స్వాతంత్ర్యవేడుకలు ముగిశాయి.
ప్రజలు తమ బ్రతుకుతెరువు కోసం
ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పుడు వారందరికీ ప్రాతినిద్యం వహిస్తున్న దేశం ముందు
అతి పెద్దబాద్యత నిలబడివుంది. దేశ పరిపాలనకీ,వ్యవస్థని పునర్నిర్మించుకోవటానికీ
కావలసిన ఒక స్పష్టమైన విధానాన్ని తయారుచేసుకోవాల్సిన కార్యక్రమం అది.
అది భారతరాజ్యాంగ నిర్మాణం.
ఆ దిశగా భారత రాజ్యాంగాన్ని తయారుచేసే
ముసాయిదా నిర్మాణానికి డాక్టర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో కమిటీ ఏర్పడింది.
అప్పుడే యం.ఎ.పస్ట్ క్లాస్ రిజల్ట్స్ తో
ఇంటికొచ్చిన నాకు "రాజ్యాంగం అంటే ఏమిటన్నయ్యా?"అని
అడుగుతూ నిలబడిన పక్కింటి తమ్ముడి ప్రశ్న చాలా బరువుగా తగిలింది. 385 ఆర్టికల్సూ కంఠత పట్టిన నాకు ఆ ప్రశ్నకి జవాబు చెప్పడానికి
కొంత సమయం పట్టడానికి కారణం రెండు అంశాలు. ఒకటి రాజ్యాంగం గురించి వాడి స్థాయికి
తగినట్లుగా చెప్పాలన్న ఆకాంక్ష. రెండు నేను చదివిన ఆ రాజ్యాంగానికీ...ప్రస్తుతం
దేశం రాజ్యాంగాన్ని వుపయోగిస్తున్న తీరుకీ మద్యనున్న తేడా. సుధీర్ఘ, ధృఢ,
అధృఢ, లిఖితపూర్వక
వంటి అనేక లక్షణాల సమ్మిళితమైన దేశపు అత్యున్నత రూపాన్ని గురించి చిన్నమాటలో
చెప్పి ఒక భావితరపు వారసుడిని పంపించాలని నాకనిపించలేదు. అలాగని వాడి స్థాయికి
సరిపడేలా చెప్పటం కూడా నాకూ నాకు అంత తొరగా సాధ్యపడలేదు. ఇలా ఎందుకంటే ?భారత రాజ్యాంగం నాకిష్టమైన పుస్తకాలలో అత్యంత
ప్రాణప్రదమైనది.రవిగాంచని చోటునూ కవి గాంచగలడన్నట్లు...తమ అపూర్వమైన వీక్షణశక్తితో
విచక్షణమైన ఒక విధానాన్ని దేశానికి అందించడానికై "అన్నింటినీ"ఒక
గ్రంధంగా కూర్చడమంత అద్భుతం వేరొకటి వుంటుందా?.అదే
మన రాజ్యాంగం.
ఈ దేశం ఎలా ఏర్పడింది...?
ఎలా రూపుదిద్దుకుంది...?
గతమేంటి?
వర్తమానం ఎలా సాగాల్సివుంది?
భవిష్యత్తుకు ఏం అందించాలి?
వంటి అనేక విస్తారమైన విఙ్ఞానానికి ఒకే
రూపం కలిగిస్తే అది మన రాజ్యాంగం.
రాజులు పోయారు. రాజ్యాలకు అవశేషాలుగా
మిగిలిన సంస్థానాలూ కలిపేశాం. దేశంలో రాష్ట్రాలూ, ప్రాంతాలూ, కేంద్రపాలితాలూ అంటూ రకరకాల మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
భౌగోళికంగా
వ్యవస్థాపరంగా
పాలనాపరంగా
ప్రాంతాలపరంగా
మతాలు కులాలపరంగా
జాతులపరంగా
ఇలా రకరకాల విషయాలపరంగా, విభిన్నతలకు పుట్టినిల్లు అనబడేలా ఉన్న దేశం మొత్తం
"ఒకేచోట" తమనితాము నమ్ముకోగలిగేలా ఒక పుస్తకం రాయగలగాలంటే ఎంత
అసాధ్యం...
లక్షలమందిని తన కరవాలానికి బలిచేసి, సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలిగిన అశోకసామ్రాట్ సాధించలేని
సమగ్రతని...ఒక పుస్తకం ద్వారా సాధించాలి.
అఖండ భారతంలో మతలకు ఆలవాలమైన
ప్రజలందరినుండీ జాతీయసార్వభౌముడనిపించుకోగలిగిన అక్బర్ చక్రవర్తికి సమాధానం దొరకని
లౌకికత్వాన్ని...ఒక పుస్తకం సాధించాలి.
స్వచ్చమైన హృదయంతో కోట్లమందితో
పూజలందుకున్న బాపూజీనే కలవరపరచిన ప్రజల మద్యనున్న మానసిక లోతులకు పరిష్కారం...ఒక
పుస్తకం కనిపెట్టాలి.
ప్రాచీన,మద్య,ఆధునిక యుగాలలో ఒక భ్రమలా మిగిలిపోయిన భావాలన్నిటికీ అందమైన
ఒకే భవనాన్ని ఒక పుస్తకం సాధించగలుగుతుందా?...అదే మొదట్లో నా అనుమానం. చరిత్ర విధ్యార్ధిగా
భారత రాజ్యాంగానికి ముందున్న పరిస్థితులన్నీ చదివితెలుసుకున్న నాకు రాజ్యాంగపు
రచనకు ముందున్న అవశ్యకాలేమిటో???తెలియటం వల్ల ఇదంతా మదిలో మెదులుతూ
వుండేది.
అలాంటి అనేక సందేహాలకు సమాధానం గా మన
రాజ్యాంగాన్ని చదువుతూవుంటే...దానిలోని
అత్యున్నతమైన మేధస్సు,
భవిష్యత్ వీక్షణ,
నిస్వార్ధపు ఆలోచనాశైలీ,
దేశ భక్తీ,
సమానత్వపు ధోరణీ ఇవన్నీ నాలోవున్న
అనుమానాలను పటాపంచలుచేస్తూ...ఒక సంపూర్ణమైన భారతీయుడిగా నేను మారటానికి దోహదం
చేశాయి. ఆ పుస్తకాన్ని చదవటం పూర్తిచేసిన క్షణం దానికి ఒక మనిషిగా సాష్టాంగ
ప్రమాణం చేశాను భక్తితో.
కానీ,ఇప్పుడు
సమకాలీన ప్రపంచపుదారులలో నడక సాగుతున్న నాకు...
నాదేశం అనుసరిస్తున్నదారి, ఆ రాజ్యాంగం చూపించిన దారికి ఎంతదూరంగా వుందో కొలవటానికే అంతు
చిక్కని పరిస్థితి?...అసలు రాజ్యాంగం మనతో వుందా?అన్న ప్రశ్న...
ఒక ఆవేశం కానీ, సమస్యకానీ దేశం నుండి మొదలై...
రాష్ట్రం
ప్రాంతం
జిల్లా
నగరం
తాలూకా
గ్రామాం
వీధి
సందూ
చివరకు మనిషి స్థాయికి
చేరిపోతున్నాయి. మనిషి మనిషినీ దూరం చేస్తున్నాయి. కొన్ని వేల సంవత్సరాలక్రితమే
ధర్మానికి వేధికగా నిలిచిన మహాభారత యుద్దాన్ని పురాణంగా గౌరవించుకుంటున్న ఈ భూమిపై
నేటికీ అశాంతి తప్ప మరోటి మిగలని ఉద్యమాలు రగులుతూనేవున్నాయి. వీటికి ముగింపులేదా? రాజుల మార్పు,
సామ్రాట్టుల చర్యలు, మహత్ముని శోకం, అత్యూన్నతమైన రాజ్యాంగం ఈ ప్రజల్లో శాశ్వతమైన
మార్పుని ఎందుకు సాధించలేకపోతున్నాయి?
మార్పురాదా... వీరిలో?
లేక, తొలి
నాగరికతలోవున్న జఢత్వమే వీరికి శాశ్వత శాపమా?
మారాలన్న కోరిక వీరిలో వస్తుందా?
మరి "భారత ప్రజలమైన మేము మాకోసం
మేము తయారుచేసుకొని ఆమోదించుకుంటున్నామని" చెప్పిన మాటలు అబద్దాలుగా
మిగిలిపోతున్నాయా?
ఇదంతా ప్రజల బాధ్యతేనా?
లేక, రాజ్యాంగం
విఫలమైందా?
అదీకాక ప్రజల నుండి తయారైన మరో
శక్తి...ఇలా వ్యవస్థ తయారవటానికి కంకణం కట్టుకుందా?
ఆ శక్తి గురించి వచ్చే వారం 22 సెప్టెంబర్ న చుద్దాం.
శ్రీఅరుణం.
మీ అభిప్రాయాలను పంపండి.
sssvas123in@rediffmail.com
no : 9885779207
facebook - sriarunam rao
నా కవితల కోసం sarithasrinivasam.blogspot.com చూడండి.
No comments:
Post a Comment