జీవితాన్ని గెలుచుకోవటానికి వ్యక్తిత్వవికాసం లక్ష్యంగా నిలుపుకొనే మార్గం అవసరం. దాని కోసం ఎందరి జీవితాలనో అన్వేషించి నేను రాస్తున్న పుస్తకానికి పెట్టిన పేరు " FACTS OF INNER SELF". ఉగాదికి నేను విడుదల చేయబోయే దీని పేరు ఎలావుందో.. ఈ ప్రారంభం చదివి తెల్పండి.
"కలలు మనసును నిలుపుతాయి..
మనసు కవిత్వాన్ని నింపుతుంది..
కవిత్వం జీవితాన్ని నిలబెడుతుంది..
జీవితం మనిషిని నిలబెడుతుంది..
మనిషి ప్రపంచాన్ని నిలబెడతాడు..
ప్రపంచం వాస్తవాన్ని నిలుపుతుంది..
వాస్తవం ఆశల్ని బ్రతికిస్తుంది..
ఆ ఆశలే మనకు రేపటిని ముందుంచుతాయి. ఇదే నా ఈ పుస్తకం రాస్తూ నాకు నేను తెలుసుకున్న నిజం.
జీవితంలో ప్రతీక్షణం ఓడిపోతూ..మూడు నాలుగుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించబోయీ.. విరమించుకున్న ఒక మనిషి, ఆ విషాదపు కోరలలో తనకు కరవైన `తోడు`ని మిగిలిన వారికీ ఇవ్వటం ద్వారా నేడు అనేకమందిలో పేరుకుపోయిన అంతర్మధనాన్ని తొలగించడానికి చేస్తున్న ప్రయత్నమిది.
ఈ పుస్తకాన్ని రాయటం ప్రారంభించినప్పుడు మనసులో వున్నది పై భావనొక్కటే. కానీ దీనికొరకు తవ్వుతున్న గతం, ఇతరుల జీవితాలూ, భావావేశాలూ, తర్కం.. ఇవన్నీ నాలో నన్నే విమర్శించాయి. ముందు నన్ను నేను మార్చుకోవలసింది చాలావుందని దీన్ని రాస్తున్నప్పుడు నాకు అర్ధమైంది. ఒకరకంగా అది నాకు మొదటి గెలుపు. అలా కొనసాగించిన ఈ రచన పూర్తి అయ్యేనాటికి.. నాకు ఓటమి నుండి తప్పించుకోవాలన్న అభధ్రతాభావం కంటే, విజయాన్ని అందుకోవాలన్న వాంచకంటే, విజయంపైనే గెలిచితీరటం జీవితపు సహజగుణం అని తెలిసిపోయింది".
మీ
శ్రీఅరుణం

No comments:
Post a Comment