"మీకు విజయం సాధించటానికి పనికి వచ్చే కొన్ని టెక్నిక్స్ నేర్పిస్తే చాలా? లేక , జీవితాన్ని పరిపూర్ణంగా సాధించుకోవటానికి కావలసిన అనుభవాల సారంతో తయారైన నిఘంటువు కావాలా?" అని నేను ఒక సమావేశంలో అడిగినప్పుడు...
ఎక్కువ మంది "పోటిని సాధించే టెక్నిక్స్ చెప్పండి సార్" అంటూ లేచారు,
కొందరు "ఇందులో ఏదో లాజిక్ వున్నట్లుంది? ఆయనే చెబుతాడులే. విందాం" అన్నట్లు చూస్తుండిపోయారు.
ఒకతను మాత్రం లేచి, "నాకు కంప్లీట్ లైఫ్ ని సాధించుకొనే విఙ్ఞానం కావాలి సార్" అని చెప్పగలిగాడు,
" ఎందుకంటే"...
"విజయం ఒక మెట్టే. కానీ జీవితం అలాంటి ఎన్నో మెట్లు ఎక్కాల్సిన గమ్యం. అందువల్ల జీవితాన్నే సరిగ్గా తెలుసుకోగలిగితే... ఇక ఈ విజయాలు నాకు సహచారులేకదా సార్" అంటూ సమాధానం ఇచ్చాడు.
ఆ జవాబే నా ఈ పుస్తకానికి స్ఫూర్తి.
from my book "ANTAR BRAMANAM"
శ్రీఅరుణం