విశాఖ సముద్ర తీరానికి లేత యవ్వనం లాంటి ప్రకృతి ప్రసాదం యారాడ ప్రాంతం. అమాయకంగా కవ్వించే... ఆ ఏకాంతం, ఆహ్లాదం ఇక్కడే పుట్టిందా అనిపించే...కొండలు, హృదయాలను మమేకం చేసే...పచ్చదనం .....వెరసి , అదొక ఆనంద విహారం. ఒకప్పుడు ఆ యారాడలో అనుభవించిన ప్రేమానుభూతులు ఈ కవితలో నింపాను. చిత్తగించండి ఈ కవన సేద్యం కవితని.
పచ్చని పొలాల పాపిడిలో
మన ఇద్దరి అడుగుల సంగమంఉసిరికాయల చెట్టు దోసిళ్లలోన
పురివిప్పిన పసితనపు
అస్తిత్వంఊటబావి నీటిపైన
నిటారున పడ్డ అరుణకిరణం
తొంగిచూస్తున్న మన ఆశలను
చటేల్మని కమ్మేస్తే...
ఆ హృదయపు చేలో
మన కలల విత్తనాలు
ప్రసవించిన మొగ్గలు నా కవితలు,
నీ ఙ్ఞాపకాలతో నాట్లు వేస్తుంటే..
పిల్లకాలువలా సిరా ధారధరిత్రిని నూర్పిస్తూ..ఉద్దీపించిన పంటకుప్ప అక్షరాల సేద్యం
కల్పనలకు అంట్లు కడుతుంటే
అవి కవితా పుష్పాలవుతున్నాయి,
కల్పనలనే నిజం చేసిన నీ ప్రణయపు మేరువులు
ఎన్ని అక్షర మొక్కలను నా కవన క్షేత్రంలో పండించాయే?
జిహ్వగా మారిన కావ్యమాతేకాళిదాసు అవతారమైతే...
నా జీవాన్నే పరీవృతం చేసిన నీ అనుభూతులు
నా కవనసేద్యానికి సర్వేంద్రియాలు.
శ్రీఅరుణం.
No comments:
Post a Comment