నాకు
తెలిసీ `ఈ ప్రపంచంలో ఓడిపోవటానికంటే గెలవటానికే ఎక్కువ మార్గాలున్నాయి`
కావలసిందల్లా.. వాస్తవం గ్రహించగలిగిన అవసరం మాత్రమే. అప్పుడే ఆ అవసరం మనకు
అవకాశాలను పెంచుతుంది.
సివిల్స్ కి ప్రిపేరవుతున్న ఇద్దరు స్నేహితులు, దానికి అవసరమైన టైం టేబుల్, డబ్బు, ఇతర అంశాలలో ఎంతో చక్కగా ప్రణాళిక సిధ్ధం చేసుకున్నారు. ఇందులో రెండవవాడు తన స్నేహితునితో పాటూ చదువుతూనే... అతనికి తెలియకుండా తనకి మరో ప్రణాళిక తయారుచేసుకున్నాడు. వారిద్దరి ప్రణాళిక ప్రకారం వుదయం ఏడు గంటలకి ప్రారంభించే చదువు రాత్రి పది గంటలవరకూ సాగుతుంది. అంటే సుమారుగా పదిహేనుగంటలు. నిజానికి వారి అవసరానికి అది సరైన హార్డ్ వర్కే. ఇది అలా కొనసాగటం ప్రారంభమైంది.
ఇక రెండవ వాని అదనపు పని రాత్రి పదకొండు గంటలకి తన ఇంట్లో మొదలవుతుంది. అలా మొదలైన చదువు అర్ధరాత్రి మూడువరకూ కొనసాగించి పడుకోనేవాడు. అందుకొరకు మొదటివాడికి తెలియకుండా మళ్ళీ ప్రత్యేకంగా బుక్స్, నోట్స్ తయారుచేసుకోవటం మొదలైంది. ఇది కొంత అదనపు పని అతనికి. అయితే
విపరీతమైన శ్రమా,
అవసరానికి మించిన సమయం,
అంతకంటే తను పొరపాటు చేస్తున్నానేమోనన్న చిన్న లోపలి భావం… ఇవన్నీ అతనిలో తన అవసరానికి మించిన డిస్టర్బెన్స్ ని కలిగించటం మొదలెట్టాయి. అది కన్ఫ్యూషన్ కి దారితీసింది. మాములు ప్రణాళికలో కూడా వెనక బడిపోయాడు. చివరికి పరీక్షలనాటికి తీవ్రమైన జ్వరంతో అనుకున్న లక్ష్యం పూర్తి చేయలేకపోయాడు. అతని మిత్రుడు మాత్రం తన ప్రణాళికని ఖచ్చితంగా పాటించి విజయాన్ని అందుకున్నాడు.
ఇప్పుడు నిర్ణయించుకోండి...పోటీప్రపంచంల ో మీ స్థాయి ఏమిటో? దాన్ని ఖచ్చితంగా ఫిక్స్ చేసుకొని మీ లక్ష్యంవైపుకి సాగండి.
శ్రీఅరుణం.
9885779207
విశాఖపట్నం-530001
సివిల్స్ కి ప్రిపేరవుతున్న ఇద్దరు స్నేహితులు, దానికి అవసరమైన టైం టేబుల్, డబ్బు, ఇతర అంశాలలో ఎంతో చక్కగా ప్రణాళిక సిధ్ధం చేసుకున్నారు. ఇందులో రెండవవాడు తన స్నేహితునితో పాటూ చదువుతూనే... అతనికి తెలియకుండా తనకి మరో ప్రణాళిక తయారుచేసుకున్నాడు. వారిద్దరి ప్రణాళిక ప్రకారం వుదయం ఏడు గంటలకి ప్రారంభించే చదువు రాత్రి పది గంటలవరకూ సాగుతుంది. అంటే సుమారుగా పదిహేనుగంటలు. నిజానికి వారి అవసరానికి అది సరైన హార్డ్ వర్కే. ఇది అలా కొనసాగటం ప్రారంభమైంది.
ఇక రెండవ వాని అదనపు పని రాత్రి పదకొండు గంటలకి తన ఇంట్లో మొదలవుతుంది. అలా మొదలైన చదువు అర్ధరాత్రి మూడువరకూ కొనసాగించి పడుకోనేవాడు. అందుకొరకు మొదటివాడికి తెలియకుండా మళ్ళీ ప్రత్యేకంగా బుక్స్, నోట్స్ తయారుచేసుకోవటం మొదలైంది. ఇది కొంత అదనపు పని అతనికి. అయితే
విపరీతమైన శ్రమా,
అవసరానికి మించిన సమయం,
అంతకంటే తను పొరపాటు చేస్తున్నానేమోనన్న చిన్న లోపలి భావం… ఇవన్నీ అతనిలో తన అవసరానికి మించిన డిస్టర్బెన్స్ ని కలిగించటం మొదలెట్టాయి. అది కన్ఫ్యూషన్ కి దారితీసింది. మాములు ప్రణాళికలో కూడా వెనక బడిపోయాడు. చివరికి పరీక్షలనాటికి తీవ్రమైన జ్వరంతో అనుకున్న లక్ష్యం పూర్తి చేయలేకపోయాడు. అతని మిత్రుడు మాత్రం తన ప్రణాళికని ఖచ్చితంగా పాటించి విజయాన్ని అందుకున్నాడు.
ఇప్పుడు నిర్ణయించుకోండి...పోటీప్రపంచంల
శ్రీఅరుణం.
9885779207
విశాఖపట్నం-530001