మనస్పూర్తిగా నమ్మిన ప్రేమ వంచన అని తెలిసినప్పుడు.. ఆ మనసు పడే నరకం పంచుకోలేనిది. అలాంటి నమ్మకం నన్ను వంచించిందని తెలిసిన క్షణం నాలో ప్రవహించిన వేదనా జ్వాలలని ఇలా కవితాధార కురిపించుకోవటం ద్వారా శాంతింపచేసుకున్నాను.నా లాంటి బాధ అనుభవించాల్సిన వారు అవేశంతో తెగించక ,ఈ కవిత ద్వారా శాంతన పడండి.
మైల గుండెలు
గుండెలను కప్పివుంచే చున్నీలు
మొఖం దాచుకోవడానికి పనికొస్తున్నాయి.
బొట్టు మొగుడుకీ,సింధూరం ప్రియుడికీ
పంచుతున్న దొరసానులకే
పసుపంతా వ్యర్ధమై పోతుంది.
సపరేటుగది వున్న ప్రతీ మగాడూ మొగుడే ,
పందుల్ని పక్కకు నెట్టేసి..
ఆ బురదనూ కబ్జాచేసి..దొర్లుతున్నాయి
వావీ వరసల్ని అమ్మేస్తున్న రూపాలు.
బంధాలెప్పుడో కుష్టువ్యాధిగ్రస్తమై పోయాయి.
దాపరికానికి పేరు ప్రియుడయితే..
దొరికిపోతే పేరు తమ్ముడుగా మారిపోతుంది.
వికారానికే వాంతి వచ్చే
శారీరక రుగ్మతలు మనసులను నలిపేస్తున్నాయి.
అదిగో చూడు..మృగాలు వూగుతున్నాయి మానవ రూపంలో,
రెండు అబద్దాలని కలిపి.. ప్రేమ అని నామకరణం చేసేస్తున్నాయి
ఆ మొసం ఆకారం దాల్చి, పరువుల్ని పక్కలకు అమ్మేస్తుంటే..
హృదయాలు సిగ్గుపడి ప్రాచీనతను కప్పుకుంటున్నాయి.
సెల్ ఫోన్ సంభాషణలే శీలాన్ని నిర్ణయిస్తే,
ఒక్క కంప్యూటర్ చాలు..వేశ్య సంసారి కావటానికి.
అవసరం శృతిమించితే ..
మనం పెట్టించిన కన్నీరు..మన ప్రేగులనే చింద్రం చేస్తుంది.
పక్క దులిపితే చెదిరిపోయే దుమ్ములా..
మొహం నీకు మొఖం చాటేస్తుంది.
మొత్తం మీద ..
అందరి భుజాలూ నిన్ను రాసుకొని తిరుగుతుంటాయి,
గుండెలని మాత్రం నీకంటించకుండా!
శ్రీఅరుణం ,
విశాఖపట్నం.
తెలుగు తూలిక: మూణ్ణాళ్ళ ముచ్చట
11 years ago
2 comments:
"దొరికిపోతే పేరు తమ్ముడుగా మారిపోతుంది."
"సెల్ ఫోన్ సంభాషణలే శీలాన్ని నిర్ణయిస్తే,
ఒక్క కంప్యూటర్ చాలు..వేశ్య సంసారి కావటానికి."
Good lines.
హృదయం, మృగాలు - మీరు లేఖిని గనక వాడుతున్నట్లయితే hRdayaM, mRgAlu అని రాయాలి.
chala bavunnay mee kavithalu....good....
Post a Comment