[ఉదయం సాక్షి పేపర్ లో సర్కారీ బడులలో మరుగుదొడ్ల పరిస్థితిపై ఒక ఫోటో చూశాను. ఇద్దరు అమ్మాయిలు తలుపు లేని మరుగుదొడ్డి బయట నిలబడి చున్నితో అడ్డుగా పట్టుకున్న ఆ దృశ్యం నన్ను కదిలించివేసింది. అదే ఈ కవితగా కన్నీరు కార్చింది.]
ఎవరన్నారు ఈ దేశం మనకేం ఇవ్వలేదని?
చూడండి ఒకరి అవసరానికి ఇద్దరు సాయం చేసేంత గొప్ప
అవకాశం ఈ దేశమే నేర్పింది మనకు,
స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండీ సాగదీస్తున్న ప్రణాళికలు ఇప్పటికి...
ఆరునెలల్లో వూడిపోయే తలుపుల మరుగుదొడ్లు మిగిల్చాయి మనకు.
చూశారా? ఆడపిల్లలకి చున్నీలతో ఎంత లాభముందో....
మనలాగా శిక్షణ ఇచ్చేదెవరు?
సంక్షేమం పేరిట మనం ఎంతలా బొక్కుతున్నా
ప్రజలకి ఈ సర్ధుబాట్లు బాగా అలవాటు చేయగలిగాం
అంతకంటే ఏ దేశమైనా ఏం సాధిస్తుంది? మనలా.
కావాలంటే చూడండి
వచ్చే ఎన్నికలలోనూ నోటుకీ, మద్యం బాటిళ్ళకీ మేము అమ్ముడవకపోతే.
కాకపోతే...మనమూ మనుషులమేగా...అందుకే
ఒక్కటిమాత్రం గుర్తెరగాలి
ఇప్పుడిక్కడ లోపలున్నది ఒక అమ్మాయి సిగ్గుకాదు
ప్రజాస్వామం పేరిట దేశం మోసం చేస్తున్న మన ఇంటి పరువు.
శ్రీఅరుణం