part-6
నా జీవితంలో నాకేదీ తేలిగ్గానో, అదృష్టంకలిసొచ్చో లభించినవి కాదు. ప్రతీదీకూడా విపరీతమైన శ్రమా, ధారుణమైన సమస్యలను అధిగమించగలిగితేనే దొరొకేవి. ఆ దారిలో అందరిలానే నన్నూ మరికొన్ని సహజమైన అంశాలుకూడా ప్రభావితం చేస్తుండేవి.
ప్రేమపేరిట విఫలమైన బంధం...
చుట్టుముట్టిన ఆర్ధికసమస్యలూ...
పరాజయాలను కత్తులుగా మార్చి నిరంతరం నన్ను ప్రశ్నించి చంపే సమాజం...
ఇవి చాలవన్నట్లు నా నమ్మకాన్ని తమ స్వార్ధానికి వాడుకుని మోసం చేయడానికి సిద్దపడిన కొందరు మహానుభావులూ... ఇలాంటివన్నీ నన్ను నిరంతరం వేధనకు గురిచేశాయి.కానీ వాటిని అనుభవిస్తున్ననేను ఎప్పుడూ సమస్యనుండి బయటకిరావాలన్న వాస్తవాన్నే నమ్ముకునేవాడిని. ప్రతీ సమస్యనీ ఒక శాస్త్రంలా అనుభవించసాగాను. అలా నేను అనుసరించిన ధృక్పధం నన్నొక కవిగా, రచయితగా మార్చింది.
సమస్యలు నాలో రేకెత్తిస్తున్న ఆవేధన, ఆక్రోశం, ఆవేశం....ఇలాంటివాటిపై నేను చేస్తున్న పోరాటంలో కొన్నిక్షణాలలో అలిసిన నా ఆత్మ నాలో ఒక ప్రశ్నను ఉదయింపచేసేది. అది
"నా సమస్యని నేను దాటేసి వెళ్ళిపోవటం నన్ను ఒక మనిషిగా నిలబెట్టవచ్చు. కానీ, ఆ సమస్యని అనుభవించి దానినుండి బయటకు రావటానికి నేను నిర్మించుకున్న సూత్రం అందరికీ అందచేయటం వల్ల నన్ను కాపాడుకున్న ఈ సమాజానికి నేను కొంత రుణంతీర్చుకున్నవాడినవుతానుకదా? " ఈ ప్రశ్నే నాతో కలం పట్టుకునేలా చేసింది. అందుకే నా కలానికున్న ప్రత్యేక లక్షణం "ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇన్నర్ సెల్ఫ్"
నా ఫీలింగ్స్ నీ, సమాజం దానిని ఏక్సెప్ట్ చేసిన విధానాన్ని అందరికీ తెలపటమే నా సాహిత్యానికి మూలం అని నమ్మాను. ఆ జాగృతిని అందరికీ అందించాలనే అరుణోదయంలోని చెతన్యం ప్రపంచానికి దీపికలా, నా పేరులోని మొదటి అక్షరం శ్రీ కి జతపరిచి "శ్రీఅరుణం" అనే కలం పేరిట నా అక్షరాలను అందరికీ అందించటం ప్రారంభించాను. అలా మొదలుపెట్టిన నా తొలికవిత 2007లో ఆంధ్రభూమిలో అచ్చయింది. అలా ఇప్పటికి సుమారు వందకవితలవరకూ వివిధ పత్రికలలోనూ, దినపత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. అందులో నా తొలికవితను ఇక్కడ వుంచుతున్నాను.
ఈ గుండె గదులలో…
కనురెప్పలు శ్వాసిస్తే కలలు మేల్కొంటాయి
హృదయపు కొలను నుండి ….
ఙ్ఞాపకాల రంగులను ముంచి తెచ్చుకుంటాయి
నేను నువ్వుగా..నువ్వు నేనుగా చిత్రితమవుతున్న ఆశలను..
విరహమనే కాన్వాసుపై..ముద్రించుకుంటాయి .
అనంతవిశ్వాన్నీ జయిoచగల వూహల గమ్యo..
నీ దగ్గరకొచ్చేసరికి ఆగిపోతుంది.
నేనంటే ఇంకేంలేదు..అంతా నువ్వేనంటూ.
నా గుండెలపై తారాట్లాడిన.. నీ చేతివ్రేళ్లు
నా నుదిటిన చుంభించిన నీ బుజ్జి పెదవులు
ఆస్వాదనతో నిండిన మెడపై చెమటను
తుడిచిన అమ్మలాంటి చేతులూ,
ముద్దుగా నెత్తిపై కొట్టి “అమ్మోదేవుడిపేరంటూ”
వెనుకగా హత్తుకొని భుజంపై వాల్చిన తల
.....ఎన్నని చిత్రించనూ..ఈ గుండె గదులలో …..
నిజంగా...
అరుణానికి సంపూర్ణ వర్ణం ఎవరు గీయగలరు???
ఇక నా పోరాటంలో నేను నిలదొక్కుకోవటానికి నా సాహిత్యం నాకు ఎలా సహకరించిందో తరువాత భాగంలో చెప్పుకుందాం.
మీ
శ్రీఅరుణం
9885779207
విశాఖపట్నం
నా జీవితంలో నాకేదీ తేలిగ్గానో, అదృష్టంకలిసొచ్చో లభించినవి కాదు. ప్రతీదీకూడా విపరీతమైన శ్రమా, ధారుణమైన సమస్యలను అధిగమించగలిగితేనే దొరొకేవి. ఆ దారిలో అందరిలానే నన్నూ మరికొన్ని సహజమైన అంశాలుకూడా ప్రభావితం చేస్తుండేవి.
ప్రేమపేరిట విఫలమైన బంధం...
చుట్టుముట్టిన ఆర్ధికసమస్యలూ...
పరాజయాలను కత్తులుగా మార్చి నిరంతరం నన్ను ప్రశ్నించి చంపే సమాజం...
ఇవి చాలవన్నట్లు నా నమ్మకాన్ని తమ స్వార్ధానికి వాడుకుని మోసం చేయడానికి సిద్దపడిన కొందరు మహానుభావులూ... ఇలాంటివన్నీ నన్ను నిరంతరం వేధనకు గురిచేశాయి.కానీ వాటిని అనుభవిస్తున్ననేను ఎప్పుడూ సమస్యనుండి బయటకిరావాలన్న వాస్తవాన్నే నమ్ముకునేవాడిని. ప్రతీ సమస్యనీ ఒక శాస్త్రంలా అనుభవించసాగాను. అలా నేను అనుసరించిన ధృక్పధం నన్నొక కవిగా, రచయితగా మార్చింది.
సమస్యలు నాలో రేకెత్తిస్తున్న ఆవేధన, ఆక్రోశం, ఆవేశం....ఇలాంటివాటిపై నేను చేస్తున్న పోరాటంలో కొన్నిక్షణాలలో అలిసిన నా ఆత్మ నాలో ఒక ప్రశ్నను ఉదయింపచేసేది. అది
"నా సమస్యని నేను దాటేసి వెళ్ళిపోవటం నన్ను ఒక మనిషిగా నిలబెట్టవచ్చు. కానీ, ఆ సమస్యని అనుభవించి దానినుండి బయటకు రావటానికి నేను నిర్మించుకున్న సూత్రం అందరికీ అందచేయటం వల్ల నన్ను కాపాడుకున్న ఈ సమాజానికి నేను కొంత రుణంతీర్చుకున్నవాడినవుతానుకదా?