అప్పుడెప్పుడో అమ్మ సృష్టించినట్లు గుర్తు
ఆ తర్వాత...
వయసు దాచేసుకొందో???
మనసు కప్పేసుకొందో???
సమాజం చెరిపేసిందో???
నా కొసమేనంటూ...అదే పిలుపు మళ్ళీ...
ఉంటుందని మరిచిపొయాను.
పెద్దరికపు ప్రాపులో.. ఖద్దరు బట్టలు చుట్టుకొని
నా అడుగుల శబ్దానికి నేనే గాంభీర్యాన్ని పెంచుకొన్నాను,
ఇంతలోనే...
హృదయంలో తేనె ఒలకపోసుకున్నట్లు..
అమ్మ దోసిళ్ళలో మళ్ళీ వెన్నపూస బువ్వ తింటున్నట్లు..
చాలా రోజుల తరువాత
"కన్నా" అన్న ఆ పిలుపు నా కొసం వినిపిస్తే..
నేను నిలుపుకొన్న ప్రేమే నాకీ అదృష్టాన్ని ఇస్తే...
చాలదా ఈ తృప్తి ...నన్ను నేను ప్రేమించుకొవటానికి.
శ్రీ అరుణం
విశాఖపట్నం.

2 comments:
నా అడుగుల శబ్దానికి నేనే గాంభీర్యాన్ని పెంచుకొన్నాను, చాలా బావుంది...
బాగుందండీ!
Post a Comment