అలా స్తబ్ధత
ఆవరించిన ఆర్యవ్యవస్థలోని పాలకుల వలసవిధానలకు తలొగ్గి జీవించటం ప్రారంభించారు.
అశొకుడు వంటి
చక్రవర్తుల కాలం నుండీ రాజు యొక్క మానసిక పరిస్థితికి తగినట్లుగా తమ బ్రతుకులను
మార్చుకుని బ్రతకటం అవసరమైంది వారికి.
అలా అనేకమంది రాజుల
అవకాశాలతో విసిగి వేసారిన వారి మనసులకు అక్బర్ వంటి జాతీయసార్వభౌముడి పాలనలో కొంత
సేదతీరగలిగే అవకాశం ఏర్పడింది. కానీ,అదీ ఎన్నినాళ్ళో మిగలని పరిస్థితి
మళ్ళీ ఔరంగజేబు ద్వారా సంక్రమించింది.
తమలోని ఏకత్వ
భావనకు తూట్లు మొలిచిన ఆ కాలంలో మనిషి మతం
మార్చుకునో,కులాన్ని నమ్ముకునో, ప్రాంతాలను మార్చుకునో, చివరికి మనిషే మారిపోతూనో జీవితాల్ని నిలుపుకోవాల్సిన పరిస్థితి.ఇదంతా
ఎందూకంటే? ముందు మనిషి బ్రతకాలికదా.అలా పొర్లుతూ వచ్చి
బ్రిటీష్ వారి పాలనకొచ్చి పడ్డారు.
1922లో
సహాయనిరాకరణ జరిపినప్పుడు పిలిస్తేకానీ ఉద్యమంలోకి రాని ప్రజలూ,
1930
శాసనోల్లంఘనానికి పిలవకున్నా ముందుకొచ్చారు,
అదే 1942నాటి
క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకులమైన తామంతా జైళ్ళలో వున్నా వారే అత్యంత తీవ్రంగా
ఉద్యమించి ప్రభుత్వాన్ని పెకళించగలిగేలా నిలిచారు.అలా పరాయివారి పాలన నుండి
తమనితాము రక్షించుకోవాలన్న ఆశయం వారిలో మళ్ళీ ఒక గొప్ప ఏకత్వ భావనకు
దారితీయగలిగింది.కానీ, మళ్ళీ ఇప్పుడు వందలసంవత్సరాలు పోరాడి
స్వాతంత్ర్యాన్ని సాధించుకుంటున్నామనుకుంటున్న ఈ దశలో వీరికి మళ్ళీ ఆ పాత వాసనలు
కావలసి వచ్చాయంటే కారణం ఎవరు???...
నిజానికి
ప్రజలు అమాయకులు. తమకోసం తెలివితేటలను ఉపయోగించుకునే కొందరు, ప్రజలను
ఇలాంటి దారులలోకి మళ్ళిస్తున్నారు. ఈ దేశప్రజలకు నిండుగా శక్తిసామర్ధ్యాలున్న,
వాటిని నిరంతరమూ వినియోగించుకోగల అవకాశం వారికి ఈ నేల అందించలేదు.
ఒక రాజుకాలంలో చేయతగినది మరో రాజు కాలంలో అనైతికం అయ్యే పరిస్థితి. ఇప్పుడా స్థానం
మతం తీసుకుందేమో.అందువల్లనే ఆయా కాలాలకు తగినట్లుగా తమనితాము మలుచుకునే
వెన్నపూసబొమ్మలయ్యారు ప్రజలు.ఒకరకంగా అది తమ తరం నాయకులకు గొప్పవరం.స్వాతంత్ర్యం
సాధనతో నూతన భవిషత్తుని స్వేఛ్చగా నిర్మించుకోగల ఈ అవకాశం నిండుగా లభించిన తమకు
ఇప్పుడే ప్రజల్ని పాతకాలపు నిస్తేజం నుండి బయటకు తీసుకురావాల్సివుంది.
నడిపించగలిగే నాయకత్వం వుండాలేకానీ వారికోసం ఏదైనా చెయ్యగల చరిత్ర ఈ ప్రజలది.ఒక
మాములుమనిషినయిన నన్నే మహత్ముడిగా నమ్ముకోగలిగారు వీళ్ళు.అలాంటివారి నడకలో తేడా
వస్తుందంటే కారణం తామేకద.నాయకులమైనందుకు మరి మనమేం చేస్తున్నాం?
1919లో
పరాయివాడి అసూయలోంచి పుట్టిన మత నియోజకవర్గాలన్ని చీలిక స్వభావానికి తలొగ్గాం.
అదేకదా ఇప్పటి ఈ విభజనకి కారణం.ముక్కలుగా చేసిన ఈ గడ్డపై అటు ఇటూ రాలిపోతున్న
ప్రాణాలెవరివి? మనవారివికదూ? వారికి
జరిగిన మానసిక వ్యధకు చికిత్య చేయటం మాని, మావాళ్ళిందరూ...మీవాళ్ళిందరూ
అని రక్తానికీ చీలిక లెక్కలను కడుతున్న మన నాయకత్వానికి ఏ పాపం అంటుకోనుంది?
మనం నాయకులమా? లేక...
మనపై పెట్టిన
నమ్మకాల కాష్టాలను కాల్చుకుతుంటిన్న దోపిడిదారులమా?
కలిసుండాలనుకున్నా,విడిపోవాలనుకున్నా
అది ప్రజల తప్పు కానేకాదు.నాయకులదే తప్పు. ఎందుకంటే 'మేము
మీకంటే కాస్తంత తెలివైనవారిమని" చెప్పి మనం నాయకత్వం వహించి వారిని
నడిపించాం.
నా చుట్టూ
వున్న పిల్లలకు నేనోక ఆదర్శపాఠ్యాంశం కాగలనన్న నమ్మకంతోటే నేనూ ఈ
స్వాతంత్ర్యపోరాటంలోకి రాగలిగాను. అలాంటి నేను ఈ దేశ స్వాతంత్ర్యంతో పాటు విభజననీ
ఎలా అందించగలనూ. అందుకే మీరంతా స్వాతంత్ర్య ఉత్సవాలను జరుపుకుంటుంటే,నాకు
ఆనందం లేదు.అందరినీ ఏకతాటిపై నడిపి నేను సాధించాలనుకున్నది... చీలికద్వారా
వచ్చిందన్న బాధే నాకు విలాపంగా మారింది.
కుటుంబం
చదువు
ఉద్యోగం
ఆస్తి
చివరకు ప్రాణం
కూడా దేశానికి ధారబోసి, తనపై భరోసాతో మరణించినవారి ఆత్మలకు నేనేమని సమాధానం
చెప్పాలి?ఇది ఇలా వదిలేసివచ్చావే అని వారు రేపు నన్ను అడిగే
ప్రశ్నలకు సమాధానం ఎవరిస్తారు?స్వాతంత్ర్యం కోసం మనలో మనమే
చీలికలు తెచ్చుకొనే కొత్త సంస్కృతికోసమా నువ్వు ఈ పోరాటం చేశావని అడిగేవారి ముందు
నా ఆహింసా, సత్యాగ్రహం ఏమని బదులిస్తాయి.
"హే
భగవాన్.నా ప్రజలకి ఒక మంచి దారినివ్వు.మళ్ళీ అదికారం ఆడించే బొమ్మలుగా వారిని
మార్చకు.దేశానికి లభించిన స్వాతంత్ర్యమే ఇంత పెద్ద విభజనకు దారి తెలిస్తే ,
ఇక అంతర్గత స్వాతంత్ర్యం లభించే స్వాతంత్ర్యం ఏం
చేయబోతుంది"అంటూ ఘోషిస్తున్న గాంధీజీ ఆత్మ సాక్షిగా మన పెద్దలు దేశాన్ని నడిపించటానికి
మన రాజ్యాంగాన్ని తయారు చేయటం ప్రారంభించారు.
అత్యున్నతమైన
ఆ రాజ్యాంగం మనకు ఏం చెప్పింది...మనం దానిని ఎలా నమ్ముకున్నామన్నదీ తరువాత వార [sep17]
నుండి చూద్దాం...
శ్రీఅరుణం