Monday, October 29, 2012

4వ పేజీ.

     నువ్వు మిగిల్చిన మన జీవితo..
నరకానికి చిరునామా..
నువ్వు దూరమైన అడుగులే.
నువ్వు నాలో పుట్టించిన ప్రేమతత్వాన్ని
మళ్ళీ నానుండి నువ్వే పట్టుకెళ్ళిపోతూ
నా మనసుని శూన్యం చేసేశావు.
ఇన్నిరోజులూ నా గుండెవెలుగుకి దోసిళ్ళుపట్టిన నువ్వే
హఠాత్తుగా నామెడను నరికేస్తుంటే.. 
ఆ వాస్తవంలోంచి తేరుకొనేలోపునే నేను మాయమైపోతున్నాను.  
దేవుడు కనికరించాడనుకున్న మన కలయిక
ఇప్పుడెందుకిలా హృదయాన్ని ద్రేవేస్తుంది?
ఇన్నాళ్ళూ నాతో గడిపినదంతా
అవసరాల క్షుద్రయాగంగా మారుతుంటే..
నాలో మొలిపించిన నయనాలకు చుట్టూ స్మశానం పరుచుకుంటుంది. 
అరగంట  లేటును "ఏరా మర్చిపోయావా" అంటూ..
గద్దించిన నీ స్వరం.. ఏ ఎడారులకు పారిపోయింది?
నే కనిపించినప్పుడు నీ కళ్ళల్లో కనిపించే మెరుపులే
ఇప్పుడు నా కళ్ళక్రింద నల్లని చారలయ్యాయి.
నీ సన్నిధిని కోల్పోయిన నా చలనానికి పక్షవాతమొచ్చింది.
జరిగింది నిజమా?
జరుగుతున్నది నిజమా?
జరగబోయేది నిజమా? అనుకుంటూ..
నా కలలన్నీ అయోమయాన్ని నింపుకున్నాయి
ఇన్ని జరుగుతున్నా నాకు మిగిలిన ఈ శూన్యంలోనే ప్రేమవారధి కట్టాలనుకుంటున్నాను
ప్రేమను అనుభవించిన బాధ్యతది.
ఎందుకంటే...
నువ్వు నాదానివి కాకున్నా.. ప్రేమ నాకెన్నో నేర్పింది..
పడకగది ఇరుకైతే పారిపోదది,
సెల్ ఫోన్ మార్చుకుంటే వదిలిపోదది,
కావ్యాలెన్ని రాసిన కరిగిపోని అమృతధారది,
ఈ సత్యాలన్నీ దాటిపోవాలనుకున్నా
మనలో ప్రణయం వదుకుకోలేదు...అందుకే..
నీకు నువ్వుగా కుచించుకుపోయినా
నన్ను నేనుగా బ్రతికించుకొనే వుంటాను..
మనిద్దరి లోకాన్ని జీవింపచేస్తాను.

sriarunam










Friday, October 19, 2012

మూడవ పేజీ



ఎదురుచూపు...
ప్రాణం పోస్తున్న చల్లనిగాలి స్పర్శే..
నా పక్కన నువ్వున్నావంటుంది.
నీ మౌనంతో జడత్వాన్ని నింపుకున్న రోజులన్నీ
నాకు రుతువులు లేని కాలమే.
నువ్వంతా నాదే కదరా అంటూ
అల్లుకుపోయే నీ తపనని
నా హృదయపువనంలో ఎప్పుడో నాటుకున్నాను.
అమ్మకొచ్చే కోపంలా
నన్ను విదిల్చికొట్టే నీ విరహపు బాధని చూసి
మురిసిపోతూ మళ్ళీ నీ గుండెలో కుచించుకుపోతాను.
మన కలయికకోసం నీ స్వరతంత్రి ఎన్నోసార్లు
నా గుండెకాయపక్కనే పచార్లు కొట్టడం చేసాను.
ఎందుకో దేవుడు
మన రెండు ఆశల మధ్యనా లోయల్ని సృష్టిచాడు???
వాటిలోకి దూకి కలుద్దామంటే
మన మనసులు పాషాణాలు కావే.
అలాంటివయితే.. ఇంత ప్రేమెలా పుడుతుందీ?
అందుకే ఆశల చుక్కానీ తగిలించుకొని
నక్షత్రాలను వెక్కిరిస్తున్న మిణుగురుల్లా
నీ అడుగులు వెతుక్కుంటూ నడుస్తున్నాను.





Thursday, October 11, 2012

రెండవ పేజీ


              
 నిద్రలేచిన మెలకువ..
నిద్రలేచిన మెలకువ
పరుగున తోటలోకి పోయి
కాన్వాసు ముందు కాళ్ళు చాపుకు కూర్చుని
రాత్రి కలలను తలుచుకుంటుంది.
కల ఆదేశించిన గుర్తు
ప్రేమకు రూపం చిత్రించమంటూ.,
అప్పటినుండీ ఇదేస్థితి!
నువ్వూ.. నేనూ..
మనం.. ఆకాశం..
చెట్టూ.. పుట్టా..
అవకాశం.. అనంతం..
మస్తిష్కపు పరుగులెంతగా చుట్టేస్తున్న
మన తొలి కలయిక చిగురే
మదివనంలో స్ఫురణకు రావట్లేదు?!? 
ప్రేమంటే ఏమిటీ?
వెన్నెలను చదవటమా..
వన్నెలను కొలవటమా..
ప్రకృతితో సంగమమా..
పరవశంతో పరిగెత్తటమా..
ఎడతెగని మదనానికి శూన్యమూ 
పిపీలికమొతుంది.
ఆ అంతర్మధనంలో..తూలిపడబోయిన నన్ను 
ఒక స్పర్శ ఆదరించింది..!
అది బౌతికమైనా..
అబౌతికమైనా..
నా ఆర్తిని నిలిపింది.
అదేనేమో..నేను కోరుకున్న నువ్వు!
నువ్వేనేమో..నాక్కావలసిన నేను.

  





Tuesday, September 18, 2012

నా పరిభ్రమణంలో తొలి పేజీ



మరో నిఘంటువు

ఆనందం=కన్నుల ముందు గంతులేసేది.
తన్మయం=గుండెలతో ఉసులాడేది.
హృదయం=ఎప్పుడూ కన్నీరే మిగిల్చేది.
ధనం=వద్దంటూనే హృదయంగా మారగలిగేది.
బంధం=పరిస్తితులకు చెలికత్తె.
ప్రేమ=అవసరాలకు పర్యాయపదం.
పెళ్ళి= ఎప్పుడూ గడియారంతో ఓడిపోయేది.
స్నహం-జీవిత ప్రయాణంలో ప్లాట్ ఫారం.
అమ్మ=విశ్వం ఇంకా నిలిచేవుందని చెప్పే సాక్షం.
నాన్న=శూన్యంలోనూ నీకు ఆధారం చూపే దారి.
ప్రేయసి=ఎప్పుడూ ఆలోచనల్లోనే వుండేది.
భారయ=ఎల్లప్పుడూ ప్రక్కనే వుండగలిగేది.
జననం=మరో సినిమా టిక్కెట్.
మరణం=మనస్సును అనాధను చేసేది.
మనిషి=దేవుడిచ్చిన కొత్త వుద్యోగం.
జీవితం=మనిషికొచ్చే జీతం.
ప్రారంభం=ఆవులింత.
ముగింపు=శూన్యం.

శ్రీ అరుణం







Wednesday, September 5, 2012

v3

సేవాదృక్పధంతో..
విజయం సాధించిన అనుభవంతో..
సాధించితీరాలన్న తపన వున్నవారికోసం..
ఇంటర్వూ ద్వారా సెలక్ట్ చేసుకొని, కేవలం 30మందికి మాత్రమే..
కంప్లీట్  కోచింగ్ ద్వారా మంచి భవిష్యత్ అందించాలన్న ఆశయంతో..
సిలబస్, మెయింటెనెన్స్ ఖర్చులతో మాత్రమే......
గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లకు  ఉచిత శిక్షణ.
 

 V3
 

vagdevi vidya vision
 


contact: 9885779207
sssvas123in@rediffmail.com
 


Sunday, June 24, 2012


మనిషి పుట్టినప్పటినుండీ ఇన్ని కోట్ల సంవత్సరాలలో కొన్ని లక్షల యుద్దాలు జరిగాయి.
వాటివలన రాజకీయంగాఎన్నో మార్పులు జరిగాయి.
కొట్లమంది చంపబడ్డారు.
కొందరి ఆశలు తీరాయి.మరికొందరి మనసులు చల్లబడ్డాయి.
 ఇంకా ఎన్నెన్నో సాధించుకున్నారు. 
కానీ ఇంత జరిగినా  ఒక్క ఒకే ఒక్క మనసుని మార్చగలిగాయా?
మార్పు వచ్చిందంటే అది కేవలం ప్రేమ తోనే.
 ప్రేమ
 బుద్దుని నుండి వెలువడి ఒక వేశ్యని మార్చగలిగింది, 
ఒక బందిపోటునీ మార్చగలిగింది,
అశొకుని మనసులో పుట్టి సామ్రజమంతా ప్రెమ మయం చేసింది.
మహత్ముని మనసుతొ అహింసని వెదజల్లింది. 
 ఇలా ఎన్నో చేయగలిగింది.అలాంటప్పుడు ప్రేమని వదులుకొని ఈ ప్రపంచంలో ఏది సాధించగలం?    

Sunday, April 8, 2012

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే"

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే" అంటాడు మార్క్స్.
అక్కడనుండీ మనం చాలా రకాల మార్పుల్ని చేసుకుంటూ అడ్వాన్స్డు  ప్రపంచంలోకి వచ్చేశామనుకుంటున్నాం. కానీ ఒక్కసారి మనల్నిమనం ప్రశ్నించుకుందాం "మనం ఎటువంటి సంబంధాలలో బ్రతుకుతున్నాం?".

 ప్రతి గుండే చేప్పేది ఈ రోజునా అదే, "మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే". 
 ఎందుకిలా జరుగుతుంది? 
ఇంతకంటే జీవితాలకి మార్గం లేదా?
 ప్రేమ,పెళ్ళీ,వావీవరుసలూ,మాటలూ,బ్రతుకుతెరువులూ ఇవన్నీ...అవసరాలకే అమ్మేయాలా?
నిజంగా మనం బ్రతకడానికి ఇంత దిగజారాలా?
భార్య అంటే ఏమిటి?

భర్తకి వుండాల్సిన అర్హతేంటి?
 ప్రేమంటే పరిచయానికి పర్యాయపదమా?
 అసలు ప్రేమిస్తే కోపం ఎంతవరకు వుండగలుగుతుంది? 
ఈ స్పీడ్ ప్రపంచంలో వున్న మనకి ఇప్పుడు ఈ విషయాలు అవసరమా?
నిజానికి ఇవన్నీ ఇప్పుడు అవసరమైన ప్రశ్నలేనా???
అవసరమే అనుకున్న వారికోసమే నేను రాస్తున్నా "నేనెవరిని చంపాలి ?" కధ. ఈ కధ వీటికి సమాధానం చెబుతుంది.
శ్రీఅరుణం.

Sunday, April 1, 2012

"నేనెవరిని చంపాలి" రియల్ స్టొరీ



 "నేనెవరిని చంపాలి"   రియల్ స్టొరీ  comingsoon

"శ్రీరాముడు ఏకప్రత్నీవ్రతుడు"
 "ద్రౌపతి ప్రతివ్రత"
ఇలాంటి మాటలు ఇప్పుడు చాలమందికి వెటకారంగా వినిపిస్తున్నాయి.
నిజంగా ప్రాతివత్యమంటే ఏమిటీ? నాకు అనుభవమైనంతవరకూ.. మనం ఏర్పరుచుకున్న బందానికి సంబందించినంత వరకూ వున్న విలువను కాపాడుకోవటమే.. ప్రాతివత్యం.  అది రాముడికి ఒక్కభార్యతో నయినా,ద్రౌపతికి ఐదుగురు భర్తలతోనయినా. కావలసింది మన బంధానికున్న విలువ ,పరిది మరవకుండా వుండటమే. ఇప్పుడు మన సమాజంలో అనుభవిస్తున్న వున్మాదపు చర్యల వెనుక ఈ రెండూ కొరవడటమే అసలుకారణం.
ప్రేమా ,పెళ్ళి, ప్రమాణం లాంటివాటిని కృత్రిమంగా స్తృష్టించుకొని .. మనల్ని మనం బ్రతకడానికి మోసంచేసుకుంటూ..గడుపుతున్న ఈ కాలంలో, అసలు వాటిని సంపూర్ణంగా అనుభవించగల జీవన విధానాన్ని మనం నిలుపుకొంటున్నామా అని ఒక్క క్షణం అలోచిద్దాం.
పదిమందితో ఐ లవ్ యూ అని చెప్పే మనిషికి{ఆడ కానీ, మగ కానీ},  మనస్పూర్తిగా ఏవరైనా ఐ లవ్ యూ చెబితే.... దాన్ని ఆస్వాదించగల మనసు మిగులుతుందా???   జీవితంలో ప్రేమని అనుభవించే అవకాశం మన హృదయం కోల్పోయేలా మనమే చంపుకోవటం లేదూ???అందువల్ల మనం కోల్పోతుంది ఏమిటి???
పెళ్ళిలోని మాధుర్యం
,మొదటిరేయి సాంగత్యం,
ప్రేమలోని అద్భుతం,
 నమ్మకంలోని అనుబంధం....
 ఇవన్నీ ఇప్పుడు మనమెందుకు దూరం చేసుకుంటున్నాం?
కత్తులతో పొడవటం,
యాసిడ్తో దాడిచేయటం,
బ్లేడుతో కోయటం,
 వున్మాదపు ఆవేశానికి గురికావటం,

ఒక మనిషి ప్రాణంపై మరోవ్యక్తి నిరంకుశంగా అధికారాన్ని చెలాయించడం...
ఇవన్నీ ఎందుకు మన చుట్టూ చేరిపోతున్నాయి?
సంబంధం అనేది యూసేజ్ కాదు.
పెళ్ళి అనేది ఇద్దరు కలిసి బ్రతికేందుకు ఇచ్చే లైసెన్స్ కాదు.
ఐ లవ్ యూ అనే మాట మనకు ఇతరుల వలన కలిగిన తృప్తికి ప్రతిఫలంగా చెప్పే "థ్యాంక్స్" కాదు.
 అసలు జీవితానికీ,బ్రతకడానికీ మధ్యన అంతఃసూత్ర మేమిటి?
నడవటాని కావలసింది మార్గమా? దిశా?
ఇలాంటి అలోచనని నాలో రేకెత్తించిన నా స్నేహితుడి చివరి వుత్తరమే ప్రేరణగా...నేను రాస్తున్న ఈ కధ... బ్రతికి సాధించాలనుకొనే వారందరికోసం.... "నేనెవరిని చంపాలి"   రియల్ స్టొరీ.


sriarunam-telugubloggers.blogspot.com

శ్రీఅరుణం.
విశాఖపట్నం . 

Sunday, March 18, 2012

NYNU AYVARINI CHAMPAALI?

from April 3rd week... i will start a real story of  humanity."NYNU AYVARINI CHAMPAALI?". idhi gylichiteeraalanukonya vaari koosam. SRIARUNAM.

Wednesday, February 15, 2012

నువ్వెక్కడా?

నువ్వు ఎప్పుడూ నాకు ప్రశ్నవే?
నా అడుగులతో నిన్ను కలుపుకొవాలని
నిరంతరమూ నా గుండే తపిస్తూవుంటుంది,
దానికెన్నిసార్లు చెప్పినా...
నిన్ను నమ్మమంటూనే వుంటుంది,
నా గుండెలపై నువ్వు సేద తీరినప్పుడూ...
నా ఆశలను నువ్వే నింపుతున్నప్పుడూ...
నా గతాన్ని ఙ్ఞాపకాలుగా నువ్వే మలచినప్పుడూ...
నన్ను నీలా ఇప్పుడు మార్చినప్పుడూ...
నాకొసమే నువ్వు రేపు మిగులుతానన్నప్పుడూ...
అనంతాన్నీ ప్రశ్నించినా సమాధానం నువ్వే వచ్చినప్పుడూ... 

నువ్వు ఎప్పుడూ నాకు ప్రశ్నవే?
ఈ ప్రపంచంలో నువ్వెక్కడా? అని ప్రశ్నించే
నా మస్తిష్కానికి...

శ్రీఅరుణం
విశాఖ

Tuesday, January 24, 2012

కవన ప్రసవం


కవిత్వానికికాలమే వారధి
ఆ కాలగమనంతో పొత్తుపెట్టుకొంటే..
గడిచే ప్రతీ క్షణమూ ఒక్కొక్క అక్షరమవుతుంది,
కనుపాప దారులలో సాగిపోయే జీవితాలు
అనుభవాల క్షేత్రంలో పుటలై 
కావ్యాలుగా మొలుస్తుంటాయి,
కన్నులు స్రవించే కన్నిటిలో 
ఆర్ధతా ప్రేమా మిళితమై పెల్లుబికితే..
వాటినుండి చిప్పిల్లిన అవశేషాలు
ఈ యుగాన్నే తట్టుకొగల కధనాన్ని మన ముందుంచుతాయి.


శ్రీఅరుణం,
విశాఖ.
9885779207

Tuesday, January 17, 2012

స్వాతంత్రపోరాటం


అవినీతిని నిర్మూలిద్దాం అంటూ
`అన్నా` తిండి మానేసి  కూర్చుంటే..,
నీతినెప్పుడో అమ్మేసుకున్న వాళ్ళు
నీళ్ళునమలడం  కూడా మర్చిపోయారు.


దొంగ దొంగ గొడవపడితే..
దాపరికం బయటపడినట్లు,
మన రాజకీయం అంతా చేరి
మనకి దాగుడుమూతల్ని మిగులుస్తారు.


ప్రాణం మనకోసం ఒడ్డిన జవానుల 
శవపేటికలపైనే తమ ఖాతాల్ని నింపుకున్న వీరికి 
అంత త్వరగా  నీతి ఎలా మింగుడుపడుద్ది?


లోక్ పాల్ నయినా లేకి పాలనగా మార్చి
కుటుంబాల లెక్కలకు రాజ్యంగాన్ని అడ్డుగా పెట్టుకొని
విరగబడుతుంటే...


డెబ్బై ఏళ్ళ `హజరే`కి 
యాభై ఏళ్ళు తగ్గిద్దాం,
ప్రతీ ఒక యువతా ..హజారేగా మారి
మరో స్వాతంత్రపోరాటం సాగిద్దాం.


శ్రీఅరుణం,
విశాఖపట్నం. 
      


                     

Saturday, January 7, 2012

సంప్రోక్షణ

నీటిని కనుగొన్న దారులలోంచే..
నిప్పునీ మలచడం ప్రారంబించి..
మనిషి..ఆ అగ్నికీలల కొసలతో
తన చుట్టూ ఆశల సరోవరాన్ని నిర్మించుకున్నాడు,


ఆత్మని రక్షిస్తున్న హద్దుల అంచులలో
కందకాల్ని తవ్వేసుకొని
దానిలో జీవితాన్ని ముడుచుకుందామని
కన్నీళ్ళకి కలలని అరువిచ్చాడు,


మరుభూమిలో నాటిన ఆ విత్తనాల నుండే..
మల్లెపూలతోటల్ని పండించుకొంటూ
అరుణపు గొడుగునే అందంగా కప్పుకొంటూ
ఆశల్ని నూర్పిస్తున్న ఆ నిశితోటలో
రాత్రిని శాశ్వతంగా ఊహించుకుంటున్నాడు,


అతనికి తెలియటంలేదు..
మాటలతో చేస్తున్న వ్యాపారానికి
మూలధనం మస్తిష్కమేనని,
తన గుండె దోసిళ్ళలోకి వాటితో నమ్మకాన్ని నింపుకున్న క్షణాలు
ఎప్పటికైనా...
హృదయమనే సమాధానం దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోతాయని?


శ్రీ అరుణం
విశాఖపట్నం
.




 

 

Sunday, December 25, 2011

నువ్వంటే...???

నువ్వంటే...???







అప్పుడెప్పుడో.. నన్ను తిట్టుకొంటూ తిరిగి చుడకుండా
వెళ్ళిపోయిందన్న కసితో...
ఎప్పటికప్పుడూ.. నన్ను తట్టిలేపుతూ
కళ్ళుతెరిస్తే కరిగిపోయే అద్భుతాంలా మారినా..
గుండెలముందు బంధించుకోవాలని
నాకెందుకు అనిపించలేదు?


నా ఈసడింపునీ తన కన్నులతో పొదవిపట్టుకొని
ఆశ చావని అడుగులతో దూరమవుతున్న
ఆ పాదాల పగుళ్ళనే చూస్తూ..,
కలుక్కున జారిపోతున్న కన్నీళ్ళని కనికరించలేని
రాతి హృదయాన్ని.. నేనెందుకు గుర్తించలేదు?


గుండేలేని తోటలో మెదడుని పాతేసి
అంబరం ఎత్తున బలిసిన అహం వృక్షాల నీడతో
ఏ ప్రణవానికి హారతి పడతాను?


ప్రణయం పిలిస్తే పలకదు,
అదే పిలిచిందా.. మనమెంత?
ఈ రెండింటిమధ్యనా నేను సాధించే..మనఃసాక్షే..
నువ్వవుతావని ఇప్పుడే తెలుస్తుంది.




శ్రీఅరుణం,
విశాఖపట్నం.

Sunday, December 11, 2011

నా ప్రేయసి నన్ను "కన్నా" అని పిలిచినప్పుడు కలిగిన ఆనందం మీ ముందు ఈ కవితగా.

అప్పుడెప్పుడో అమ్మ సృష్టించినట్లు గుర్తు


ఆ తర్వాత...

వయసు దాచేసుకొందో???

మనసు కప్పేసుకొందో???


సమాజం చెరిపేసిందో???


నా కొసమేనంటూ...అదే పిలుపు మళ్ళీ...


ఉంటుందని మరిచిపొయాను.


పెద్దరికపు ప్రాపులో.. ఖద్దరు బట్టలు చుట్టుకొని


నా అడుగుల శబ్దానికి నేనే గాంభీర్యాన్ని పెంచుకొన్నాను,


ఇంతలోనే...


హృదయంలో తేనె ఒలకపోసుకున్నట్లు..


అమ్మ దోసిళ్ళలో మళ్ళీ వెన్నపూస బువ్వ తింటున్నట్లు..


చాలా రోజుల తరువాత


"కన్నా" అన్న ఆ పిలుపు నా కొసం వినిపిస్తే..


నేను నిలుపుకొన్న ప్రేమే నాకీ అదృష్టాన్ని ఇస్తే...


చాలదా ఈ తృప్తి ...నన్ను నేను ప్రేమించుకొవటానికి.




శ్రీ అరుణం
విశాఖపట్నం.









atididevobhava

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.