చాలారోజుల తరువాత మళ్ళీ
ఆజాద్ చంద్రశేఖరుడు మీసం మెలివేశాడు
లేతయవ్వనంలోనే తన తనువుచాలించిన దేశం ఇదా? అని
రోదిస్తున్న భగత్ సింగ్ తృప్తిగా నవ్వుతున్నాడు
కార్పోరేట్ చదువులతో చెదలుపట్టిన మహాప్రస్థానం మళ్ళీ
యువత చేతులలో తుళ్ళిపడబోతుంది
ఇదంతా ఒకప్పుడు కల
ఇప్పుడు....
నిజమవబోతున్న భరతమాత మరో బిడ్డడి ఆశయపు వెలుగు.
అక్షరం చదవటమంటే....
పదాలను నెట్టివేసుకుంటూ వెళ్ళిపోవటమనుకుంటున్న తరానికి
రక్తం విలువనూ
ఆశయపు అర్ధాన్నీ
ఆర్తనాదపు వైశాల్యాన్నీ
సామాన్యుని గుండె చుట్టుకొలతనూ
తెలుసుకునే దారిని మళ్ళీ చెప్పగలుగుతున్న జనసేనకు సిద్ధంకండి
సూటిగా వున్నా...నిజం ఎప్పుడూ అలాగేవుంటుంది, నిర్భయంగా
తెగించినా... వున్నతమైన ఆశయం ఎప్పుడూ అలాగే నిలబడుతుంది...కచ్చితంగా
కఠినమైనా.... దేశభక్తినిండిన మాట అలాగే వుంటుంది...అత్యున్నతంగా.
"అరవై సంవత్సరాల స్వాతంత్ర్యం ఏమిచ్చిందని" ప్రశ్నించే హృదయాలన్ని ఇప్పుడు
రండి సంఘటిద్దాం
మనందరికోసం తననంతాధారపోస్తానంటున్న మరో త్యాగధనుడొచ్చాడు
కాపాడుకుందాం.
శ్రీఅరుణం
9885779207
విశాఖపట్నం
1 comment:
మీ కవితావేశం బాగుంది.
పవన్ కళ్యాణ్ రెండు ప్రసంగాలూ బాగున్నాయి.
ప్రతి మనిషిలో ఉన్న ఆలోచన, ఆవేశం, ఆవేదన, ఉక్రోషం ప్రతిఫలించిందా మాటలలో.
ఇది నిజమైన ఉద్యమము యొక్క రూపం. ఈ రూపాన్ని మార్చుకోకుండా కలకాలం ప్రజల క్షేమాన్ని, వృద్ధిని కాంక్షించే విధంగా ఉండాలని, దేశభక్తులందరూ అందుకు తోడ్పడాలని కోరుతున్నా.మేధావిలా ఆలోచించగలిగినా, మాట్లాడే విధానాన్ని ఇంకా మెఱుగుపర్చుకోవాల్సి ఉంది.
Post a Comment