Tuesday, January 24, 2012

కవన ప్రసవం


కవిత్వానికికాలమే వారధి
ఆ కాలగమనంతో పొత్తుపెట్టుకొంటే..
గడిచే ప్రతీ క్షణమూ ఒక్కొక్క అక్షరమవుతుంది,
కనుపాప దారులలో సాగిపోయే జీవితాలు
అనుభవాల క్షేత్రంలో పుటలై 
కావ్యాలుగా మొలుస్తుంటాయి,
కన్నులు స్రవించే కన్నిటిలో 
ఆర్ధతా ప్రేమా మిళితమై పెల్లుబికితే..
వాటినుండి చిప్పిల్లిన అవశేషాలు
ఈ యుగాన్నే తట్టుకొగల కధనాన్ని మన ముందుంచుతాయి.


శ్రీఅరుణం,
విశాఖ.
9885779207

Tuesday, January 17, 2012

స్వాతంత్రపోరాటం


అవినీతిని నిర్మూలిద్దాం అంటూ
`అన్నా` తిండి మానేసి  కూర్చుంటే..,
నీతినెప్పుడో అమ్మేసుకున్న వాళ్ళు
నీళ్ళునమలడం  కూడా మర్చిపోయారు.


దొంగ దొంగ గొడవపడితే..
దాపరికం బయటపడినట్లు,
మన రాజకీయం అంతా చేరి
మనకి దాగుడుమూతల్ని మిగులుస్తారు.


ప్రాణం మనకోసం ఒడ్డిన జవానుల 
శవపేటికలపైనే తమ ఖాతాల్ని నింపుకున్న వీరికి 
అంత త్వరగా  నీతి ఎలా మింగుడుపడుద్ది?


లోక్ పాల్ నయినా లేకి పాలనగా మార్చి
కుటుంబాల లెక్కలకు రాజ్యంగాన్ని అడ్డుగా పెట్టుకొని
విరగబడుతుంటే...


డెబ్బై ఏళ్ళ `హజరే`కి 
యాభై ఏళ్ళు తగ్గిద్దాం,
ప్రతీ ఒక యువతా ..హజారేగా మారి
మరో స్వాతంత్రపోరాటం సాగిద్దాం.


శ్రీఅరుణం,
విశాఖపట్నం. 
      


                     

Saturday, January 7, 2012

సంప్రోక్షణ

నీటిని కనుగొన్న దారులలోంచే..
నిప్పునీ మలచడం ప్రారంబించి..
మనిషి..ఆ అగ్నికీలల కొసలతో
తన చుట్టూ ఆశల సరోవరాన్ని నిర్మించుకున్నాడు,


ఆత్మని రక్షిస్తున్న హద్దుల అంచులలో
కందకాల్ని తవ్వేసుకొని
దానిలో జీవితాన్ని ముడుచుకుందామని
కన్నీళ్ళకి కలలని అరువిచ్చాడు,


మరుభూమిలో నాటిన ఆ విత్తనాల నుండే..
మల్లెపూలతోటల్ని పండించుకొంటూ
అరుణపు గొడుగునే అందంగా కప్పుకొంటూ
ఆశల్ని నూర్పిస్తున్న ఆ నిశితోటలో
రాత్రిని శాశ్వతంగా ఊహించుకుంటున్నాడు,


అతనికి తెలియటంలేదు..
మాటలతో చేస్తున్న వ్యాపారానికి
మూలధనం మస్తిష్కమేనని,
తన గుండె దోసిళ్ళలోకి వాటితో నమ్మకాన్ని నింపుకున్న క్షణాలు
ఎప్పటికైనా...
హృదయమనే సమాధానం దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోతాయని?


శ్రీ అరుణం
విశాఖపట్నం
.




 

 

atididevobhava

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.