జీవితం అనుభవించడానికి. దాచుకోవటానికి కాదు. చాలామంది ఆర్ధికమైన విషయాలలో పడి హార్ధికమైన ఆస్వాదనని కోల్పోతున్నారు.ఆ లెక్కలచిట్టాలు పట్టుకొని పరిగెత్తే గమ్యం చేరువయ్యాక...తాము ఏదో కోల్పోయామని తెలివి తెచ్చుకొని వేదన పడుతున్నారు. అలాంటి జీవితం ఒకటి అనుభవించిన ఆశల నెమరువేత ఈ వాలుకుర్చీలో ఙ్ఞాపకాలు కవిత.సంపాదన వుచ్చులో హద్దుకు మించి పరుగులు పెట్టిన ఆయన చివరి రోజులలో తనకోసం ఎంతో ఎదురుచూసి...ఆఖరి చూపు కూడా నోచుకోని భార్య మనసు పడిన క్షోభను గుర్తుచేసుకుంటూ అనుభవించిన క్షణాలు ఇవి .చిత్తగించండి .
నిజం చెప్పు నేస్తం నా నమ్మకం నిలిచేవుందా?
నేను నిలిచిన నీ గుండెలో ఇంకా మొలకెత్తుతూనే వుందా?
నాకు రింగ్ ఇచ్చిన సెల్ కాల్
అవుటాఫ్ కవరేజ్ ఏరియా అంటూ,
నా దూరం చెబుతూ వుంటే..
పీడకలలాంటి ఆ కవరేజీ నీ కడుపుని ఎన్నా ళ్ళని ద్రేవేసిందో?
నీకు గుర్తుందా?నా మొదటి రాక...
నీ హ్రుదయపు వాకిళిలోకి,
కాఫీఇచ్చి ,ఉప్మా పెట్టి ,మజ్జిగ త్రాగించావు.
ఏంటిరా ఇది కన్నా అంటూ..కంటి పుసిని తుడిచావు.
నువ్వు తినిపించిన ఆ ప్రేమఎక్కడ నెమరువేస్తానోనని.
యెంత జాగ్రత్తగా కా పాడుకున్నానో!!!
కానీ.......
కాలం చూపిన ప్రతాపంలో మొదలుపెట్టిన పరుగులో ఏదో శాపం తగిలింది???
అలాంటి శాపగ్రస్తజీవనంతో...గడచిన కాలం,
నా మీద నీ ప్రేమని తగ్గించలేదని చెప్పు నేస్తం
అక్కడే..
నీ పాదాల చెంతనే వుంది నా ప్రాణం.
కనుచుపుమేరవరకూ సోకర్యాలు,
పర్సునిండా కుక్కిన క్రెడిట్ కార్డులు,
గ్లోబుతో పాటూ తిరిగే పనులు ,
ఇంకా....ఎన్నెన్నో...
ఎంటర్ నొక్కితే చాలు..ఏకంగా స్వర్గాన్నే ముందుంచుతున్నాఇ,
కానీ...
ఆపచ్చని చేలో,
పూరిగుడిశెలో,
దూరంగా పలకరిస్తున్నసముద్రపు అలల హోరులో,
నువ్వు తెచ్చిన ఇడ్లీ ఆవకాయా తింటూ ..
మనం అనుభవించిన పరవశాలు..
ఒక్క గంట..కాదు కాదు,
ఒక్క నిముషం..అదీ కాదు,
ఒక్క క్షణం..ఇస్తానని చెప్పు నేస్తం,
ఈ క్షణమే వాలిపోతాను నీ దోసిళ్ళలోకి.
ఊ!!!
యాభై వసంతాలు గడిచిపోయాఇ,
అందులో...నిన్నుపొందిన మూడుదశాభ్దాలూ వెళ్ళిపోయాఇ.
ఒక్కసారిగా వాలుకుర్చిలో నడుంవాల్చిన ఙ్ఞాపకాలు..
కోల్పోఇన సాంగత్యాన్ని నెమరువేసుకుంటుంటే..
వయసు మీరిన తర్వాతి ముందు జాగ్రత్త.. మందులే మింగేస్తున్నాఇ.
పిల్లల బంగారు భవిష్యత్తు..విదేశాలకు ఎగిరిపోఇంది.
అందమైన ఇల్లు కాపలాకాయటానికే సరిపోతుంది.
అందుకోలేనంత హోదా కాపాడుకోడానికే పనికొస్తుంది.
ఆఖరిఖి ఈరోజున..
సంవత్సరానికి పది చొప్పున,నీకు కేటాఇంచిన రోజులు..
నిన్ను ఎంత వేదనకు గురిచేసిందో???
ఖరీదుగా కట్టించిన నీ సమాధిమాత్రమే చెబుతుంది!
ఎంత ఖర్చుపెట్టినా...ఇప్పుడు నువ్వున్నది స్మశానంలోనని.
శ్రీఅరుణం,
విశాఖపట్టణం.
తెలుగు తూలిక: మూణ్ణాళ్ళ ముచ్చట
11 years ago