"ప్రేమ అనేది కూడా ఒక మానసిక భావనే" అంటూ నేను
చెప్పడం ప్రారంభించగానే.. ఒక విధ్యార్ధి లేచి "అంతేనంటారా? సార్" అంటూ చాలా
ఆతృత ప్రదర్శించాడు. ఇంతకీ అతని సమస్య ఏమిటంటే.. తను తీసుకుoటునట్లు తన
ప్రేయసి.. తన ప్రేమని సీరియస్ గా తీసుకోవటం లేదని. తను
ఎంత మనస్ఫూర్తిగా చెప్పినా, ఆమె మాత్రం "అంతుందా?" అంటూ తీసిపారేస్తూ
రిప్లయ్ ఇవ్వటం, అతనిలో ఎన్నో సందేహాలను రేకెత్తిస్తుందట. అలాంటి సమయంలో
నేను "ప్రేమ అనేది కూడా ఒక మానసిక భావనే" అంటూ చెప్పటం అతనికి చాలా
రిలాక్స్ గా అనిపించింది. కానీ నిజానికి ఆ మాట నేను చెప్పకపోయినా అతని మనసు
చెబుతూనే వుందతనికి. కానీ.. మరొక పుస్తకమో, పెద్దవారో, మేధావో... ఇలా అతని
మనసుకు దగ్గర వున్నవి ఏవైనా, అదే మాటని చెబితే.. వెంటనే ఈ సందేహపు
తలనొప్పినుండి బయట పడాదామని మనసులో చిన్న కోరిక. అది నా దగ్గర దొరకగానే
అతను తన మనసు అప్పటివరకూ తయారుచేస్తున్న ఫైల్ ని ఇక ఏమాత్రమూ
అలోచించకుండా.. సేవ్ చేసేశాడు.
ఏమిటీ ప్రాసేసంతా?
అసలు ప్రేమంటే ఏమిటి?
ఎలా అది మనల్ని చేరుతుందనేది నా అనుభవంలో ఎలా నాకు తెలిసిందో...ఈరోజునుండి 5రోజులవరకూ రాయబోతున్నాను.
శ్రీఅరుణం
విశాఖపట్నం
9885779207
ఏమిటీ ప్రాసేసంతా?
అసలు ప్రేమంటే ఏమిటి?
ఎలా అది మనల్ని చేరుతుందనేది నా అనుభవంలో ఎలా నాకు తెలిసిందో...ఈరోజునుండి 5రోజులవరకూ రాయబోతున్నాను.
శ్రీఅరుణం
విశాఖపట్నం
9885779207
No comments:
Post a Comment