Friday, November 20, 2015

పంచాయతీ రాజ్

పంచాయితిసెక్రెటరీగా నా జాబ్ ప్రొఫైల్ చూసిన నా మిత్రుడొకడు ఏదైనా సేవాసంస్థకి సెక్రేటరీగా పని చేస్తున్నావా అని ప్రశ్నించాడు. ఆది అతని విఙ్ఙానానికి సంబందిoచిన ప్రశ్నే కావొచ్చు...కానీ పంచాయతీరాజ్ ఎంత అత్యున్నతమైన వ్యవస్థో... అంతస్థాయిలో ప్రజలలో ఇంకా మిళితంకాలేదేమో? అని నాకనిపించింది. ఆయితే గత కొంతకాలంగా దీనిలో ప్రగతికారక మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నది వాస్తవం. ఈ సందర్బంగా నేను వుద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ గురించి నాకు అర్ధమైనంతవరకూ అందరితో పంచుకొవాలని నేను రాస్తున్న వ్యాసం ఇది.
6,40,867గ్రామాలు కలిగి, 69శాతం జనాభాని భరిస్తున్న భారతదేశపు గ్రామీణవ్యవస్థ పరిపాలనలో పంచాయతీరాజ్ విధానం అత్యున్నతమైన అధికారపు కేంద్రం. దీనికింత విలువవుండబట్టే భారతరాష్ట్రపతికి కూడా లేని చెక్ పవర్ గ్రామపంచాయతీకి చెందిన ప్రజాప్రతినిధి అయిన సర్పంచ్ కి ఇవ్వబడింది. అంతగొప్ప వ్యవస్థ గురించి మనమంతా తెలుసుకోవాల్సివుంది. నేను ఈ వ్యవస్థలో వుద్యోగిగా చేరి 500రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా నాకు అవగతమైన విఙ్ఞానాన్ని మీముందుంచుతున్నాను. ఇది నేను నా గ్రూప్ 1 ప్రిపరేషన్లో భాగంగా ఒకప్పుడు తయారుచేసుకున్నదే అయినా ప్రస్తుతం నాకు దొరికిన మరికొంత ప్రత్యక్ష విషయ అవగాహనతో కూర్చి రాస్తున్నాను. తప్పులుంటే నాకు తెలియచేసి దిద్దుకునే అవకాశం ఇవ్వగలరని ప్రార్ధన.
ఈ వ్యాసాన్ని కొన్ని భాగాలుగా విస్తరిద్దాం.
1.పంచాయతీ రాజ్ అంటే ఏమిటి?
2.పంచాయతీరాజ్ ఏర్పడిన నేపద్యమేమిటి?
3.పంచాయతీరాజ్ బలపడటానికి తీసుకున్న నిర్ణయాలేమిటి?
4.పంచాయతీరాజ్ వ్యవస్థ పనితీరు ఏలావుంది?
5.పంచాయతీరాజ్ లో విజయాలు
6.పంచాయతీరాజ్ లొ దోషాలు
7.పంచాయతీరాజ్ లో ప్రస్తుతం జరుగుతున్న ప్రగతికారక చర్యలు
8.పంచాయతీరాజ్ మరింత విజయానికి తీసుకోవాల్సిన చర్యలు- నా సమీక్ష.
ప్రతీ రెండురోజులకూ ఒకసారి ఒక్కొక్క పాయింట్ తో మీ ముందుకొస్తాను.
శ్రీఅరుణం[పి.శ్రీనివాసరావు]
పంచాయతీ సెక్రేటరి
చొంపి & శిరగం గ్రామపంచాయితి...
అరకువేలీ మండలం
విశాఖ జిల్లా
9885779207

atididevobhava

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.