"నేనెవరిని చంపాలి" రియల్ స్టొరీ comingsoon
"శ్రీరాముడు ఏకప్రత్నీవ్రతుడు"
"ద్రౌపతి ప్రతివ్రత"
ఇలాంటి మాటలు ఇప్పుడు చాలమందికి వెటకారంగా వినిపిస్తున్నాయి.
నిజంగా ప్రాతివత్యమంటే ఏమిటీ? నాకు అనుభవమైనంతవరకూ.. మనం ఏర్పరుచుకున్న బందానికి సంబందించినంత వరకూ వున్న విలువను కాపాడుకోవటమే.. ప్రాతివత్యం. అది రాముడికి ఒక్కభార్యతో నయినా,ద్రౌపతికి ఐదుగురు భర్తలతోనయినా. కావలసింది మన బంధానికున్న విలువ ,పరిది మరవకుండా వుండటమే. ఇప్పుడు మన సమాజంలో అనుభవిస్తున్న వున్మాదపు చర్యల వెనుక ఈ రెండూ కొరవడటమే అసలుకారణం.
ప్రేమా ,పెళ్ళి, ప్రమాణం లాంటివాటిని కృత్రిమంగా స్తృష్టించుకొని .. మనల్ని మనం బ్రతకడానికి మోసంచేసుకుంటూ..గడుపుతున్న ఈ కాలంలో, అసలు వాటిని సంపూర్ణంగా అనుభవించగల జీవన విధానాన్ని మనం నిలుపుకొంటున్నామా అని ఒక్క క్షణం అలోచిద్దాం.
పదిమందితో ఐ లవ్ యూ అని చెప్పే మనిషికి{ఆడ కానీ, మగ కానీ}, మనస్పూర్తిగా ఏవరైనా ఐ లవ్ యూ చెబితే.... దాన్ని ఆస్వాదించగల మనసు మిగులుతుందా??? జీవితంలో ప్రేమని అనుభవించే అవకాశం మన హృదయం కోల్పోయేలా మనమే చంపుకోవటం లేదూ???అందువల్ల మనం కోల్పోతుంది ఏమిటి???
పెళ్ళిలోని మాధుర్యం
,మొదటిరేయి సాంగత్యం,
ప్రేమలోని అద్భుతం,
నమ్మకంలోని అనుబంధం....
ఇవన్నీ ఇప్పుడు మనమెందుకు దూరం చేసుకుంటున్నాం?
కత్తులతో పొడవటం,
యాసిడ్తో దాడిచేయటం,
బ్లేడుతో కోయటం,
వున్మాదపు ఆవేశానికి గురికావటం,
ఒక మనిషి ప్రాణంపై మరోవ్యక్తి నిరంకుశంగా అధికారాన్ని చెలాయించడం...
ఇవన్నీ ఎందుకు మన చుట్టూ చేరిపోతున్నాయి?
సంబంధం అనేది యూసేజ్ కాదు.
పెళ్ళి అనేది ఇద్దరు కలిసి బ్రతికేందుకు ఇచ్చే లైసెన్స్ కాదు.
ఐ లవ్ యూ అనే మాట మనకు ఇతరుల వలన కలిగిన తృప్తికి ప్రతిఫలంగా చెప్పే "థ్యాంక్స్" కాదు.
అసలు జీవితానికీ,బ్రతకడానికీ మధ్యన అంతఃసూత్ర మేమిటి?
నడవటాని కావలసింది మార్గమా? దిశా?
ఇలాంటి అలోచనని నాలో రేకెత్తించిన నా స్నేహితుడి చివరి వుత్తరమే ప్రేరణగా...నేను రాస్తున్న ఈ కధ... బ్రతికి సాధించాలనుకొనే వారందరికోసం.... "నేనెవరిని చంపాలి" రియల్ స్టొరీ.
sriarunam-telugubloggers.blogspot.com
శ్రీఅరుణం.
విశాఖపట్నం .