Sunday 25 December 2011

నువ్వంటే...???

నువ్వంటే...???







అప్పుడెప్పుడో.. నన్ను తిట్టుకొంటూ తిరిగి చుడకుండా
వెళ్ళిపోయిందన్న కసితో...
ఎప్పటికప్పుడూ.. నన్ను తట్టిలేపుతూ
కళ్ళుతెరిస్తే కరిగిపోయే అద్భుతాంలా మారినా..
గుండెలముందు బంధించుకోవాలని
నాకెందుకు అనిపించలేదు?


నా ఈసడింపునీ తన కన్నులతో పొదవిపట్టుకొని
ఆశ చావని అడుగులతో దూరమవుతున్న
ఆ పాదాల పగుళ్ళనే చూస్తూ..,
కలుక్కున జారిపోతున్న కన్నీళ్ళని కనికరించలేని
రాతి హృదయాన్ని.. నేనెందుకు గుర్తించలేదు?


గుండేలేని తోటలో మెదడుని పాతేసి
అంబరం ఎత్తున బలిసిన అహం వృక్షాల నీడతో
ఏ ప్రణవానికి హారతి పడతాను?


ప్రణయం పిలిస్తే పలకదు,
అదే పిలిచిందా.. మనమెంత?
ఈ రెండింటిమధ్యనా నేను సాధించే..మనఃసాక్షే..
నువ్వవుతావని ఇప్పుడే తెలుస్తుంది.




శ్రీఅరుణం,
విశాఖపట్నం.

2 comments:

రసజ్ఞ said...

నా ఈసడింపునీ తన కన్నులతో పొదవిపట్టుకొని చాలా బాగుంది!

నందు said...

శ్రీఅరుణం గారికీ, బ్లాగ్ మితృలందరికీ ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు

atididevobhava

Art of the Day

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My Photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my dreem.