నిద్రలేచిన మెలకువ..
నిద్రలేచిన మెలకువ
పరుగున తోటలోకి పోయి
కాన్వాసు ముందు కాళ్ళు చాపుకు కూర్చుని
రాత్రి కలలను తలుచుకుంటుంది.
కల ఆదేశించిన గుర్తు
ప్రేమకు రూపం చిత్రించమంటూ.,
అప్పటినుండీ ఇదేస్థితి!
నువ్వూ.. నేనూ..
మనం.. ఆకాశం..
చెట్టూ.. పుట్టా..
అవకాశం.. అనంతం..
మస్తిష్కపు పరుగులెంతగా చుట్టేస్తున్న
మన తొలి కలయిక చిగురే
మదివనంలో స్ఫురణకు రావట్లేదు?!?
ప్రేమంటే ఏమిటీ?
వెన్నెలను చదవటమా..
వన్నెలను కొలవటమా..
ప్రకృతితో సంగమమా..
పరవశంతో పరిగెత్తటమా..
ఎడతెగని మదనానికి శూన్యమూ
పిపీలికమొతుంది.
ఆ అంతర్మధనంలో..తూలిపడబోయిన నన్ను
ఒక స్పర్శ ఆదరించింది..!
అది బౌతికమైనా..
అబౌతికమైనా..
నా ఆర్తిని నిలిపింది.
అదేనేమో..నేను కోరుకున్న నువ్వు!
నువ్వేనేమో..నాక్కావలసిన నేను.
1 comment:
ఎడతెగని మదనానికి శూన్యమూ
పిపీలికనవుతుంది.
ఈ భావన అంత.. చిక్కగా అనిపించలేదు
మీ ఆర్తి నచ్చింది. చక్కటి ప్రయత్నం
Post a Comment