Friday, December 6, 2013

తెలుగుజాతి మనది, నిండుగ వెలుగుజాతి మనది

తెలుగుజాతి మనది, నిండుగ వెలుగుజాతి మనది
"తెలంగాణా నాది", "రాయలసీమ నాది", "నెల్లురు నాది", "సర్కారు నాది"
అన్నీకలిసి మంటగలిసిన.....

                                                        తెలుగుజాతి మనది, నిండుగ వెలుగుజాతి మనది.
విభజనవాదం పుట్టిందీ తెలంగాణానగరంలో...
సమైక్యవాదం పుట్టింది సీమాంద్రనగరంలో...
ఈ రెండూకలిసి.... ఏదిచేసినా...
డిల్లీరోడ్డున పరువుపోయింది
మనదే మనదే మనదేరా..  

                                                         తెలుగుజాతి మనది, నిండుగ వెలుగుజాతి మనది.
ఇటలీమాత పుట్టినరోజుకు తెలుగునే కేకుగా అందించామూ
పక్కరాష్ట్రల కుళ్ళంతా జి.ఓ.యం.గా మారి నరికితే...మనలోమనమే కొట్టుకుచస్తున్నామూ
పిచ్చికుక్కలకు పరువునప్పగించి ప్రపంచాన్ని ఏలేద్దామనుకుంటున్నామూ
స్వార్ధపు అవసరాలకై తెలుగుతల్లినే లాడ్జీగా మరుస్తున్న వారినెందుకు భరిస్తున్నామూ???
                                                             తెలుగుజాతి మనది, నిండుగ వెలుగుజాతి మనది.
ఇప్పుడందరికీ తెలిసింది..తెలుగువారంటే ఎంత వేస్టుగాళ్ళో...
ఈరోజే ప్రపంచానికి తెలిసిందీ మనిళ్ళల్లో "మమ్మి, డాడీ"లెందుకు  పెరుగుతున్నారో...
ఈ ప్రాచీనభాష పిచ్చెక్కిపొయి పార్ధివమైపోతుంటే
అందంగా విడిపోయిన రాష్ట్రల నవ్వులపాలైపోతున్నామూ 
                                                                తెలుగుజాతి మనది, నిండుగ వెలుగుజాతి మనది.
మనం మనం తన్నుకుంటే... పైవాడేం చేశాడు?
ఏదీపంచటం చేతకాక ,,,కొట్టుకుచావండన్నాడు...
రాష్ట్రమున్నా రాజధానిలేని అనాధరా ఒక ప్రాంతం
రాజధానున్నా హక్కులులేని బిచ్చగత్తె మరోప్రాంతం.....  
                                                                    తెలుగుజాతి మనది, నిండుగ వెలుగుజాతి మనది.
 [నా తెలుగురాష్ట్రం ఇంత అసంబద్దంగా విడిపోతున్నందుగు కన్నీళ్ళతో...}
శ్రీఅరుణం

9 comments:

Anonymous said...

పల్లవి మార్చండి మాస్టారు..!!

"తెగులు జాతి మనది..!!! రెండుగ పగులు జాతి మనది" అని..!!

శ్యామలీయం said...

Very nice parody!

hari.S.babu said...

కాంగ్రెసు అధిష్టానం తన సొంత పార్టీ వాళ్ళనే పట్టించుకోవటం లేదు విభజన విషయంలో, ఇంక తెరాసా ఆందోళననీ వాళ్ళు చసే బందు భీభత్సాల్నీ యెందుకు పట్టించుకుంటుంది. అంతా పూర్తి చేసేశాం, కాబింట్ ఆమోదించటమే మిగిలిందని చెప్పాక ఇక మార్పులు చేర్పులు ఉండక పోవచ్చు. ఇప్పటి దాకా యెదటి వాళ్ళని నో ఆప్షనస్ అని గద్దించిన పెద్ద మనిషికి ఇప్పుడు మరో ఆప్షన్ లేదు. అందరూ రాహుల్ గాంధిని ప్రధానిని చెయ్యడానికి విదగొడుతున్నారని యెలా అనుకుంటున్నారో గానీ అది పూర్తిగా తప్పు. దేశమంతా చంక నాకిపోయి విడగొట్టటం వల్ల సీమాంధ్ర లోనూ నష్టపొయాక ఈ కాసిని సీట్లు చలి కాసుకోటానిక్కూడా పనికి రావుగా! నాకు తోచిన క్లూ వేరే ఉంది. పార్తీ పూర్తిగా వోడిపోయినా సోనియాకీ రాహుల్ కీ అమేధీ యో యేవో నికరమయిన స్థానాలు ఉన్నాయి. మరి వారికి అతి ముఖ్యులయినా చిదంబరం, ఆజాద్ లాంటి వారి సంగతేమిటి? చిదంబరాన్ని ఈ సారి జయలలిత తమిల నాడు నుంచి గెలవనివ్వదు. ఆజాదుని వాళ్ళ పార్తీ వాళ్ళే పార్టీ ఆఫీసుకి రానివ్వట్లేదు, ఇంక పార్లమేంతుకి గెలిపించటం కూడానా?మిగతా వాళ్ళ పరిస్తితీ అనతే. వాళ్ళందరికీ నమ్మకమయిన సీట్ల కోసం.
అందుకే తెలంగాణా వాళ్ళు యేది అడిగితే అది - భద్రాచలం తో సహా - ఇవ్వడం. ఆర్టికిల్ 3 అనేది రాజ్యాంగ పరమయిన వెసులుబాటు. కానీ ఆంగ్రెసుని విభజనకి ఒప్పించటం అనేది - తను పెంచి పోషించిన ఉద్యమం యొక్క బలం ద్వారా కాకుండా - సొంత రాష్ట్రాల్లో దిక్కు లేని కోటరీ ప్రముఖులకి నమ్మకమయిన లోక్ సభ సీట్ల కోసం నీచమయిన లాలూచీ తో జరిగింది. అదే లాలూచీ ఇప్పుడు సీమాంధ్రులు చెయ్యగలిగీతె యేమవుతుంది?

Jai Gottimukkala said...

Good bye to Andhra atlast!

Unknown said...

chala anadhangaa vundhi maku mathram peeda vadilindhi

Unknown said...

maku mathramu chala andhangaa vundhi peeda vadilindhi ani

Aakasa Ramanna said...

"రాష్ట్రమున్నా రాజధానిలేని అనాధరా ఒక ప్రాంతం
రాజధానున్నా హక్కులులేని బిచ్చగత్తె మరోప్రాంతం....."

బాగా చెప్పారు..

Aakasa Ramanna said...

రాష్ట్రమున్నా రాజధానిలేని అనాధరా ఒక ప్రాంతం
రాజధానున్నా హక్కులులేని బిచ్చగత్తె మరోప్రాంతం.....

బాగా చెప్పారు..

atididevobhava

closest heart

నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది

Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.