ప్రస్తుతం...సాహిత్యానికి అంతగా ప్రోత్సాహం లభించటంలేదనేవారిని కొందరిని చూశాను. అంత ఓపిగ్గా పుస్తకాలు చదివేవారు తగ్గిపోయారు అనేవారినీ విన్నాను. అయినా ఈ సాహిత్యవనంలోకి ప్రవేశించాను. శ్రీఅరుణం గా నాకు లభించిన సాహిత్యపరమైన గుర్తింపే ఈ పుట్టినరోజు. అన్నివిధాలా నాకంటే ఎందరో పెద్దవారు నాకు బ్లాగ్ ద్వారా, ఫేస్ బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, మెయిల్స్ ద్వారా, ఫోన్ ద్వారా జన్మధిన శుభాకాంక్షలను తెలపటం, అలాగే నా 2వ పుస్తకం ఆవిష్కరణ సంధర్బంగా ఆచార్య దామెరవెంకట సూర్యారావుగారు, ఆచార్య వెలమల సిమ్మన్నగారు, శ్రీ నండురి రామకృష్ణగారు, విశాఖ సాహిత్య భీష్మాచార్య కొసనాగారు వంటి గొప్పసాహిత్యవేత్తల నడుమ కూర్చునే బాగ్యం నాకు కేవలం ఆ సాహిత్యరంగంలో వుండటం వల్లనే లభించింది. మీరందరి దగ్గరా నేను చాలా చిన్నవాడిని. అయినా నాకోసం మీరు చూపిన అభిమానానికి శిరస్సువంచి నమస్కరిస్తూ ...
మీ
శ్రీఅరుణం
9885779207