ఈ గుండె గదులలో [కవిత] [స్తీ పురుషుల మద్యన బంధం శ్రుంగారమే ఐతే... ప్రేమ అనే మాట ఎందుకు పుట్టింధి? అటువంటి ప్రేమలోని అనుభూతులతో ఒక అద్భుతమైన ప్రపంచాన్నే నిర్మించుకోవచ్చు.అటువంటప్పుడు ఇక వియోగం అనే వేదన మనల్ని ఎలా చేరుతుంది? అటువంటి ఈ అనుభూతిని ఆశ్వాదించండి. మీ అభిప్రాయంల కొరకు ఎదురుచేస్తూ....] కనురెప్పలు శ్సాసిస్తే కలలు మేల్కొంటాఇ, హ్రుదయపు కొలను నుండి ఙ్ఞాపకాల రంగులనుముంచి తెచ్చుకుంటాఇ. నేను నువ్వుగా..నువ్వు నేనుగాచిత్రితమవుతున్న ఆశలనువిరహమనే కాన్వాసుపై..ముద్రించుకుంటాఇ. అనంతవిశ్వాన్నీ జైంచగల వూహల గమ్యం, నీ దగ్గరకొచ్చేసరికి ఆగిపోతుంది.. నేనంటే ఇంకేంలేదు..అంతా నువ్వేనంటూ. నా గుండెలపై తారాట్లాడిన,నీ చేతివ్రేళ్లు, నా నుదిటిన చుంభించిన నీ బుజ్జి పెదవులు, ఆస్వాదనతో నిండిన మెడపై చెమటను తుడిచిన అమ్మలాంటి చేతులూ, ముద్దుగా నెత్తిపై కొట్టి అమ్మోదేవుడిపేరంటూ.. వెనుకగా హత్తుకొని భుజంపై వాల్చిన తల, .....ఎన్నని చిత్రించనూ ..ఈ గుండె గదులలో , నిజంగా... అరుణానికి సంపూర్ణ వర్ణం ఎవరు గీయగలరు??? శ్రీఅరుణం విశాఖపట్టణం
1 comment:
బాగుంది.ముందుకు సాగండి
మీ బ్లాగు పోస్ట్ మీ బ్లాగులొ ఉంటేనే అందం.
గుంపులో పోస్ట్ చెయ్యటం సరి కాదు.
-పద్మనాభం
Post a Comment