ఒక పని సాధించాలంటే దానికై చూడవలసిన భిన్న కోణాలుంటాయి. వాటన్నిటినీ సమ్మిళితం చేయటంలో మనం సంపాధించుకున్న విఙ్ఞానమే వ్యక్తిత్వంగా రూపుదిద్దుకుంటుంది. సహజంగా ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని అభివృధ్ధి చేసుకోవటానికి తన జీవిత విధానాన్ని మార్చుకోగలిగితే చాలనుకుంటారు. కానీ మానవుడు సంఘజీవిగా తనతో పాటూ బ్రతుకీడుస్తున్న సమాజంలో అతని వ్యక్తిత్వవికాసం తనతోనే కాక, ఎదుటి వారినుండి కూడా ప్రభావితమవుతూ వుంటుదని మర్చిపోకూడదు. అందులో భాగమే కనుక బయట ఇంటర్వూలకు వెళ్ళేటప్పుడో, పదిమందిలో ప్రత్యేకంగా కనిపించటానికో, సమాజంలో అందరికంటే ముందుగా పరిగెత్తటానికో మాత్రమే మన వ్యక్తిత్వ వికాసానికి కావలసిన వివిధ అంశాలను నేర్చుకోవాలని చాలామంది నమ్మకం. అది మన పనికి మంచి ఫలితాన్నిస్తుంది, నిజమే.అయితే ఆ వ్యక్తిత్వం మనకొక కోర్స్ లా కాకుండా, మన జీవితంలా మార్చుకోగలిగితేనే `నువ్వు` అనేది ఒక సంపూర్ణమైన వ్యక్తిత్వం అవుతుంది. అందుకు కొన్ని లక్షణాలు కావాలి. అవి...
1.డ్రస్ కోడ్
2.సంభాషణ
3.ఎదుటివారిని గౌరవించటం
4.సంధర్బోచిత విఙ్ఞానప్రదర్శన
5.ముగింపునివ్వగల సమర్ధత
from my book "anthar bhramanam"
“శ్రీఅరుణం”
9885779207