"కలలు మనసును నిలుపుతాయి..
మనసు కవిత్వాన్ని నింపుతుంది..
కవిత్వం జీవితాన్ని నిలబెడుతుంది..
జీవితం మనిషిని నిలబెడుతుంది..
మనిషి ప్రపంచాన్ని నిలబెడతాడు..
ప్రపంచం వాస్తవాన్ని నిలుపుతుంది..
వాస్తవం ఆశల్ని బ్రతికిస్తుంది..
ఆ ఆశలే మనకు రేపటిని ముందుంచుతాయి. ఇదే నా ఈ పుస్తకం రాస్తూ నాకు నేను తెలుసుకున్న నిజం.
జీవితంలో ప్రతీక్షణం ఓడిపోతూ..మూడు నాలుగుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించబోయీ.. విరమించుకున్న ఒక మనిషి, ఆ విషాదపు కోరలలో తనకు కరవైన `తోడు`ని మిగిలిన వారికీ ఇవ్వటం ద్వారా నేడు అనేకమందిలో పేరుకుపోయిన అంతర్మధనాన్ని తొలగించడానికి చేస్తున్న ప్రయత్నమిది.
ఈ పుస్తకాన్ని రాయటం ప్రారంభించినప్పుడు మనసులో వున్నది పై భావనొక్కటే. కానీ దీనికొరకు తవ్వుతున్న గతం, ఇతరుల జీవితాలూ, భావావేశాలూ, తర్కం.. ఇవన్నీ నాలో నన్నే విమర్శించాయి. ముందు నన్ను నేను మార్చుకోవలసింది చాలావుందని దీన్ని రాస్తున్నప్పుడు నాకు అర్ధమైంది. ఒకరకంగా అది నాకు మొదటి గెలుపు. అలా కొనసాగించిన ఈ రచన పూర్తి అయ్యేనాటికి.. నాకు ఓటమి నుండి తప్పించుకోవాలన్న అభధ్రతాభావం కంటే, విజయాన్ని అందుకోవాలన్న వాంచకంటే, విజయంపైనే గెలిచితీరటం జీవితపు సహజగుణం అని తెలిసిపోయింది". ఒక గొప్ప విజయం మనిషి చేసిన తప్పుల్ని మర్చిపొయేలా చేస్తుంది. ఒక అపజయం అదే మనిషిలో లేని లోపాల్ని కూడా వెతికి తెచ్చి మరీ కృంగదీస్తుంది. ఎందువల్ల జరుగుతుందిలా? మన ఆశయాన్ని నిర్ణయించుకున్నప్పుడే.. దానికి పుల్ స్టాప్ కూడా పెట్టేసుకుంటున్నాం మరి. బ్రతికేది వందేళ్ళే అని తెలిసినా, అందులోనూ సాధారణ జీవితకాలం అరవై నుండి డెబ్బై మధ్యలోనే అని రుజువవుతున్నా, ఇంకా ఇంకా బ్రతుకీడ్చాలని ప్రాణంపై తీపి పెంచేసుకుంటున్న మనం.. మరి.. ఆ కాలమంతా ఎదుగుతూ వుండటం కూడా అంతే అవసరమని ఎందుకు భావించలేకపోతున్నాం?
అదే. ఆ అన్ బ్యాలెన్సింగ్ థాటే..మనల్ని ఓటమి దగ్గర ఓడిపోయేలా చేస్తుందని గ్రహించండి ముందుగా.
అప్పుడు జయానికీ, అపజయానికీ మధ్యనున్న తేడా పెద్దవిషయంలా మనల్ని భయపెట్టదు. ఓటమి అనుభవంగా మారుతుంది. విజయం అలవాటవుతుంది. సాగుతూవుండే జీవితగమనం మనల్ని మరింతగా ఎదిగేందుకు నిరంతరం అధ్బుతాలను చేయిస్తూనే వుంటుంది.
"అదే విజయాన్ని గెలుచుకోవటమంటే"
ఇక్కడ విజయమంటే.. నువ్వు బ్రతికితీరాలనుకుంటున్న కాలమంతా సంపూర్ణంగా గెలుచుకొనే అలవాటుని సొంతం చేసుకోవటమే.
from my book "అంతర్ భ్రమణం"నుండి
లభ్యమయ్యే ప్రదేశం
శ్రీ వెంకటేశ్వరా బుక్ డిపో, విజయవాడ, విశాఖ,హైదరాబాద్.
మరియు నా నెంబర్ కీ కాంటాక్ట్ చేయండి 9885779207,
శ్రీ వెంకటేశ్వరా బుక్ డిపో, విజయవాడ, విశాఖ,హైదరాబాద్.
మరియు నా నెంబర్ కీ కాంటాక్ట్ చేయండి 9885779207,
మరియూ... నా ఇంటర్ నెట్ స్నేహితులందరికోసం, పది రోజుల తరువాత నుండి www.kinigi.com ద్వారా ఇ.పబ్లిష్ గా కూడా లభ్యమవుతుంది.
శ్రీఅరుణం