నా మొదటి మాట
సృష్టి మొదలై యుగాలవరకూ సాగిపోతున్న ఈ జీవనగమనంలో "ప్రేమ" నిరంతర సాహిత్యసంపదగా ఫరిఢవిల్లుతూనేవుంది.
దానికి పరిధి లేదు, అంతరాలు లేవు, సంధర్భం లేదు, సమయభావన అస్సలుండదు. కానీ....
తెలియదనుకొనీ తెలిసినట్లూ..
వద్దనుకొనీ కావాలనుకున్నట్లూ..
ఆంతర్యానికే సమాధానం చెప్పుకోలేని భావనాపరంపరను మన హృదయాలలో నింపేసేది ప్రేమ.
అంత అపురూపమైన సంపదను మనకందించే మనసుని సృష్టించి ఇచ్చిన భగవంతునికి మనం ఏమిచ్చి రుణం తేర్చుకోగలం? మరి.... ఈ ప్రేమ పేరుతో ఇప్పుడు సాగుతున్న దాష్టికాలకు ఏదో విధంగా కారణాభూతులం అవుతూ., ఆ దేవుని దయను మనం నాశనం చేసుకోవటం లేదూ?
బ్రతకటం భౌతికత్వం
జీవించడం అభౌతికత్వం
ఈ రెండిటి కలయికే మానవజీవితానికి పరమార్ధం. చదువు, కీర్తీ, డబ్బూ,ఉద్యోగం ఇవన్నీ కావాలి బ్రతకడానికి. వాటితో పాటూ ప్రేమ కావాలి జీవించడానికి. బ్రతకటం మాత్రం తెలుసుకుంటే, నువ్వు నీచుట్టు పక్కల అందరికీ సమాధానం చెప్పగలవు. కానీ జీవించడం కుడా నేర్చుకుంటేనే.. నీకు నువ్వు సమాధానం చెప్పుకోగలవ్. అప్పుడే సంపూర్ణ మానవుడివవుతావు. ఆత్మసాక్షిలేని గమనం జనాభాలెక్కలకే పనికొస్తుంది.
అందుకే ఈరోజున అర్ధమే మారిపోయిన ప్రేమ గురించి నేను చేసిన పరిశోధనా పత్రం ఇది. నన్ను నేను అర్పించుకున్న ప్రేమ నాకు అందించిన మనఃసాక్షి ఈ నాలుగు అధ్యాయాలు.
ఇది ప్రేమించాలనుకొనేవారికి ప్రేమ సన్నిధిని చూపెడుతుంది.
ఇది ప్రేమలోని వియోగం అందించే కన్నీటి బరువునూ చూపెడుతుంది.
ఇది ప్రేమవియోగపు అనియంత్రిత ఖేదం చూపెడుతుంది.
ఇది ప్రేమవియోగపు అనియంత్రిత ఖేదం నుండి మనిషిగా మనం సాధించాల్సిన మోక్షం ని తెలుపుతుంది.
from my book నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు...
for book
శ్రీఅరుణo
9885779207