1947ఆగస్ట్15.
ఈ రోజుకు ఏ
భారతీయుడికీ ఉపోధ్ఘాతం చెప్పనవసరం లేదు.ఎన్నో సంవత్సరాల పోరాటఫలితంగా మన
స్వాతంత్ర్యం సాకారమైన రోజది. ఆ రోజున అందరి గుండెలలోనూ భారతమాత నిండిపోయింది. ఆమెతోపాటూ
వారిని అపాదమస్తకమూ కదిలించేలా చేసిన ప్రశ్న ఒకటుంది అది"మహాత్ముడెక్కడా?"అని.....
నిజం ఎప్పుడూ
నిలకడగానే వుంటుంది.సర్దుబాట్లూ,సందర్భాలూ,అవకాశాలు,అవసరాలు దానినెప్పుడూ ప్రభావితం చెయ్యలేవు. అలా చేసేవయితే అది నిజమే కాదు.
నిజం అని మనం నమ్మించుకున్న ఒక నీడ.
మహాత్ముడూ
అంతే. ప్రజలకోసం ఆయన చేసిన త్యాగం ఈ రోజున రెండుగా చీలిపోయిన దేశంగా తనముందుంది. ఆ
చీలిక అంచులలో కూర్చుని ఆయన తన శాంతి ధీక్షను పాటిస్తున్నారు. రెండుగా చీలిన తన
ప్రజలను చూస్తూ కన్నీరు కారుస్తున్న ఆ హృదయానికి స్వాతంత్ర్యం ఎలా ఆనందాన్ని
మిగులుస్తుంది పాపం.
అతి విలువైన
జీవితాన్నే అర్పించుకున్న ఆ శాంతిదూతకు ఈ దేశం అందించిన బహుమతి అదే.
ఆ విచారం
ఆయనలో నిరంతరాయమైన ఆలోచనల్ని రగిలించింది. ఎందుకు తానీ పోరాటం చేశాడు? ప్రజలకోసమేగా.
మరి వీరిమద్యలోనే ఇన్ని ఆవేశాలుంటే..., ప్రారంభంలోనే ఇంతగా
సెగలుకక్కుతుంటే... రేపు వీరికి ఏ భవిష్యత్ అందుతుంది?
ఒకప్పుడనుకునేవాడు"ఎందరో
గొప్ప చక్రవర్తులేలిన ఈ భూమిపై ప్రజలందరిమద్యనా ఏకత్వం ఎందుకు సాధించలేకపోయారని. ఆ
ప్రయత్నాలు చేసిన వారూ వున్నారు. అందులో అశోకుడూ, అక్బర్ వంటివారు మరింతగా
తపించారు. కానీ ఫలితం ఎందుకు రాలేదు?అంటే...వారిద్దరూ...
అధికారం కోసం, దానిని సద్వినియోగం చేసుకోవటం కోసం సమగ్రతని
కోరుకొని వుండవచ్చు. కానీ తాను ఏం కోరుకుని ఈ ప్రజలకోసం పోరాటం చేశాడు? చివరికి స్వాతంత్రదేశంగా మారినతరువాత కూడ తనకి ఈ దేశంపై విడిపోయిందన్న
బాదే తప్ప మరో ఆనందం మిగిలిందా? తన పోరాటానికి గౌరవంగా
మహాత్ముడన్న బిరుదునిచ్చి పక్కకు తోసేశారు. వారు మాత్రం
మతం ఆధారంగానో,
కులాల
ఆధారంగానో,
ప్రాంతాల
ఆధారంగానో ఎవరికివారు వేరవటానికి సిద్ధమైపోతున్నారు. పైగా వాటికి మానవహక్కులూ,భిన్నత్వాలను
గౌరవించటం అని రకరకాలుగా పేర్లు పెడుతూ ఊగిపోతున్నారు. దేశం కోసం ఎంతో త్యాగం
చేసిన మహాత్ముడు తన కోసం ఏ పదవీ అడగలేదని అంటున్నారేకానీ... మనుషులందరూ ఒకటే అంటూ
నిరంతరం తన మనసు ఘోషిస్తున్న "రఘుపతిరాఘవరాజారాం..." ఆన్న అంతరంగాన్ని
కేవలం రికార్డులకెక్కించి, తాము మాత్రం తన్నుకుంటున్నారు.
నిజంగా అది వీరికి వినపడకా? లేక వినపడినా వారి మానసిక స్థితి
అదేనా? అదే అయితే తాను చేసిన ఈ పోరాటమంతా నిష్ఫలమేగా. అవును
తాను కేవలం ఒక జాతికోసమో, ఒక మతం కోసమో,ఒక ప్రాంతం కోసమో పోరాడలేదు. అహింసా,సత్యాగ్రహం వంటి
పవిత్రమైన విధానాలను కేవలం ఒక దేశ స్వాతంత్ర్యం కోసం ఉపయోగించాలనుకోలేదు,అలా అనుకోవటమే వాటి విలువను తెలుసుకోకపోవటం.
తన పోరాటం
మనిషి స్వాతంత్ర్యం కోసం.
అందుకే
పరాయివాడినైనా అహింసయుతంగానే గౌరవించాలన్నాడు. ఆ అహింసలో ప్రేమ వుంది. సాటిమనిషినీ
తనలాంటి మనిషిగా గుర్తించగలిగే వ్యవస్థకు అదే మార్గం. మనిషిని
ప్రేమించగలిగినప్పుడు ప్రపంచంలో మనకు భిన్నత్వం ఎలా కనిపిస్తుంది? అదే
తాను దక్షిణాఫ్రికాలోనూ అనుసరించాడు, ఇక్కడా
అనుసరించాడు. ఇన్ని సంవత్సరాల నా
పోరాటాన్ని నమ్మి ప్రజలంతా తనని అనుసరిస్తుంటే...అహింస అనే మార్గం ద్వారా
విశ్వశాంతికై సిద్ధమౌతున్న చుక్కానీలనుకున్నాడు.కానీ...
ఇప్పుడిక్కడ
జరుగుతున్నదేంటి? తను ప్రతీ క్షణం నడయాడిన ఈ గడ్డ రెండు దేశాలుగా
చీలిపోతుంది.స్వాతంత్ర్యం కోసం ప్రతీ క్షణం వెచ్చించిన రక్తాన్నీ శాoతిధామం చేసి,
కలిసిసాధించుకున్న గుండె... మతంకోసం విడిపోతానంటుంది.
అసలు ఈ మార్పు
ఎలా వచ్చింది?
మనిషికోసం
నేను చేసిన ఈ సుధీర్ఘమైన పోరాటంలో ఎవరి సొంత ప్రయోజనాలు ఈ చీలికని తెచ్చాయి?
ఎవరి స్వార్ధం
దీని ఆజ్యం పోసింది?
ఎవరిని
ఆక్రోశం ఈ పరిస్థితికి దారులు వేసింది?
వీటికి
సమాధానం ఎక్కడ దొరుకుతుంది???
అసలు
తప్పెవరిది?
నాయకులమైన
తమదా?
ప్రజలదా?...
నిజానికి ఈ
దేశప్రజలు గొప్ప సహనవంతులు. దానిని పిరికితనమనీ, అతిగా పాటించే
శాంతిమంత్రానికి వారసులనీ కొద్దిమంది అన్నంతమాత్రాన్న అది ఎప్పటికీ నిజం కాలేదు. తమ మొదటి
నాగరికతనుండి, ప్రతీసారీ వారిమీద ఏదో ఒక నూతన వ్యవస్థ, విధానమో, మతమో, అదికారమో
వారిపై స్వారీ చేయటం నేర్చుకున్నాయి.అయినా వాటికి తగినట్లుగా తమ నడకను
మార్చుకున్నారే కానీ , ఎన్నడూ దేశాన్ని వదిలించుకోవాలని వారు
అనుకోలేదు. అలా అనుకొనివుంటే...ఈ పాటికే దేశం ఖాళీ అయిపోయివుండేదేమో.
తమ
మొదటినాగరికత అయిన సింధూలోనే అత్యున్నతమైన పట్టణ నాగరికతకు ఆలవాలమైన దేశం, ఆర్య
సంస్కృతి వచ్చేసరికి మళ్ళి ఎలా వెనక్కెళ్ళిపోయారు!!!
తరువాత వారంseptember 10 చూద్దాం...
శ్రీఅరుణం
No comments:
Post a Comment