నేను నిన్ను కలవటానికి ముందు...
నాకు నువ్వు నిజం చేసుకోవాలనుకున్న కలవి,
నిన్ను నేను కలిసిన తరవాత...
కలయో? నిజమో? తెలియని అయోమయానివి,
మనం లాక్కొచ్చిన నిన్నటివరకూ...
నువ్వు ఎప్పటికైనా నిజమవుతావోనన్న ఆశవి,
ఇప్పుడు మాత్రం...
నా కలలకి మిగిలిన ఙ్ఞాపకానివి.
{from my 2nd book "నీ అడుగులలో...నా ఙ్ఞాపకాలు..."nundi}
ప్రేమను నమ్మేవారందరికోసం ఇప్పటివరకూ పబ్లిష్ అయినవి మరియూ మరికొన్ని కలిపి నా ప్రేమకవితలన్నిటినీ కవితాసంపుటిగా మలచి "నీ అడుగులలో...నా ఙ్ఞాపకాలు..."గా కళావేధికవారి అధ్వర్యంలో డిసెంబర్ 14న ఆవిష్కరించబోతున్నారు. మరిన్ని వివరాలు మరో రెండురోజుల్లో చెప్పుకుందాం.
మీ
శ్రీఅరుణం