జీవితంలో అన్ని దొరకవు కానీ, దొరికించుకునే మార్గాలుమాత్రం మనకెప్పుడూ అందుబాటులోనే వుంటాయి. ఇదే నకు అనుభవపూవకంగా తెలిసిన సత్యం. చాలా విషయాలలో నేనూ ఓడిపోయాను. వాటిల్లో నా శ్రమ,నమ్మకం కంటే నాపై మరొకరు చూపించిన ఆధిపత్యమే నిండిపోయింది. కానీ నాకున్న స్వేఛ్చని సంపూర్ణంగా వినియోగించగలిగిన సాధన ఒక్క రచనావ్యాసంగమే. అందులోనూ నేను ఇంటర్ నెట్ ద్వారా మరింత ప్రయోజనం పొందలిగాను. దీని ద్వారానే నా కవితలు చాలామందికి దగ్గరయ్యాయి. నా అభిప్రాయాలు చాలామందితో పంచుకోగలిగాను. వాటన్నిటినీ క్రోడీకరించుకుంటూ నేను రాసిన అంతర్ భ్రమణం పుస్తకం విక్టరీ వారిద్వారా, తరువాత కినిగి.కాం ద్వారా పబ్లిష్ అయ్యి మంచి పేరు తెచ్చాయి. అందుకు నా మిత్రులందరికీ నేను కృతఙ్ఞతలు.
ఇప్పుడు నియంత్రణరేఖ అనే మల్టీ స్టారర్ సినిమా స్టోరీ రాసే పనిలో వున్నానంటూ నేను బ్లాగ్ లో పెట్టగాఏ సుమారు 1000మందివరకూ దానిని ప్రోత్సహిస్తూ నన్ను కదిలించారు. అందుకే వారికోసం అందులోని మొదటి సీన్ ను ఇక్కడ పెడుతున్నాను. మీ ఆశీర్వచనాలతో అతిత్వరలో దీన్ని పూర్తీచేసే పనిలో వున్నాను. చదివి ఎలా వుందో తెలుపుతూ, నన్ను మరింత ఉత్సాహంగా ముందుకునడిపే మీ అభిప్రాయాలను పంపుతారని ఆశిస్తూ...నా 100వ పోస్ట్ ను మీముందుంచుతున్నాను.
మీ... శ్రీఅరుణం
సీన్ 1
"ట్రింగ్...ట్రింగ్...ట్రింగ్"
రాత్రి ఒంటిగంట సమయం. రెండు ఫొన్లు కలుసుకున్నాయి.
"సులేమాన్! ఎలాగైనా మీరిప్పుడున్న టౌన్ లో విధ్వంసం సృష్టించగలగాలి, లేకుంటే మనం ఉత్త చేతుల్తో మిగిలిచావాల్సొస్తుంది"ఒక వృద్ధకంఠం అదే ఆదేశంగా చెప్తుంది.
"అదికాదు సాబ్! ప్రస్తుతం మన పొజీషన్ ఏంటి?"
"నిజం చెప్పాలంటే మనకిప్పుడు పొజీషనేలేదు"
"సాబ్! మీరు మరీ ఎక్కువ టెన్షన్లో వున్నట్లున్నారు..."
"లేదు. బాగా ఆలోచించిన తరువాతనే ఇలామాట్లాడవలసి వస్తుంది. మనకున్న పరిస్థితి దృష్ట్యా... మనం పొజీషన్ గురించి ఆలోచించే స్థాయిలోకాదుకదా, కనీసం ఊహించేస్థితిలోకూడా లేము. ఇది నాలో వున్న టెన్షన్ తో కాదు, అనుభవంతో చెబుతున్న వాస్తవం. దానికోసమే మనం వీలైనంతత్వరగా ఏదైనా ఆపరేషన్ చేయాలి"
"కానీ ఆపరేషన్ చేసేంత ఎక్వీప్ మెంట్స్ మనదగ్గర ప్రస్తుతానికి అందుబాటులో లేవుకదా సాబ్?"
"అందుబాటులోకి తెచ్చుకోవటానికేగా ఈ ప్రయత్నం"
"ఏం చేద్దామంటారు?""మన దగ్గర ఇప్పుడున్న ఆయుధాల మీద నీకు ఐడియావుందా?"
"ఆ! చాల తక్కువ. ఇంతక్ముందు స్టాక్ పెట్టిన అర్.డి.యక్స్., డిటోనేటర్స్ మొన్నటి దాడిలో వాళ్ళచేతుల్లోకి వెళ్ళిపొయాయి. మనవాళ్ళు తప్పించుకోగలిగారుకానీ, కొన్ని హ్యాండ్ సెట్స్ తప్పించి ఎవరికీ సరిపడినంత వెపన్స్ మిగుల్చుకోలేకపోయారు. దట్స్ వై, నౌ ఉయ్ ఆర్ ఇన్ క్రిటికల్ పొజీషన్ సాబ్"
"చూశావా పరిస్థితి నువ్వే చెప్పేశావ్"
"నిజమే కానీ కమాండోల స్థాయిలో వున్న మేమే పరిస్థితి తీవ్రతని బయంకరంగా చూపితే అందరూ డిస్టర్బవుతారనీ..."
"ఆ. ఆ. అందుకేకదా నా అనుభవంతో ఆలోచించి ఇంతరాత్రప్పుడు ఫోన్ చేసింది. సరే. కావలసినంత మనదగ్గరలేనప్పుడు వున్నదానితోనేఆలోచించగలగటం వివేకవంతుని లక్షణం. మనదగ్గర వున్నది అయిపోయేలోపు బయటనుంచి అందుకోగలగాలి. పైనుండి మెసేజ్ వచ్చింది. వారిదగ్గర మనకు కావలసిన వెపన్స్, ఇతర అవసరాలూ సిద్ధంగా వున్నాయట. కాకపోతే లోపలున్న సెక్యూరిటీ ఎక్కువవటంవల్ల ఇబ్బందిగా మారిందట. అందుకొరకు ఇక్కడున్న సెక్యూరిటీ చూపుల్ని మరల్చేలా మనల్నే ఏదైనా??? సృష్టించమంటున్నారు..."
"అదేంటిసాబ్. ఇంత సెక్యూరిటీ పరిధిని చూపు మరల్చాలంటే మనం చేసేదానికీ పరిధి ఎక్కువే వుండాలికదా. అంత అవకాశం మన చేతిలోలేకేకదా ఈ బాధంతా. మళ్ళీ అదే విషయాన్ని ప్రస్తావిస్తే...ఎ..లా..."
" భాయ్. సాధ్యమైనవి అందరం చేస్తాం. అసాధ్యమైనవి కొందరే చేస్తారు. అలాంటివాటికోసం దారి ఎక్కడుందో వెతకటమే మనలాంటివారికిచ్చిన పని. మనకి వాస్తవం మాత్రమే తెలుసు. అదిప్పుడు పనిచేయదనీ తెలుసు. అందుకే ఇప్పుడు అద్భుతాలు చేసేవాడు కావాలి. అలంటివ్యక్తి నీ వింగ్ లో వున్నాడుకనుక నీకు ఫోన్ వచ్చింది."
"ఆ సాబ్ అర్ధం అయింది. మీరు చెబుతున్నది మన పవన్ గురించేగా"
"యస్.మన ప్రస్తుత పరిస్థితుల్లో...అలాంటి వ్యక్తే సరైన అస్త్రాలను అందించగలడు. తనకి చెప్పు. మన ఆపరేషన్ కి మెటీరియల్ తక్కువగ వుండాలి. కానీ, మానవవనరులకి ఎక్కువ ప్రాధాన్యత కల్గించాలి.నీకు అర్ధమైందనుకుంటాను. దానికి సరిపోయేలా ఒక ప్లాన్ సిద్ధంచేసి మరో అరగంటలో నాకు చెప్పమనాలి. క్విక్"
సరిగ్గా మరో పన్నెండు నిముషాలతరువాత...
మళ్ళీ ఆ రెండు ఫోన్లూ కల్సుకున్నాయ్. అటువైపు పాత స్వరమే. ఇటువైపుమాత్రం పవన్ అనబడే వారి ఆపరేషన్స్ ఛీఫ్ స్వరం.
"చెప్పు పవన్ భయ్యా"
"మన దగ్గరున వెపన్స్ అన్నిటినీ యూజ్ చేసుకున్నా మనం కావాలన్నంతస్థాయిలో విధ్వంసం సృష్టించలేం. అందువల్ల ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతున్న పీక్ సిట్యువేషన్ ని వాడుకుంటూ.., అందులో కలిసిపోతూ మన విధ్వంసాన్ని ఎక్కువ చెయ్యవచ్చు. దాని నుండి మనకు కావలసినంత గ్యాప్ వే ని సాధించుకోవచ్చు. అదే నాప్లాన్ కి సూత్రం" చెబుతున్నది వొణికించే విషయమే అయినా, ఆ స్వరం మాత్రం చాలా కూల్ గా వుంది...
"డీటేల్స్...?"
"ప్రస్తుతం మజీ సి.యం.ని అరెస్ట్ చేయబోతున్నారని వార్తలొస్తున్నాయి. అదీ మరోకొద్దిగంటల్లోనే జరగబోతున్నట్లు తెలుస్తుంది. దానిపై ఆ సి.యం. పార్టీ వాళ్ళు భారీ ఎత్తున హింసకిపాల్పడాలని ప్రణాళికసిద్ధం చేస్తున్నారట. బహుశా..ఇదంతా జరగటానికి మరో పదిగంటలసమయంపట్టవచ్చు. ఆ టైం కల్లా మనవాళ్ళని పెట్రోల్ బాటిల్స్ తో రడీగావుంచగల్గితే...చాలు. ఆ ఘర్షణల్లో మనవాళ్ళనీ కలిసిపోమనండి. కాకపోతే మనవాళ్ళు ఆ గొడవల్ని మనకు అనుకూలమైన వాతావరణం వైపుకి మళ్ళించేలా ప్రయత్నించగలగాలి. ఆ ప్రయత్నమొక్కటే తీవ్రంగావుంటే చాలు. మనం అదే సమయంలోమన ట్రాన్స్ పోర్ట్ ని "హడావుడీ" పేరుతో తరలించేవాటి ముసుగులో సులభంగా రప్పించుకోవచ్చు."
"వెల్ డన్ పవన్ భయ్యా. ప్రతిసారీ నువ్వు చెప్పే ప్లాన్లతో మాకు భలే బలం సమకూరుతుంది. అందుకే నిన్ను అపరేహన్స్ కి ఛీఫ్ ని చేశారేమో..."కానీ ఆయన మెచ్చుకోలుని ఏమాత్రం యాక్సెప్ట్ చేయని సమాధానం అటువైపునుండి మొదలైంది "బట్! ఒక్కవిషయం"అంటూ
"ఏమిటది?"
విధ్వంసం అనేది ఇష్టానుసారం జరగవచ్చు కానీ, ఇష్టమునంతసేపు మాత్రం జరగదు. అదుపు తప్పేవి కొన్ని క్షణాలే. తరువాత అణచివేత కార్యక్రమాలలో నియంత్రణకోసం మొదలయ్యే ప్రయత్నాలు మనమూహించలేం. అందువల్ల ఒకే సమయంలో రెండుపన్లని ఇక్కడ వేగంగా నిర్వర్తించగల బ్యాలెన్స్ చాలాముఖ్యమిక్కడ"
"డీటేల్స్...???"
"మొదటిది విధ్వంసం సృష్టించటం, పెంచటం అయితే. రెండవది మన రవాణాని ఆ విధ్వంసం ముసుగులో దొరికే కొద్దిసెకండ్స్ లోనే తరలించేసుకోవాలి. ఇక్కడ ఆవేశం, టైం సెన్స్ వంటి రెండు భిన్నమైన అంశాలూ ఒకేసారి పాటించగలగాలి. విధ్వంసం జరిగేసమయాన్ని మనం కొంతవరకూ ఊహించవచ్చు కానీ,దాని అణచివేతకార్యక్రామలను మాత్రం అంచనావేయలేం. అవి అవతలవారి సామర్ధ్యాన్ని బట్టి వుంటాయికదా. అందుకే ఆ రెండు విషయాల మద్యన మనకు లభించే సమయాన్ని మనం లెక్కించకుండా ముందుకు సాగాల్సివుంటుంది. అంటే మన ట్రాన్స్ పోర్టింగ్ అంతా విధ్వంసం మొదలైన క్షణం నుండే మొదలవ్వాలి. అదే ఇక్కడ కీలకం"
"చాలా హారిబుల్ గా వుందే..."
"నిజానికి ఇదేమీ మనకి కొత్తకాదు. బాంబులు పేల్చి చెలరేగుతున్నా ఆ మంటలలోనే సరిహద్దుల్లోకి చొరబడుతుంటామే... ఇదీ ఇంచుమించు అలాంటిదే"
'యా! ఈ క్షణం నుంచే ఎలార్ట్ గా వుంటాం"
"ప్రతీ సెకనునూ అంచనా వేయండి.అప్పటి పరిస్థితుల్లో దేన్ని కదిపితే ఎక్కువ విధ్వంసం సృష్టించవచ్చో... వాటిమీదనే ఎక్కువ దృష్టి పెట్టమనండి. ఎలాగూ అవతలివారు హింసకి పాల్పడాలని చూస్తుంటారు కనుక మనవారికి ఎక్కువ రిస్క్ అవసరం వుండదు. కాకపోతే ఒక్కవిషయం గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో మనం చేసేది కేవలం ఘర్షణని పెంచే ఒక సాధారణ విషయంలా మాత్రమే వుండాలి తప్ప ప్రాణాలకి ఏ మాత్రం హానీ వుండకూడదు. అలా జరిగితే మనమీద మరింతగా వత్తిడి పెరిగిపోతుంది. ప్రస్తుతం అది మనకంత మంచిదికాదు"
"అలాగే. మీమాటల్లొ విధ్వంసం అనేమాట చాలాసార్లు వస్తుందే"
అవతలనుండి రెండు సెకండ్స్ నిశ్శబ్దం తరువాత మాటలు వినిపించాయి," నాకు అప్పగించిందే విధ్వంసం కదా?...ఇష్టమున్నా లేకున్నా మనం చేస్తున్న పనిని లీనమైచేస్తేనేకదా ఇక్కడ మనకు మనుగడ. లేకుంటే ఆ తరువాత లెక్కించుకోవటానికికూడా మిగలని ఉద్యోగాలు మనవి"
"అవును. మీకు అది బాగా తెలుసు.అందుకే అంతలా లీనమవుతారు..."
"థ్యాంక్స్" మరో మాట లేకుండా కట్టయ్యింది ఫోన్.

No comments:
Post a Comment