై...
పౌర్ణమి అందాన్ని వీక్షిస్తూ...
కెరటాల నీటితుంపరలు చల్లచల్లగా పలకరిస్తుంటే...
గాలికూడా దూరనంతగా బిగికౌగిళి బంధించివేస్తూండే అధ్బుత క్షణాలను అనుభవించి చూడండి.
ప్రేమ మాత్రమే నిండిన రెండు అరసున్నలవంటి స్త్రీపురుషుల శరీరాలూ ఆత్మలూ సంగమిస్తుంటే... అలాంటి కామంకోసం ఆనందంగా చచ్చిపోవాలన్న ఎదురెళ్ళమూ.

నా "అంతర్ భ్రమణం"పుస్తకం నుండి
శ్రీఅరుణం
9885779207

Saturday, May 17, 2014

మహాభారత ఉద్యమం


ప్రజాస్వామ్యమే గెలిచిందిప్పుడు. ఎన్ని ఆశలను ఎరవేసినా ప్రజల మనసులోతుల్లో చూపిన ప్రభావమే ఎప్పటికీ నిజమైన ఫలితాన్నిస్తుందనేది ఈ ఎన్నిక ఫలితాలు మరోసారి నిరూపించాయి. డబ్బూ, మద్యం, పధకాలూ, వాగ్దానాలూ...ఎవరు ఎన్ని చెప్పినా అంతిమ ఫలితందగ్గర మాత్రం ప్రజలమనోనిశ్చయాన్ని ఏమాత్రం మార్చలేకపోయారన్నది వాస్తవం. రాష్ట్రవిభజనపేరుతో ఒక సాధారణ విషయాన్ని తేల్చటానికి రెండుప్రాంతాల ప్రజల జీవితాలని అస్తవ్యస్తం చేసిన వారికి తమ సత్తా చూపించారు. తెలంగాణా కొరకు ఎందరో యువకులు బలిదానాలు చేస్తున్నా, నేలలతరబడి ప్రజలు రోడ్డుమీదకొచ్చినా, అలాగే సమైఖ్యాంద్ర కొరకు నెలలతరబడి ప్రజలు అరచి గగ్గోలుపెట్టినా, పిల్లలుసైతం ఎండలో ఉద్యమాలు చేసినా చలించని ప్రభుత్వానికి ఇలాంటి సమాధానం చెప్పి రెండుప్రాంతాలప్రజలు నిజమైన ప్రజాస్వామ్యన్ని బ్రతికించుకున్నారు. తెలంగాణాలో కాంగ్రేస్ కి కొంత అధిక్యం వచ్చినా అది తమ కలని నిజంచేసిందన్ని కొద్దిపాటి విశ్వాసం మాత్రమే. అంతకంటే తెలంగాణాకోసం అవిర్భవించిన టీఅర్.యస్. ని ప్రజలు ఎక్కువగా ఆదరించటానికి కారణం అంతిమంగా ప్రజలుకోరుకున్న లక్ష్యసాధానకోసం దేనికైనా తెగించినిలబడినందుకే అన్నది ఇక్కడ గమనార్హం. అదే భావజాలం సీమాంద్రలోనూ కనిపించింది చూడండి. సమైఖ్యాంద్ర సాధనలో భాగంగా ఎవరెన్ని మాయలను ప్రజలముందు ప్రదర్శించాలని చూసినా ప్రజలిచ్చినతీర్పులో కాంగ్రేస్ ఏమయ్యిందో...చూశాం కదా. అదొక్కటే నిజమైన ప్రజాతీర్పుకు సూచిక. మిగిలిన పార్టీల విషయమంతా వారివారి సొంతవ్యవహారం గానే సాగిందికదా. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నవి రెండు అంశాలే.
ఒకటి...ప్రజాస్వామ్యం మన దేశంలో ఇంకాబ్రతికేవుందన్న నమ్మకం.
రెండు...ఎన్ని రాష్ట్రాలుగా విడదీసినా తెలుగువాడి మనసు ఒకేలా ఆలోచించగలిగే భావజాలం కలిగివుంటుందన్న నమ్మకం.
ఈ రెండూ మిగిల్చిన ఆనందంతో నాభారతావనికి శిరస్సువంచి నమస్కరిస్తున్నాను.

శ్రీఅరుణం
విశాఖపట్నం
9885779207

Tuesday, May 13, 2014

ప్రేమ. అంతే...మరింకేమీ లేదు.



నిజంచెప్పు....నీలో వున్నది నేనే అయినప్పుడు...
నాకిప్పుడు నువ్వు దూరంగావున్నావని బాధెందుకు కలుగుతుంది???
నువ్వూ నేనూ కలిసి "మనం"అయ్యావన్నవే ...మరి...
నేనింకా నీదగ్గరకు రాలేదని కోప్పడతావేం???
నువ్వు చెప్పింది నిజమా...
నేను నమ్మింది నిజమా...
ఇన్నిసంవత్సరాల మన ప్రణయగమనంలో ...ఇంకా
ఒకరినొకరం నమ్మించుకోవాలా???
హృదయాలదగ్గర పరిపూర్ణమైన మన ఆశలను...
ఇప్పుడెవరు వచ్చి లాక్కుపోతారు???
నాకెప్పటికీ నువ్వే దేవతవైనప్పుడు...నేనింక ఏ దేవుడికోసం తపస్సుచేయాలి??
నాకంతా నువ్వే
ప్రే మా
కోపం
కసి
అసూయా
జీవితం
నమ్మవూ...నా మరణం కూడా నీదేరా.
శ్రీఅరుణం
9885779207

Sunday, May 11, 2014

అమ్మా......


పులకరించిన మేని....
పాశాన్ని పలకరిస్తే..
మతృత్వానికి అర్ధంచెబుతూ
అనురాగపుకేక మరో జీవితాన్ని హత్తుకుంటుంది.
నీడకుకూడా గొడుగుపట్టే అమ్మతనం
ఆర్తితోకప్పే చీరకొంగులా నిరంతరం నిన్ను కాపాడుకుంటుంది.
ఇకనుండి నీ ప్రతీఅడుగూ...
అమ్మ కళ్ళల్లో పుట్టే మెరుపులతో రక్షించబడుతుంది.
ఆ తన్మయం కోసమేనేమో...
తన గుండెల్ని చీల్చుకువచ్చినా నిన్ను తన ప్రాణంలా మార్చుకుంటుంది.
కనులముందు కణేల్ మంటున్న నిప్పుకణికని కౌగిలించుకుంటావా?
నచ్చినరంగే కదా అని రక్తాన్ని కుళ్లబొడుచుకోగలవా?
ఇవన్నీ అమ్మే చేయగలుగుతుంది
అందుకే దేవుడికైనా తాను అమ్మే అవుతుంది.
శ్రీఅరుణం
9885779207
విశాఖపట్నం-530001







Thursday, May 8, 2014

నా భారతదేశమా...నమో నమామి

మొరాయించిన ఈవియం లు, వరదలా పారుతున్న మద్యం, కట్టలు త్రెంచుకున్న డబ్బు, తిట్లూ, విమర్శలూ, దాడులూ, ప్రతిదాడులూ....మనమందుకొస్తున్న ఈ వార్తలని చూసి అదే భారత ఎన్నికల క్షేత్రమనుకోకండి. అదంతా రాజకీయం చాటున జరిగిపోతున్న అవకాశాలప్రపంచపు స్వరూపం మాత్రమే.
ఒక్కసారి దేశ పరిపాలనలో భాగమై సాగుతున్న సమర్ధత కలిగిన యంత్రాగపుకోణాన్ని పరిశీలించండి. అందుకు ఉదాహరణగా ఎన్నికల నిర్వహణని గమనించండి.
328 మిలియన్ హెక్టార్ల భుభాగం
121కోట్ల ప్రాజానీకం
35 నైసర్గికాలు
వీటినుండి సేకరించిన సుమారు డెబ్బైశాతం ఓటర్లు తమనితాము భారతీయుల్గా గుర్తించుకోగలిగే ఎన్నికల తతంగాన్ని పూర్తిచేయాలంటే ఎంత కార్యదక్షత కావాలి?
ఎన్నికలనోటిఫికేషన్
అభ్యర్ధుల స్క్రూటినీ
నామినేషన్ల స్వీకరణ
కోడ్ జాగ్రత్తలు
ఓటింగ్ ఏర్పాట్లు
ఓటర్ల జాగృతి
బూత్ ల నిర్వాహణ
శాంతి భధ్రతల నిర్వాహణ
సిబ్బంది కూర్పు
సమస్యాత్మక ప్రాంతాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
బ్యాలెట్ బాక్స్ ల కాపలా
ఓట్ల లెక్కింపు ఫలితాలు
ఇలా చెప్పుకుంటూపోతే కనిపించేవీ, కనిపించనివీ మరెన్నో ఎదుర్కోవాల్సివుంటుంది. వీటికితోడుగా ప్రపంచంలోనే అత్యంత నీచంగా తయారయిన మన రాజకీయపు ఎత్తుగడలనుండి మన రాజ్యాంగస్ఫూర్తిని కాపాడుకోవాలి.
ఇదంతా ఎంత అద్బుతమైన నిర్వాహణ నిర్వాహణ!!! అయినా ప్రతీసారీ ఈ అద్బుతం మనదేశంలో సాధ్యమవుతూనేవుందంటే కారణాలు...
1.అపూర్వమయిన మన రాజ్యాంగ రచన
2.దానికి అనుగుణంగా ఏర్పడిన అధికారయంత్రాంగం
3.రాజకీయాలకు అతీతంగా పనిచేసే అవకాశం అతికొద్దిమాత్రమే వున్నా, తమ ఉద్యోగనైపుణ్యాన్ని సాద్యమైనంతవరకూ ప్రదర్శించగలుగుతున్న ఎన్నికలయంత్రాంగం వంటి వాటి కార్యదక్షతలు. ఇలాంటివన్నీ మనదేశానికి నమస్కరించాలని చెప్పట్లేదూ....
ఒక మద్యతరగతి ఇంట్లో జరిగే అతిచిన్న ఫంక్షన్లోనే భోజనాలకి ఎందరొస్తారో సరిగ్గా లెక్కెయ్యలేక అభాసుపాలవుతున్న సంఘటనలు చుస్తుంటాం. అలాంటిది పేరుకి అభివృద్దిచెందుతున్నదేశం అని బోర్డు తగిలించుకున్న ఈ వెనుకబడిన ఆర్ధికవ్యవస్థ కలిగిన దేశంలో ఎంతపెద్ద కార్యనిర్వాహణ ఎలా సాద్యమవుతుంది? ఈ కోణంలో ఆలోచన ప్రారంబిద్దాం. ఇప్పటికీ మన దేశ బంగారు భవిష్యత్ మనచేతుల్లోనే ఉందనిపించట్లేదూ....
శ్రీఅరుణం
9885779207

Saturday, May 3, 2014

వ్యక్తిత్వ వికాసానికి లక్షణాలు



ఒక పని సాధించాలంటే దానికై చూడవలసిన భిన్న కోణాలుంటాయి. వాటన్నిటినీ సమ్మిళితం చేయటంలో మనం సంపాధించుకున్న విఙ్ఞానమే వ్యక్తిత్వంగా రూపుదిద్దుకుంటుంది. సహజంగా ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని అభివృధ్ధి చేసుకోవటానికి తన జీవిత విధానాన్ని మార్చుకోగలిగితే చాలనుకుంటారు. కానీ మానవుడు సంఘజీవిగా తనతో పాటూ బ్రతుకీడుస్తున్న సమాజంలో అతని వ్యక్తిత్వవికాసం తనతోనే కాక, ఎదుటి వారినుండి కూడా ప్రభావితమవుతూ వుంటుదని మర్చిపోకూడదు. అందులో భాగమే కనుక  బయట ఇంటర్వూలకు వెళ్ళేటప్పుడో, పదిమందిలో ప్రత్యేకంగా కనిపించటానికో, సమాజంలో అందరికంటే ముందుగా పరిగెత్తటానికో మాత్రమే మన వ్యక్తిత్వ వికాసానికి కావలసిన వివిధ అంశాలను నేర్చుకోవాలని చాలామంది నమ్మకం. అది మన పనికి మంచి ఫలితాన్నిస్తుంది, నిజమే.అయితే ఆ వ్యక్తిత్వం మనకొక కోర్స్ లా కాకుండా, మన జీవితంలా మార్చుకోగలిగితేనే `నువ్వు` అనేది ఒక సంపూర్ణమైన వ్యక్తిత్వం అవుతుంది. అందుకు కొన్ని లక్షణాలు కావాలి. అవి...
1.డ్రస్ కోడ్
2.సంభాషణ
3.ఎదుటివారిని గౌరవించటం
4.సంధర్బోచిత విఙ్ఞానప్రదర్శన
5.ముగింపునివ్వగల సమర్ధత
from my book "anthar bhramanam"

“శ్రీఅరుణం”
9885779207

Monday, April 28, 2014

ఇంకెంతదూరం...???


ఎంత సంపాదిస్తావ్? వంద..వెయ్యి...లక్ష...కోటీ...
ఎందర్ని మోసంచేస్తావ్? ఒకడ్నీ...గ్రామాన్నీ...పట్టణాన్నీ...దేశాన్నీ...ప్రపంచాన్నీ...
ఎంతని దోచుకుంటావ్? నగలు...డబ్బూ...పలుకుబడీ...పదవి...
ఎక్కడికని పెరిగిపోతావ్? ఇల్లు...ఎస్టేట్...అసెంబ్లీ...పార్లమెంట్...
ఇలాంటివెంత పోగేసిన...నీ కోసం పెట్టే చివరి పెట్టుబడి నీ సమాధి ఖర్చే.
ఎంతగా మోసపుసామ్రాజ్యాన్ని నిర్మించుకున్నా...
మరణపు ఫ్లాట్ ఫాం పై చివరికి నువ్వొక్కడివే నిలబడిపోవాలి.
అక్కడ నీపరుగు ఎన్నివంపులు తిరిగినా చుట్టుకొలత ఆరడుగులే.
అందుకే... జీవనగమనంలోనే...కాస్తంత ఆలోచించుకో...
నిప్పు కాలినా దానిని నమ్ముకుంటున్నది వాస్తవంగా బ్రతుకుతుందనే,
సంవత్సరాలు భరించిన ఆకలికేకలు
ఆర్ధతనిండిన కడుపుల అమాయకపు ఆర్తనాదాలు
గుక్కెడునీటికై ఎండుతున్న గుండెలకవాటాలు
అద్దమ్ముందు నిలబెడుతున్న మనలోని వాస్తవానికి ప్రతినిధులు.
ఇప్పటికైనా స్వార్ధపు పరదాలనుండి నిన్ను నువ్వు తొలగించుకో.
"దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్" అన్నదానికి
నువ్వే సమాధానం చెప్పాలి...
ఓటుహక్కును నిండుగా నమ్ముతూ ముందుకు అడుగేయ్.
శ్రీఅరుణం
9885779207

Friday, April 25, 2014

జ్వరo..


నీకు జ్వరమొచ్చింది..
నా గుండె కాలిపోతుంది,
నీలో వొణికిపోతున్న మనిద్దరి ఙ్ఞాపకాలు
బుజ్జి కుక్కపిల్లలా
భయంతో నీ పక్కనే కాపలా కాస్తున్నాయి.
నీ నాలుక క్రిందున్న
ధర్మామీటర్ పాదరసం వెంటే
నా కన్నీరూ పరిగెడుతుంది..
అది పెరగకుండా అడ్డుకోవాలని.
నీ దగ్గు వినిపించినతసేపూ
నా గుండెలో పిన్నీసు కలుక్కుమంటుంది...
కొవ్వొత్తుకు తెగిపడిన రెక్కల చీమలా
నీ నీరసం నన్ను పిచ్చెక్కిస్తుంది.
గబగబాతీసిన బత్తాయిరసంలో
నా కన్నీళ్ళు పడ్డాయేమో
పలచనైపోయింది.
వేధన భ్రమణం పూర్తయ్యి, వేకువ పిలుస్తున్నప్పుడు..
నువ్వు కనులు తెరిచిన వెలుగు
నా పెదవులపై మళ్ళీ పరుచుకుంటుంది.
from my book "నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు..."

“శ్రీఅరుణం”
9885779207

Tuesday, April 22, 2014

ప్రణయతీర0..


నాకోసం నిన్ను కోరుకుంటే
నాకెప్పటికీ ప్రేమ మిగలదు.
నీకోసమే నన్ను నిలుపుకొంటే
ప్రేమ నన్నెప్పటికీ విడువదు.
స్వేచ్చ హృదయంతో సంగమిస్తే

సాంగత్యం మరింతగా హత్తుకుంటుంది.
అవసరం గుండెలతో బేరాలాడితే..
అభిమానం గదులలోనే ఆరిపోతుంది.
ప్రేమను ప్రేమకోసమే ప్రేమిస్తే
ప్రళయంలోనూ ఒక ప్రాణం నీ తోడుంటుంది.


from my book "నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు..."
 
“శ్రీఅరుణం”
9885779207

Saturday, April 19, 2014

కలనిజమైంది


పేదరికంలోచదువు ఎన్ని అడ్డంకుల్ని దాటుకుని రావాలో... నాకు అనుభవపూర్వకమే. ఆ సమయంలో కొన్నిసార్లు చదువు ఆపకపోతే జీవితం ముందుకుసాగదేమో?? అన్న గడ్డురోజులు ఎన్నో.
అయినా దేవునివరంలా సరస్వతి నన్ను కరుణించింది. ఇప్పుడు సరిగ్గా అలాంటిపరిస్థితులలోవున్న ఎందరో పేదవారికినేను విధ్యాధానం చేసేఅవకాశంవుంటే ఎంత బాగున్నో అని ఎంతో ఆశ పడేవాన్ని. కానీ కుటుంబపు బాధ్యతలు నన్ను హార్ధికంగా ముందుకు నెట్టినా, ఆర్ధికంగా తెగించలేని పరిస్థితి. అందుకే పేదవారికి ఉచితంగా విధ్యాదానంచేయాలన్న నా ఆశ కలగానే కాగితాలలోనే ప్రణాళికలా వుండిపోయింది చాన్నాళ్ళు.
కొద్దిరోజులతరువాత గురజాపురవిగారు యువచైతన్య సంక్షేమసంఘం తరపున నా మనసులో వున్న ఉచిత విధ్యకు సంబంధించిన ప్రోగ్రాం చేయాలనుందనీ, ఆర్ధికంగా తనకు అవకాశం వున్నా అందుకుతగ్గ విధ్యాపరమైన నాలెడ్జ్ తనవద్దలేదని, అందుకోసం నన్ను సలహా ఇచ్చి ముందుకునడిపించాల్సిందిగా కోరారు. అప్పుడనిపించింది.కొన్నికలలైనా వాటి వెనుకనున్న ఆశయం మంచిదైతే తప్పక నిజాలవుతాయని. అలా మా ఇద్దరి నేతృత్వంలోమొదలైంది "అక్షరవెలుగు" ఉచిత ట్యూషన్ కార్యక్రమం 2012 నవంబర్ లో. మొదట 30మందితో మొదలైంది. ప్రతీరోజూ సాయంత్రం 6నుండి 8వరకు చుట్టుపక్కల వున్న ప్రభుత్వపాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెప్పటం, ఉచితంగా నోటుపుస్తకాలను అందించటం ప్రారంభించాం. అందుకోసం రవిగారి ఆర్ధికసహాయం, అలాగే తమ స్కూల్ ని ఖాళీగావుండే సాయంత్రం సమయంలో మేం వాడుకునేందుకు సహకరించిన మాస్టర్ గారికీ కృతఙ్ఞతలు తెలుపుతున్నాను. ఈ మజిలీలో మేం ఎంతో ఆత్మసంతృప్తిని అనుభవిస్తున్నాం. ప్రస్తుతం ఈ2013-2014 సంవత్సరానికి 100మందితో కొనసాగుతూ రెండు సంవత్సరాలు పూర్తిచేసుకుంది నా కల. ఇప్పుడు మీ ముంది దీనిని ఉంచటానికి కారణం మన విధ్యను మరొకరికి అందించటం ఈ దేశానికి మనం చేసే నిజమైన సేవ అన్న నా నమ్మకాన్ని మీతో ఆనందంగా పంచుకోవాలనే. మీరూ ప్రయత్నించి చూడండి.

శ్రీఅరుణం 

9885779207

Tuesday, April 15, 2014

రైతన్నా...గుర్తుందా...???

రైతన్నా...గుర్తుందా...???
అన్నంపెడుతున్న నీ కండలస్వేదాన్ని
బెల్టుషాపులు తెరిచి దోచుకున్న నాయకత్వం,
కోట్లు చేతులుమారుతున్నా కానరాని నీటిధారలకై
నోళ్ళుచాపి నిన్ను ప్రశ్నిస్తున్న ధరిత్రిపగుల్లు,
ఆదరిస్తామన్న మాటల్ని
అప్పులతో నింపేసిన చేతలు,
క్రూరమృగాలు సంచరించేవేళల్లో కరెంట్ కనికరిస్తూ 
మీ బ్రతుకుల్ని అరణ్యరోధన చేసిన వాగ్దానాల్నీ,
నువ్వుపండించిన పంట ధరని
కనీసం...ఇంటికికూడా తీసుకెళ్ళనేని స్థితికి దిగజార్చినతనాన్నీ, 
పుట్టినగడ్డని నమ్ముకున్న నిన్ను
పుట్టగతులు లేకుండా ఆత్మహత్యలకు బలిచేస్తున్న చేతగానితనాన్నీ...
విత్తనాలకోసం రోజులతరబడి నీ కుటుంబం నిలబడిన వరసలూ...
ఎరువుల కోసం జరిగిన తొక్కులాటలో కాళ్ళు విరగొట్టుకున్న నీ తమ్ముడి అరుపులూ...
ప్రేమంతా పంచి పెంచిన పంట నకిలివిత్తనాలపాలిటపడినప్పటి వేధన...
అమ్ముకోలేని తడిసినధాన్యాన్ని కన్నీళ్ళతో కాల్చుకున్నరోదన...
అన్నిటినీ గుర్తుకుతెచ్చుకో....
ఇప్పుడు వీటన్నిటికీ సమాధానం చెప్పే ఆయుధం వుంది తెలుసుకో.
మంచి అనిపిస్తే ఎన్నుకో
చెడు అనిపిస్తే "నోట" వుంది, నిలబడు.
మొత్తానికి ఓటెయ్యి...కానీ..దీనిలోనయినా..నిన్ను నువ్వు బ్రతికించుకో.
శ్రీఅరుణం
9885779207





Friday, April 11, 2014

ఎన్నికల జాగృతి

వెధవల్ని తయారుచేస్తున్న అవినీతి...
వరదలా పారుతున్న మద్యం...
చెదల్లా పేరుకుంటున్న పొత్తులూ
గేదెల్లా కొట్టుకుంటున్న నాయకులూ...
పార్టీటికెట్ కోసమే పెద్దపెద్ద ఆర్భాటాలూ...
నామినేషన్ ప్రదర్శనలకే రోడ్డెక్కుతున్న జాతరలూ
ప్రచారానికే ప్రపంచమంతా ప్రాకేస్తున్న నోట్లకట్టలు...
తిట్లూ
కోట్లాటలూ
హత్యలూ
కిడ్నాపులూ...
అసలివన్నీ కావాలా ప్రజాసేవకూ???
చూస్తున్నావా ఓ జాతిపితా? నువ్వెందుకు పైవన్నీ వాడలేదు?
మేమంతా ఇంతే...మాకూ
చరిత్ర తెలుసు
వర్తమానమూ తెలుసు
భవిష్యత్తూ తెలూస్తూనే వుంది
అయినా ఎందుకో ఇలా అమ్ముడైపోతూనేవున్నాం నోట్లకు???
మాకు నీఅంత ఓపికలేదుమరి
ఫాస్ట్ ఫుడ్స్
ఫాస్టెస్ట్ ఆలోచనలు
సూపర్ ఫాస్ట్ అనుభవాలు
బంపర్ ఫాస్ట్ అవసరరాలు మాకిప్పుడు కావాలి.
అందుకే మమ్మల్ని మోసం చేయటం అందరికీ తేలికైపోయింది.
ఓ మహాత్మా మళ్ళీ ఒక్కసారి మమ్మల్ని ఆవహించు
ఈ ఎన్నికల జాగృతిలో మాలోకలగలసిపో
నీ నడకే మా ఆశలు కావాలి
నీ చేతికర్రే మాకు చేతలు నేర్పించాలి
రాక్షసత్వం నిండిపోతున్న ఈ రాజకీయంపై తిరుగుబాటుచేయటానికి
నీ పోరాటస్ఫుర్తిని మళ్ళీమాకు ఆవాహనం చేయించు. 
శ్రీఅరుణం
9885779207
 










Sunday, April 6, 2014

ఓటు మన హక్కు


దేశభక్తిని మన భూజాలపై మోసేందుకు
రాజ్యాంగం అందించిన విలువైన చెక్కు,
వేస్టవుతుందనుకుంటున్న ఎలక్షన్ రోజునూ...
ఓటేసేందుకు వరసలో నిలబడే అరగంట సమయాన్నీ...
అభ్యర్ధులిస్తున్న రెండువేలలెక్కనూ...
నాయకుల వాగ్దానపు సర్కస్సునూ...ఇలాంటివాటిని కాసేపు పక్కనపెట్టి
గతకాలపు పరిపాలన పై ముడుచుకున్న మగతనిద్రనుండి ఒకక్షణం విదిలించు నీ మస్తిష్కాన్నిప్పుడు,
ప్రభుత్వ ఆఫీసులో పదినిముషాలపనికి నువ్వు చెల్లించినదెంతోలెక్క సరిపోల్చుకో ఒకసారి...
మిట్టమధ్యాన్నమే కామాంధులబారినపడుతున్న మన చెల్లెళ్ళ వేధనల్నీ...
లక్షలకోట్లరూపంలో విదేశీబ్యాంకులకు చేరుతున్న మన రక్తమాంసాలనూ...
కుక్కలసమూహంగా మారిపోతున్న చర్చావేధికల్నీ
అమ్మని డిల్లీవీధుల్లో తాకట్టుపెట్టిన చేవచచ్చిన జాతినాయకుల్నీ..
రైతుకి అర్ధరూపాయి దులిపి...ప్రజలనుండి అరవైరూపాయలు పిండుతున్న రాబంధులనీ...
నిజాయితీనిండిన కష్టాన్ని ఆత్మహత్యలకు రహదారిని చేస్తున్న యమభటులనీ...
ఒక్కసారి..ఒక్క గంట...ఒకేఒక్క రోజు...
ఆలోచించి
అవలోకించి
అవధరించి
అత్మీకరించి
కాస్తంత గుర్తుకుతెచ్చుకో,
నీకోసం
నీవారికోసం
మనకోసం
మనవారికోసం తెరిచే నీ చక్షువులు మనిషి ఆశలంత విశాలం చేయ్
ఆ గమకం నీలో నింపుకుని...ఓటువేయాలని నడువ్ ముందుకు
అపుడే...
ఏదేశమేగినా...ఎందుకాలిడినా...
నీదేశం నీకందించే విలువని గర్వంగా ఆస్వాదించగలవ్.

శ్రీఅరుణం
9885779207
విశాఖపట్నం

Friday, April 4, 2014

సమస్యా పురాణం


ఈ ప్రపంచంలో రెండురకాల మనుషులున్నారు.ఒకరు ప్రపంచ చుట్టూ తిరిగే వారైతే, రెండవ వారు ప్రపంచం తమ చుట్టూ తిరగాలనుకునేవారు.ఈ రెండురకాల మనుషులమధ్యన ఏర్పడే జీవనసంబంధాలే మానవమనుగడకి మూలసూత్రాలు.ఇవే తరువాత్తరువాత జీవితసత్యాలుగా మేకప్పులు వేసుకుంటూ.. మన అందరి మధ్యన సంచరించటం ప్రారంభించాయి.వాటికి అవరోధం జరిగిన ప్రతీ క్షణంలోనూ ఒక సమస్య పుట్టుకొస్తుంది.అది ఇంతింతై..వటుడింతై..అందలేనంత ఎత్తుకు ఎదిగి మనిషిని భయపెడుతుంది.ప్రతీ మనిషికీ ఇప్పుడు సమస్య నీడలా మారింది.నిరంతరం తనని వెంటాడే దానికి మనిషి మరింతగా కుచించుకుపోతున్నాడు. అటువంటి సమస్యని పరిష్కరించుకోవటం కోసం అనేక తపస్సులూ, యుద్దాలూ, ధ్యానాలూ, ఉపన్యాసాలూ, రచనలూ… ఇలా కొనసాగుతూనే వున్నాయి. వ్యక్తిత్వవికాసానికి ముందుగా సమస్య పెద్దపీఠ వేసుకొని కూర్చుంటుంది.దానిని దాటగలిగితేనే మనకి మిగిలినవి దొరుకుతాయి.
ఆదే ప్రయత్నం నేను నా మొదటి క్లాస్ లో చేశాను.
ఆసలు సమస్యంటే ఏమిటి ? అంటూ నేను అడిగిన ప్రశ్నకి అనేక సమాధానాలు వచ్చాయి.
"భయం"
"ఆభద్రత"
"ఆయోమయం"
'కల్పన"
"అసాధ్యం"
"ఎప్పుడూ ఏదో ఒక రూపంలో వుండేది'
ఇలా అనేక రకాల అర్ధాలతో వారినిండి వెల్లువెత్తిన శబ్దాలు నన్ను ముంచెత్తుతుంటే..నాకు మాత్రం, వాటన్నిటిలో వున్న ఒకేఒక అంశం బలంగా తగిలింది!!!
అది..
సమస్య అనేకరకాలుగా సంచరించే విస్ఫోటనం లాంటిది కానీ..దాని అస్తిత్వానికై వెతికితే మాత్రం దొరికేది శూన్యమే.అయితే సమస్యని అలా వదిలేస్తే ప్రతీ క్షణం ఆరోహణం చేసే స్వభావం కలిగివుండటం వలన, అది మహాసముద్రమై మనల్ని గందరగోళంలో పడవేస్తుందని ముందు తెలుసుకొని తీరాలి.
from my book "anthar bhramanam"

SRIARUNAM
9885779207

Sunday, March 30, 2014

ఉగాది రుచులతో ఒకరోజు
ఉగాది కవిత రాద్దామని వుదయాన్నే నిద్రలేచి ఉపమానాలు వల్లెవేస్తూ కూర్చున్నాను.
ఇంకా పేపరుబిల్లు కట్టలేదని కోపంతో..
బయటనుండి పేపర్ బాయ్ విసిరిన పేపరొచ్చి నెత్తిమీద మొట్టికాయ వేసింది...వగరుగా.
ఆ దెబ్బనుండి తేరుకోని....
సరే.....కాసేపు పేపర్ తిరగేస్తే ఏదన్న ఐడియా వస్తుందని అవలోకిస్తుంటే...
ఆకాశమంత ఎత్తున పెరిగిన కరెంట్ చార్జీలు షాకిచ్చాయి చేదుగా.
ఆ వార్తని మర్చిపోవటానికై కాస్తంత తీపిని ఎక్కువగా తగిలించి
కాఫిపెట్టుకొని తాగుతూ టి.వి.ముందు కూర్చున్నాను
"తీపి తినకండి.షుగరొచ్చి చస్తారు" అనే కార్యక్రమం అప్పుడే జరుగుతుంది టి.వి.లో నా టైం బాగోక.
ఇంతలో ఉప్మాలో ఉప్పు వేయటం మర్చిపోయానని మా ఆవిడ డాబాపైనుండీ కేకేసింది గట్టిగా
ఆ కేకలోని సాధికారత తెలుసుకనుక ఠక్కున పరిగెత్తాను వంటగదిలోకి...ఆ ఉప్మా ముందుగా తినాల్సింది నేనే కనుక.
ఇన్నీ భరించి...
మళ్ళీ మాములయ్యి...
ఉగాదిపోటీకి కవిత రాద్దామని కూర్చున్నాను..
కళ్ళల్లో నలక పడినట్లనిపిస్తే...నలుపుకుంటూ చూశాను నా అరచేతి వైపు.
అప్పటికే నా చేతికంటుకొని వున్న ఎర్రని కారం విరగబడి నవ్వుతుంటే.. అప్పుడు అర్ధమైంది...
ఇంతకుముందు...నేను వంట గదిలో ఉప్పనుకొని పొరపాటున కారం కలిపానని.
అప్పటికే మంట నషాళానికెక్కి నేను గెంతుతుంటే మా అమ్మాయి సాహిత్య కంగారుగా...
తన చేతిలోని కుంకుడు పులుపుని నా మొఖాన్న కొట్టింది ... నీళ్ళనుకొని.
మంటమీద మంటెత్తుతున్న బాధని భరించలేక నేను వేస్తున్న కుప్పిగంతుల్ని చుస్తూ
మా అబ్బాయి శ్రీ శరణ్ "డ్యాన్స్ బాగుంది డాడీ " అంటూ ప్రాక్టీసు మొదలుపెట్టేశాడు.
ఇలా ఉగాది కవిత రాయాలనుకున్న నా ప్రహసనం
నాకు అన్ని రుచుల్నీ చూపించిన ఆరోజు గుర్తుకువస్తే
అయ్యబాబోయ్ ఇంక ఉగాది కవిత నేనేందుకు రాస్తాను చెప్పండి?
శ్రీఅరుణం
22-52-5/1
టౌన్ హాల్ రోడ్
విశాఖపట్నం-530001
సెల్ = 9885779207

Thursday, March 27, 2014

థాంక్స్ పవనన్నా...



చాలారోజుల తరువాత మళ్ళీ
ఆజాద్ చంద్రశేఖరుడు మీసం మెలివేశాడు
లేతయవ్వనంలోనే తన తనువుచాలించిన దేశం ఇదా? అని
రోదిస్తున్న భగత్ సింగ్ తృప్తిగా నవ్వుతున్నాడు
కార్పోరేట్ చదువులతో చెదలుపట్టిన మహాప్రస్థానం మళ్ళీ
యువత చేతులలో తుళ్ళిపడబోతుంది
ఇదంతా ఒకప్పుడు కల
ఇప్పుడు....
నిజమవబోతున్న భరతమాత మరో బిడ్డడి ఆశయపు వెలుగు.
అక్షరం చదవటమంటే....
పదాలను నెట్టివేసుకుంటూ వెళ్ళిపోవటమనుకుంటున్న తరానికి
రక్తం విలువనూ
ఆశయపు అర్ధాన్నీ
ఆర్తనాదపు వైశాల్యాన్నీ
సామాన్యుని గుండె చుట్టుకొలతనూ
తెలుసుకునే దారిని మళ్ళీ చెప్పగలుగుతున్న జనసేనకు సిద్ధంకండి
సూటిగా వున్నా...నిజం ఎప్పుడూ అలాగేవుంటుంది, నిర్భయంగా
తెగించినా... వున్నతమైన ఆశయం ఎప్పుడూ అలాగే నిలబడుతుంది...కచ్చితంగా
కఠినమైనా.... దేశభక్తినిండిన మాట అలాగే వుంటుంది...అత్యున్నతంగా.
"అరవై సంవత్సరాల స్వాతంత్ర్యం ఏమిచ్చిందని" ప్రశ్నించే హృదయాలన్ని ఇప్పుడు
రండి సంఘటిద్దాం
మనందరికోసం తననంతాధారపోస్తానంటున్న మరో త్యాగధనుడొచ్చాడు
కాపాడుకుందాం.
శ్రీఅరుణం
9885779207
విశాఖపట్నం



Wednesday, March 26, 2014

సామాన్యుని గుండెల్లో...
చాలాకాలం నుండీ నిప్పురవ్వలు కణకణమంటూనేవున్నాయి...
ఏ రాజకీయపుగాలి వీచినా నమ్మి అటువైపుకి ఎగసి
వంచించబడిన బూడిదగా మిగిలిపోతూనేవున్నాయ్...
ఆ కన్నీళ్ళను ఇంధనంగా మార్చే హృదయముంటే
అవినీతిపై కార్చిచ్చును రగిలిద్దామని చూస్తున్నాయ్...
అదిగో ఆదారిలోఉదయించిందొక  పవనం
ఆశలవిత్తనాలు మొలకెత్తించిన ఆశయాలమొక్కలు
నిరంతరంగా పుడుతూనేవుంటాయి,
కొందరు...వాటిని పిచ్చిమొక్కలనుకుంటారు, కానీ...
చెదిరిన నమ్మకాలూ...
నాశనమవుతున్న నిజాలూ...
వంచిస్తున్న నాయకత్వాలబారినపడిన హృదయాలుకొన్ని...
ఆ మొక్కలచిగుళ్ళతో కలిసిపోతూ
తమ జీవితాలకు నీడనిచ్చే మహావృక్షాన్ని నిలబెట్టుకుంటాయి.

జాతుల గొంతుకలు కోస్తున్న ఘాతుకాలన్నిటినీ
ఇన్నాళ్ళూ మౌనంగాభరించిన మేఘాలు...చేరి
పిడుగులశబ్దాన్ని సృష్టించే శంఖాన్ని సిద్దంచేస్తున్నాయి

ఒంటరితనంలో ఉదయించే ఆక్రోశమే...
ఓర్పుకీ ఆవేశానికీ అర్ధవంతమైన సంబంధాన్ని నిర్వచిస్తుంది
సామాన్యుని గుండెకోత
తెలుగువాడి హృదయపు వ్యధ
వంచించిన మానవత్వం
భారతీయిని భవిష్యత్ కోణం
ఇవన్నీ కలగలిసినదే పవనిజం,
అది "హీరోయిజమే కాదు...కామన్ మాన్ నైజం" అంటున్న
జనసేన నిజమైన నవ్యప్రపంచానికి ప్లాట్ ఫాం
ఇక బయలుదేరండి...
మార్పుకోసం
మనందరికోసం
మనిషి మనిషికాబ్రతకాల్సిన తీరంవైపుకి.

శ్రీఅరుణం
9885779207
విశాఖపట్నం



Saturday, March 22, 2014

నవ్యపవనం జనసేన...

ఆశలవిత్తనాలు మొలకెత్తించిన ఆశయాలమొక్కలు
నిరంతరంగా పుడుతూనేవుంటాయి,
కొందరు...వాటిని పిచ్చిమొక్కలనుకుంటారు,కానీ...
చెదిరిన నమ్మకాలూ...
నాశనమవుతున్న నిజాలూ...
వంచిస్తున్న నాయకత్వాలబారినపడిన హృదయాలుకొన్ని...
ఆ మొక్కలచిగుళ్ళతో కలిసిపోతూ
తమ జీవితాలకు నీడనిచ్చే మహావృక్షాన్ని నిలబెట్టుకుంటాయి.

జాతుల గొంతుకలు కోస్తున్న ఘాతుకాలన్నిటినీ
ఇన్నాళ్ళూ మౌనంగాభరించిన మేఘాలు...చేరి
పిడుగులశబ్దాన్ని సృష్టించే శంఖాన్ని సిద్దంచేస్తున్నాయి

ఒంటరితనంలో ఉదయించే ఆక్రోశమే...
ఓర్పుకీ ఆవేశానికీ అర్ధవంతమైన సంబంధాన్ని నిర్వచిస్తుంది
సామాన్యుని గుండెకోత
తెలుగువాడి హృదయపు వ్యధ
వంచించిన మానవత్వం
భారతీయిని భవిష్యత్ కోణం
ఇవన్నీ కలగలిసినదే పవనిజం,
అది "హీరోయిజమే కాదు...కామన్ మాన్ నైజం" అంటున్న
జనసేన నిజమైన నవ్యప్రపంచానికి ప్లాట్ ఫాం
ఇక బయలుదేరండి...
మార్పుకోసం
మనందరికోసం
మనిషి మనిషికాబ్రతకాల్సిన తీరంవైపుకి.

[ప్రజాక్షేత్రంలో నవ్యపవనం జనసేన ఆవిర్భావం సంధర్భంగా...]
శ్రీఅరుణం
విశాఖపట్నం
9885779207

Tuesday, March 11, 2014

అద్దం ముందు జీవితం.....

అద్దం ముందు జీవితం ఎప్పుడూ 

సరిపుచ్చుకొవటంతోనే గడిచిపోతుంది,

ఆత్మముందు పరుచుకున్న ఆవిష్కరణ 

అవనిముందు నిన్ను తలెత్తుకొనేలాచేస్తుంది.

అద్బుతాలు పుట్టుకురావు...

అంబరం నీ తోడు వచ్చినట్లు కనిపించినా 

ఒంటరితనాన్ని నువ్వెందుకు ఫీలవుతున్నావు?

సమతూకం సాధించాలంటే ముందుగా

బరువు తెలుసుకోవాలికదా?

శబ్దం ఎన్ని మెళికలు తిరిగితేనో 

శంఖం నుండి మధురంగా వినిపిస్తుంది.

నమ్మకం నీ అస్థిత్వంలో మిళితమైతే 

అనంతంలోను గమ్యాన్ని అన్వేషించొచ్చు.

శ్రీ అరుణం

విశాఖపట్నం.

Monday, March 10, 2014

training & certificate pro`

NATIONAL SKILL DEVELOPMENT PROGRAMME
training & certificate pro`
Duration: 1month free course
Qua: 10th pass
Courses
1. Data entry operator
2. Customer sales executive
3. Customer relationship executive
4. Sales consultant
5. Business correspondent and 23 types of technical trainings also.
IF INTERESTED... attend with 10th, adhaar xerox and 2passportsize photos.
For details contact
P.SRINIVASARAO 9885779207

Friday, March 7, 2014

స్త్రీ అంటే సగం. నమ్మకపోతే....

హృదయం బరువెంతో తెలుసా?
నీ అడుగులలో తడబాటును చూసి
తడిసిన ఆ నయనాలను కురిపించే
కన్నీటిని తూకం వెయ్యి.... టక్కున చెప్పేస్తాయి.

అమ్మపెట్టిన సున్నిపిండికే రగిడిపోయిన చర్మం
మత్తిళ్ళిన పతిమృగాలు పాశవికంగా చీల్చుతున్నా..
ఎందుకలా??? వెంటుండి బజ్జోపెడుతున్నారో... అడుగు తెలుస్తుంది...
హృదయం బరువెంతో.

తను కొనుక్కున్న కట్నపు కొలిమి, తననే దహిస్తుంటే..
ప్రేగుతెగిన పాపాయిలకోసం
పాపం తనపై వేసుకుంటున్న అమ్మలనడుగు...తెలుస్తుంది..
హృదయం బరువెంతో.
 

భంగపడ్డ మానమంటూ..శిక్షా తనకే వేస్తుంటే..
యాక్సిడెంటులవుతున్నాయని ఎడారులలో బ్రతకాలా?

అని ప్రశ్నిస్తున్న లేతకళ్ళలోకి చూడు....
హృదయం బరువెంతో తెలుస్తుంది,  


రిజర్వేషన్లు నువ్విచ్చే భిక్షo కాదు,
ఎందులో తక్కువని కోటాలిస్తావు?
గుండెబలంలోనా? సునీతా విలియంసు ని అడుగు. 
కండబలం లోనా? లైలా ఆలీని అడుగు.
త్యాగధనం లోనా? అమ్మ కంటే చిరునామా ఎక్కడుంది మనకు.
ఎందులో తక్కువని పర్శంటేజులిస్తావు?
పంతం పట్టిందంటే.. సృష్టికి పరమార్ధం తనే.
ఎందుకైనా మంచిది.. మగాడినైనా  చెప్పేస్తున్నా..
సమానత్వం యిస్తేనే సర్ధుకుపోతారు, 
లేకుంటే సర్దుకో..
నిన్ను త్రోసేసి పైపైకి ఎదిగిపోతారు.
[మహిళాదినోత్సవ శుభాకాంక్షలతో...]

శ్రీఅరుణం

Tuesday, March 4, 2014

1month free course

NATIONAL KNOWLEDGE DEVELOPMENT PROGRAMME
Duration: 1month free course [with merit certificate]
Qua: 10th pass
Courses
1.    Data entry operator
2.    Customer sales executive
3.    Customer relationship executive
4.    Sales consultant
5.    Business correspondent   and 23 types of technical trainings also.
For details contact



P.SRINIVASARAO [ coordinator]  9885779207

Thursday, February 27, 2014

శివా....
శివా అని అరిస్తే... భోళాశంకరుడై పలుకుతాడు
మహాదేవా అని అర్ధిస్తే...అనంతమంత శక్తితో నిన్ను ఆదుకుంటాడు
శివన్నా అని పిలిస్తే చిన్నపిల్లాడైపోతాడు
హరహరా అని ప్రార్ధిస్తే...ఆత్మలింగాన్నే అభయం చేసేస్తాడు
కైలాసమంత సంపదనీ అనుభవిస్తాడు
స్మశానమంత నిరాడంబరతనీ ఆదరిస్తాడు
స్వామీ అన్నా పలుకుతాడు
ఆసామీ అన్నా అందుకుంటాడు
జీవితానికి వాస్తవం ఏమిటో... ఆయనదారిలా మనకు చూపుతాడు
మనిషి దేవుడవ్వాలన్నా...
దేవుడు మనిషవ్వాలన్న...
అన్నిటికీ నేనే నిజమైన సత్యాన్ని అని నిరూపిస్తాడు,
అందుకే "డు"అని ఆ స్వామిని సంభోదించాను...
ఆయన విశ్వరూపం నాకంత చనువిచ్చిందేమో మరి!!!...

శ్రీఅరుణం
9885779207  

Saturday, February 22, 2014

ఒక ఉద్యమం విజయం వరకూ వెళ్ళాలంటే మూడు అంశాలు కావాలి
1. ఉద్యమంలో చేసే ప్రతీపనీ, ప్రతీ, నడిచే ప్రతీమనీషీ, నమ్మే ప్రతీ మనస్సు.. మనఃస్ఫూర్తిగా నమ్మిన సిద్దాంతం అదే అయ్యి తీరాలి.
2.ఫలితమే అంతిమ లక్ష్యంగా కలిసిపోగలిగే నిజాయితీ కలిగిన ఐక్యమత్యం కావాలి
3.త్యాగాల విలువను నిజమైన విధానం వైపుకు మళ్ళించగలిగే నాయకత్వం నిలబడాలి.
ఇవి మూడూ వున్నాయికనుకనే మన తెలుగుజాతి తెలంగాణా సాధించుకోగలిగింది.
ఇవి మూడు ప్రజలు నమ్మినంతగా నాయకుల నమ్మలేదుకనుకే మన తెలుగుజాతి విభజనని ఆపలేకపోయింది.
అక్కడ గెలుపు ప్రజాశక్తిది.
ఇక్కడ ఓటమి నాయకులది.
ఈ రెండుపోరాటాలూ మన తెలుగువారందరికీ తెలిపిందొకటే. ప్రజలు నాయకుల్ని వంచాలేకానీ, వారి చేతిలో వంచించబడకూడదని.  

శ్రీఅరుణం
విశాఖపట్నం.


Tuesday, February 18, 2014

మర్చిపోవద్దు....


జాతి విడిపోయినా...
భాష చీలిపోయినా...
ప్రాంతం రెండుముక్కలైపోయినా...భావం మారదు.

బ్రతుకు నీచమైన...
నడక వక్రమైనా...
నమ్మకం చనిపోయినా...వాస్తవం వదిలిపెట్టదు.

పదవి నిలుపుకోవటానికి పక్కలెయ్యక్కరలేదు
రాజకీయమంటే రంకు సంతకాదు,
నమ్మిన ప్రతివారినీ వంచించిన ఈ గమనం....
కుష్టివ్యాదిని మించిన నికృష్టపుగమకం.

కలిసుండటం...విడిపోవటం...మనందరి హక్కు.
కానీ జరగాల్సిన సహజాన్ని 
ఇలాంటిస్థాయికి దిగజార్చిన విషయాన్ని భారతీయులుగా మనం మర్చిపోవద్దు,
గద్దెనెక్కించిన ప్రజలతోనే ఇలాంటి వికృతక్రీడ నడిపినవారిని వదలొద్దు,
సమైక్యమైనా,విభజనైనా ప్రజలందరిదీ ఒకేజాతి.
దాని వక్రీభవనం వల్లనే రెండువైపులా ఎన్నోలేతజీవితాలు బలైపోయాయి.
ఈ పాపం ఎవరిదో...వారి గదుల్లో రేపటినుండి ఆ ఆత్మలు సంచరిస్తాయి.

ఆకాంక్షను తీర్చటానికి అడ్డగోలుపనులు చేస్తున్నవారినే గమనిస్తుండండి.
లేకుంటే...మన నమ్మకాలను దోచుకునే దొంగనాకొడుకులకు
మన భవిష్యత్తు అమ్ముడైపోతుంది.


శ్రీఅరుణం

Sunday, February 16, 2014







సంద్రమంత అభయం...వీరబ్రహ్మంతాతగారి వచనం
అందుకేనేమో...ఆయన విశాఖతీరాన కొలువుదీరారు.
ఎన్నితరాలు మారిపోతున్నా...ఎప్పటికీ...
"తాతగారు" అని పిలిపించుకునే అమృతం ఆయన ప్రవచించిన కాలఙ్ఞానం.
మనుషులందరూ ఒక్కటే అని నిరూపించగలగటమే
భగవంతుని మార్గం అన్నది ఆ దేవుని స్వరూపం.
రాబోయే తరాలెన్ని వున్నా తరగని విఙ్ఞానపు నిధిని అందించిన
ఆ స్వామే విశ్వమానవ వంశానికి నిజమైన తాతగారు.

శ్రీఅరుణం.


Friday, February 14, 2014

నా ప్రేమతో ......

అందువల్ల "నా ప్రేమతో ఎదుటి వారిని మార్చేస్తాను" అని అనుకోవటం ముందు మానుకోండి. అది అబద్దం.  మీ ప్రేమకు మారాలన్న నిశ్చయం వారిలో పుట్టాలిఅలా కాకుండా...మీకోసం మారినట్లు వారు నటిస్తున్నదానిని మీరూ నమ్మి నడుచుకుంటే, ఎప్పటికైనా మిగిలేది ఓటమే. 
ప్రేమంటే..ఇవ్వటమేనని నేర్చుకోండి
తీసుకోవటం అనేది... అవతలవారిలో మీ మీద వున్న ప్రేమని బట్టి మాత్రమే వుంటుంది. అది నమ్మితేనే ప్రేమవంటి బావాలను కదిలించండి. లేకుంటే ముందే మిమ్మల్ని మీరే ఒక ఆలోచన వద్ద ప్రతిష్ఠించుకోండి. బతికి బయటపడతారు.
wishes for loversday
sriarunam


Tuesday, February 4, 2014

ప్రసవ వేదం.

అమ్మ ఊపిరికి అడ్డం పడుతూ
అనంతానికి అర్ధం చూపెడుతూ..
త్యాగాన్ని చీల్చుకువచ్చే తుది ప్రణవనాదం..
జీవనసంగీతంలో..అత్యుత్తమరాగం,

చిన్ని పొట్టలో ఆకలి కొత్తగా పుడుతుంటే
ఆకృతీకరించిన ఆత్మచలనంలా..
ఉద్దీపిస్తున్న ఏడుపు
ఎన్ని గమకాలను తాకుతుందో?

బుడిబుడి అడుగులతో
భూమిపై పడుతున్న దర్ఫం
ఆక్రమించబోయే సాధనని ఎత్తిచూపుతున్నట్లుంది....
కల్మషం అర్ధం తెలియని బోసినవ్వు..
పాదరసపు వరదలా
హృదయపు ఇరుకులలోంచీ ప్రవాహిస్తుంది,

ఎన్ని ఆవరణలు బ్రధ్ధలవుతున్నా
మరెన్ని అవతారాలు అంతరిస్తున్నామానవుడు ఫరిడవిల్లుతున్నాడంటే..
పరిమళిస్తున్న అమ్మతనంమనకందిస్తున్న రక్తబందానికే. 
శ్రీఅరుణం,
విశాఖపట్నం.

Tuesday, January 14, 2014

పెద్ద పండుగ


మా ఇంటి చివరన
సందుమూలన
మురికికాలువ పక్కన
చిరిగిన గోనిపట్టాని పరుచుకొని
కొబ్బరిబొండాలమ్ముకొనే మామ్మ,
ఒక్కరొజు సెలవు పెట్టి
నేతచీర కట్టుకొని
బోసినవ్వులతో కనిపించిందంటే...
ఆ రోజు నాకు సంక్రాంతి పండుగని అర్ధం అయిపోతుంది.
గుమ్మం అంచున చెల్లి
బ్యాలెన్స్ గా నిలబడి
బావ రాకకోసం
కనుగ్రుడ్లను రోడ్డుకు అతికించుకొంటే
పండగొచ్చిందని తెలిసిపోయింది.
మేమంతా కొత్తబట్టలు కట్టుకొంటే
చూడాలని అమ్మ కళ్ళు ఆత్రంగా వెదుకుతుంటే
నేనూ సిద్దం అయిపోయాను కనుమ కోసం.
మా అందరి ఆశలూ తీర్చడం కోసం నాన్న
మౌనంగా షావుకారింటికి అప్పుకోసం బయలు దేరితే
పూర్తిగా తెలుసుకున్నా...
మన పెద్ద పండుగ ఇదేనని. 


శ్రీఅరుణం  
విశాఖపట్నం.
9885779207

atididevobhava

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.