Saturday, September 27, 2008

వాలుకుర్చిలో జ్ఞాపకాలూ

జీవితం అనుభవించడానికి. దాచుకోవటానికి కాదు. చాలామంది ఆర్ధికమైన విషయాలలో పడి హార్ధికమైన ఆస్వాదనని కోల్పోతున్నారు.ఆ లెక్కలచిట్టాలు పట్టుకొని పరిగెత్తే గమ్యం చేరువయ్యాక...తాము ఏదో కోల్పోయామని తెలివి తెచ్చుకొని వేదన పడుతున్నారు. అలాంటి జీవితం ఒకటి అనుభవించిన ఆశల నెమరువేత ఈ వాలుకుర్చీలో ఙ్ఞాపకాలు కవిత.సంపాదన వుచ్చులో హద్దుకు మించి పరుగులు పెట్టిన ఆయన చివరి రోజులలో తనకోసం ఎంతో ఎదురుచూసి...ఆఖరి చూపు కూడా నోచుకోని భార్య మనసు పడిన క్షోభను గుర్తుచేసుకుంటూ అనుభవించిన క్షణాలు ఇవి .చిత్తగించండి .

నిజం చెప్పు నేస్తం నా నమ్మకం నిలిచేవుందా?
నేను నిలిచిన నీ గుండెలో ఇంకా మొలకెత్తుతూనే వుందా?
నాకు రింగ్ ఇచ్చిన సెల్ కాల్
అవుటాఫ్ కవరేజ్ ఏరియా అంటూ,
నా దూరం చెబుతూ వుంటే..
పీడకలలాంటి ఆ కవరేజీ నీ కడుపుని ఎన్నా ళ్ళని ద్రేవేసిందో?

నీకు గుర్తుందా?నా మొదటి రాక...
నీ హ్రుదయపు వాకిళిలోకి,
కాఫీఇచ్చి ,ఉప్మా పెట్టి ,మజ్జిగ త్రాగించావు.
ఏంటిరా ఇది కన్నా అంటూ..కంటి పుసిని తుడిచావు.
నువ్వు తినిపించిన ఆ ప్రేమఎక్కడ నెమరువేస్తానోనని.
యెంత జాగ్రత్తగా కా పాడుకున్నానో!!!
కానీ.......
కాలం చూపిన ప్రతాపంలో మొదలుపెట్టిన పరుగులో ఏదో శాపం తగిలింది???
అలాంటి శాపగ్రస్తజీవనంతో...గడచిన కాలం,
నా మీద నీ ప్రేమని తగ్గించలేదని చెప్పు నేస్తం
అక్కడే..
నీ పాదాల చెంతనే వుంది నా ప్రాణం.
కనుచుపుమేరవరకూ సోకర్యాలు,
పర్సునిండా కుక్కిన క్రెడిట్ కార్డులు,
గ్లోబుతో పాటూ తిరిగే పనులు ,
ఇంకా....ఎన్నెన్నో...
ఎంటర్ నొక్కితే చాలు..ఏకంగా స్వర్గాన్నే ముందుంచుతున్నాఇ,
కానీ...

ఆపచ్చని చేలో,
పూరిగుడిశెలో,
దూరంగా పలకరిస్తున్నసముద్రపు అలల హోరులో,
నువ్వు తెచ్చిన ఇడ్లీ ఆవకాయా తింటూ ..
మనం అనుభవించిన పరవశాలు..
ఒక్క గంట..కాదు కాదు,
ఒక్క నిముషం..అదీ కాదు,
ఒక్క క్షణం..ఇస్తానని చెప్పు నేస్తం,
ఈ క్షణమే వాలిపోతాను నీ దోసిళ్ళలోకి.
ఊ!!!

యాభై వసంతాలు గడిచిపోయాఇ,
అందులో...నిన్నుపొందిన మూడుదశాభ్దాలూ వెళ్ళిపోయాఇ.
ఒక్కసారిగా వాలుకుర్చిలో నడుంవాల్చిన ఙ్ఞాపకాలు..
కోల్పోఇన సాంగత్యాన్ని నెమరువేసుకుంటుంటే..
వయసు మీరిన తర్వాతి ముందు జాగ్రత్త.. మందులే మింగేస్తున్నాఇ.
పిల్లల బంగారు భవిష్యత్తు..విదేశాలకు ఎగిరిపోఇంది.
అందమైన ఇల్లు కాపలాకాయటానికే సరిపోతుంది.
అందుకోలేనంత హోదా కాపాడుకోడానికే పనికొస్తుంది.
ఆఖరిఖి ఈరోజున..

సంవత్సరానికి పది చొప్పున,నీకు కేటాఇంచిన రోజులు..
నిన్ను ఎంత వేదనకు గురిచేసిందో???
ఖరీదుగా కట్టించిన నీ సమాధిమాత్రమే చెబుతుంది!
ఎంత ఖర్చుపెట్టినా...ఇప్పుడు నువ్వున్నది స్మశానంలోనని.
శ్రీఅరుణం,

విశాఖపట్టణం.

Monday, September 22, 2008

పేరు పెట్టాను

నా కవనకావ్యానికి పెట్టిన పేరు

నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

శ్రీ అరుణం ,

విశాఖపట్టణం

9885779207

Thursday, September 18, 2008

ఈ గుండె గదులలో



ఈ గుండె గదులలో [కవిత]

[స్తీ పురుషుల మద్యన బంధం శ్రుంగారమే ఐతే... ప్రేమ అనే మాట ఎందుకు పుట్టింధి? అటువంటి ప్రేమలోని అనుభూతులతో ఒక అద్భుతమైన ప్రపంచాన్నే నిర్మించుకోవచ్చు.అటువంటప్పుడు ఇక వియోగం అనే వేదన మనల్ని ఎలా చేరుతుంది? అటువంటి ఈ అనుభూతిని ఆశ్వాదించండి. మీ అభిప్రాయంల కొరకు ఎదురుచేస్తూ....]

కనురెప్పలు శ్సాసిస్తే కలలు మేల్కొంటాఇ,
హ్రుదయపు కొలను నుండి
ఙ్ఞాపకాల రంగులనుముంచి తెచ్చుకుంటాఇ.
నేను నువ్వుగా..నువ్వు నేనుగాచిత్రితమవుతున్న
ఆశలనువిరహమనే కాన్వాసుపై..ముద్రించుకుంటాఇ.
అనంతవిశ్వాన్నీ జైంచగల వూహల గమ్యం,
నీ దగ్గరకొచ్చేసరికి ఆగిపోతుంది..
నేనంటే ఇంకేంలేదు..అంతా నువ్వేనంటూ.
నా గుండెలపై తారాట్లాడిన,నీ చేతివ్రేళ్లు,
నా నుదిటిన చుంభించిన నీ బుజ్జి పెదవులు,
ఆస్వాదనతో నిండిన మెడపై చెమటను
తుడిచిన అమ్మలాంటి చేతులూ,
ముద్దుగా నెత్తిపై కొట్టి అమ్మోదేవుడిపేరంటూ..
వెనుకగా హత్తుకొని భుజంపై వాల్చిన తల,
.....ఎన్నని చిత్రించనూ ..ఈ గుండె గదులలో ,
నిజంగా...
అరుణానికి సంపూర్ణ వర్ణం ఎవరు గీయగలరు???
శ్రీఅరుణం
విశాఖపట్టణం


Wednesday, September 17, 2008

శ్రీ అరుణం గా నాకవనం

ఎన్నో ఆశయాలతో మొదలైన జీవితం సమస్యల్లో కూరుకుపోఇనప్పుడు మనసు కోరుకునేది స్వాంతన. అది సాంగత్యంలో లభిస్తే మరింతగా ఆశలు బలాన్ని కూర్చుకుంటాఇ. నా జీవితంలోనూ అటువంటి సమస్యలు నిండిపోఇనప్పుడు...ఓటమి బాధలో పరుగులు పెడుతున్న నాకు ఒక సాంగత్యం తోడుగా దొరికింది.అది నిజమో?అబద్దమో ?తెలుసుకోకుండానే ఆబంధానికిప్రేమ అని పేరు పెట్టుకుని ఆదారిలో పరిగెట్టడం మొదలుపెట్టాను.అలా నన్ను కదిలించిన తోడు అరుణం.విశాఖ సముద్రతీరాన నన్ను కదిలించిన అరుణోదయం అనుకోకుండానే నా జీవితంలో ప్రాణప్రదమైపోఇంది.ఆ అరుణం తోడులో ప్రసవించిన కవనం తనకే అంకితమిస్తూ నా కలం పేరును నా పేరులోని తొలి అక్షరంతో మిళితం చేస్తూ శ్రీఅరుణం గా రాసిన తొలి కవిత ఆంద్రభుమిలో ప్రచురితమైంది.అది రేపు ఇక్కడే చూద్దం. మీ శ్రీ అరుణం.




Monday, September 15, 2008

నా తొలి కవిత

జీవితం సార్దకం చేసుకుందామన్న ఒక బుద్దిపూర్వక ఉద్దేశ్శంతో ఏ కవీ కవిత్వం రాయడు. జీవన తుఫానులలో కొట్టుకుపోతూ ఏ కొమ్మో ఆధారంగా దొరికినప్పుడు చేసుకొనే సమీక్ష కవిత్వం. అది అవిచ్చన్నంగా సాగే దీర్గకాలికప్రకియ కాదు.అప్పుడప్పుడూ చెప్పకుండా సంబవించే విద్య్హుత్ లాంటి సంఘటన-శేషేంద్రశర్మ గారు.
కవిత్వం అంటే కవితత్వం అనుకుంటాను నేను.అనుభూతులను ఆస్వాదిస్తున్న క్షణం వాటి విలువ అశాస్వతం. అదే క్షణంలో వాటికి అక్షరరూపం ఇచ్చి కాపాడుకొండి... ప్రతి నిముషమూ వాటి విలువ పెరిగిపోతూనే వుంతుంది.అటువంటి అనుభూతులను దాచుకోవాలన్న ఆశని నాలో రేకెత్తించినది ప్రేమ. అప్పుడే నిర్ణైంచుకున్నాను,ఇంత గొప్ప ఆనందాన్ని అదే సమయంలో అంతే వేదనని చూపిస్తున్న ప్రేమని ఇలా గాలికి వదలకూడదని.నాకు తెలిసిన నాలుగు అక్షరాలనీ కూర్చుకుంటూ కవితలు రాయటం మొదలు పెట్టాను.ఈ దారిలోనే నా తొలి కవిత జన్మించింది ఇలా....

నా ప్రపంచం చాలా చిన్నది,అందుకే దానికి ఎక్కువ మాటలు రావు,
రాయలని వున్నా..రూపం ఇచ్చేంత పదసంపద నా మస్తిస్కం కూర్చుకోలేదు,
అంతలో నువ్వు కలిశావు.. అనుభుతుల నిఘంటువులా,
ఆ క్షణమే నా పదలు మూటలు కట్టాఇ..చిన్న పాపాఇ మాటలుగా,
నాకు ఫ్రాస రాదు నీపై ధ్యాస తప్ప.
చంధస్సు చదవనేలేదు.. నీ చిరునవ్వు తప్ప.
అలంకారలపై మనసు పోవటం లేదు.. అది నీ ఆహార్యం దగ్గరే నిలిచిపోఇంది ,
అందుకే భావాలను బట్టిపట్టకుండాబదలాఇంచేస్తున్నాను..కాగితం పైకి.
నీ ప్రేమలో మునిగితేలిన ఇప్పుడు.....
నాకు అక్షరాలకు కొదవ లేదు,
వాటికి నీ అనుభూతులతో చేరి రూపం దిద్దుకోవటం వచ్చేసింది.
నువ్వూ నేనూ అనే పదాలు మన జీవననిఘంటువులో చెరిగిపోఇ,
మనం అన్న పదం పుట్టిన ఈ క్షణమే...
శ్రీఅరుణం అనే కలానికి జన్మనిచ్చింది.


Thursday, September 11, 2008

మల్లి మరోసారి మీతో

కవిత్వం రాయటం ఒక వరం. మనలోని అనుభూతులను అక్షరరూపంలో అనుభవించగలగటం అద్భుతం. అటువంటి వరం నాకు లభించడం నా పూర్వజన్మసుక్రుతం.అలాంటి నా కవితలు వెనుకన వున్న నేపద్యం అందరితోనూ పంచుకోవాలని నా ఆశ ఇలా తీరుతున్నందుకు సంతోషంతోఈ బ్లాగ్ని ప్రారంభిస్తున్నాను. నా బ్లాగ్ అడ్రస్ http://sriarunam-telugubloggers.blogspot.com

Wednesday, September 10, 2008

naa kavithala nyapadyam

నా పేరు శ్రీనివాసరావ్. విశాఖపట్టణం.శ్రీఅరుణం నా కలం పేరు.ఆంధ్ర భూమి వంటి పత్రికలలో ముద్రణ ఐన ఆ కవితల నేపద్యం అందరితో పంచుకోవాలన్న కోరికతో మొదలుపెడుతున్న ఈ బ్లాగును ఆదరిస్తారని నమ్ముతూ...శ్రీఅరుణం
sssvas123in@yahoo.co.in

atididevobhava

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.