నిర్వచన0..
గుండెకున్న తీపినినయనాలు వీక్షించగలిగితే..స్ఫురించేది ప్రణయం.
నిశీధివీదులలోకి కిరణం
చొచ్చుకువచ్చే అధ్బుతం..కాంచగలిగేది ప్రణయం.
హృదయాన్ని చేరటానికి
గులాబీరేకులతో దారులునిర్మిస్తే..ఆ అడుగుల స్ఫర్శ ప్రణయం.
ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న
కెరటం అంచులలో నాట్యంచేసే.. ఉత్తేజపుమెరుపు ప్రణయం.
అభివ్యక్తీకరించలేని ఆత్మని
తన్మయత్వపు రంగులతో కలగలిపి..ఆకృతీకరించే కాన్వాసు ప్రణయం.
కాలానికి నగిషీ,
కలానికి జీవం,
ప్రకృతికి నేస్తం,
ప్రగతికి ప్రాణం ప్రణయం.
ఇన్ని అస్తిత్వాల ప్రణయం..మేరువులు తొలగిన వేళ..
ప్రళయం కాకుండా వుండటమే నిజమైన ప్రణయం..!
sriarunam
9885779207
No comments:
Post a Comment