సాహిత్యమంటే...ఒక మెరుపుకి గమ్యం
వీక్షించటానికే భయపడే ఆ విహల్వతనీ
పాదరసపు సెలయేరుగా వర్ణించగలదది.
వాస్తవాన్ని కల్పనతో సంగమింపచేయటంతో సాహిత్యమే బ్రహ్మ
అది రబ్బరులాంటి గుండెను శిలగా చూపుతుంది
రాళ్ళకు గుండెను అతికించి పాకుడురాళ్లనూ చేయగలదు
అనుసరించిరాసేది అందరికీ అందదు
అనుభవించిందే...కలాన్ని ఖడ్గంలా మారుస్తుంది
అదేంటోగానీ ఈ దేశంలో అవార్డులకు జీవితకాలమంత ఆలస్యం
కొందరికి మోయగలిగినంత డబ్బుంటే వస్తాయి
మరికొందరికి మోయలేనంత వయసొస్తేగానీ రావటంలేదు
మొదటివారికి వాటివల్ల బ్రతుకుతెరువు లభిస్తుంది
రెండవవారివల్ల వాటికే వెలుగొస్తుంది
"ఒరేయ్ బాబూ సమాజం కోసం రాయాలనుకుంటే వాస్తవాలను చెప్పు,
నీ బాగుకోసం రాయాలనుకుంటే కల్పనలతో ముగించేయ్" అంటూ ఆయన నాకు చెప్పిన
అక్షరపుష్పాలను ఆయన పాదాలపై వుంచుతూ అంజలి ఘటిస్తున్నాను
అయ్యా. "రా వూరి"కి అంటూ సరస్వతమ్మ పిలిచిందా?
అంత త్వరగా వెళ్ళిపోయారు
మీరు ఎక్కడికి వెళ్ళినా మాకోసం చాలా సాహిత్యపు ఆస్థినే వదిలివుంచిపోయారు
కలానికీ కాలానికి పుట్టిన ఒక కవివరేణ్యా అందుకోండివే శ్రీఅరుణపు అశ్రు నివాళి.
శ్రీఅరుణం