Wednesday, October 30, 2013

చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, రాం చరణ్ ఈ నలుగురూ కలిసి నటించే సినిమా....

కలలు అందరికీ వస్తుంటాయి. వాటిల్లో నిజాల్గా మార్చుకోవాలనుకున్నవే అద్భుతాలుగా నిలుస్తాయి. అలాంటి ఒక కల నా ముందు నిజమవుతున్నప్పుడు అదే అద్భుతం నాకు కనిపిస్తుంది. నేను ప్రాణంపోస్తున్న కధలోకి ఇద్దరు హీరోలు అడుగిడారు.
ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్,
రెండవ వారు యువ మెగాస్టార్ రాం చరణ్ సార్.
ఇక వారిద్దరి మద్యన అత్యున్నతమైనస్థాయి కలిగిన పాత్రలో మెగాస్టార్ చిరంజీవి సార్.
ఈ ముగ్గురిమద్యలో ఒక టిపికల్ పాత్రలో నాగబాబు సార్.
ఇలా ఈ నలుగురి కాంబినేషన్లో నా నియంత్రణ రేఖ[LINE OF CONTROL] ఊపిరిపోసుకుంటూ, నాకు ముందుగానే ఒక కలని నిజమైన అద్భుతంగా చూపెడుతుంది. అది సినిమా ఐతే ఎందరికి అద్భుతమై నిలుస్తుందోనని మరింత పట్టుదలగా ఆ యఙ్ఞాన్ని నిర్వర్తిస్తున్నాను. సంపూర్ణంగా ఈ కలని నిజం చేసుకొనే ప్రయత్నంలోనే ప్రస్తుతానికి నేనున్నాను. చూద్దాం అది ఏ తీరానికి చేరుతుందో....
శ్రీఅరుణం
 9885779207
విశాఖపట్నం


Sunday, October 27, 2013

మొదటిసారి హాస్యప్రయత్నం...


  నేనొక ఈజీ గోయింగ్
నాదంతా అనీజీ ఫీలింగ్,
మాటలకూ చేతలకూ రాజీ కుదరక
పెన్ను దొరికిందికదా అని పేజీలు నింపేస్తుంటాను,
నా జీతమంతా భార్యకే మెయిల్
అందుకేనేమో నా బి.పి.రిపోర్ట్ నిల్,
ప్రసాదాలవరకూ దేవుళు జాస్తి
ఉపవాసాలంటేనే భక్తి నాస్తి,
నా కిష్టం సింప్లిసిటీ అంటుంటాను
లోపలమాత్రం లాగుతుంటుంది ఆశల పబ్లిసిటీ,
రివార్డులెన్ని వస్తున్నా మనసు అవార్డులవైపు పరిగెడుతుంది,
విజయం నాకెప్పుడూ సప్లిమెంటరీయే
అందుకేనేమో...నా శ్రమకు నిరంతరం కాంప్లిమెంటరీ,
నాకు నేనే ఆస్తి
నా అలోచనల్ని బజ్జోపెట్టే కవితవమే నాకు స్థిరాస్తి.
శ్రీఅరుణం




Friday, October 25, 2013

పుస్తకం కావాలనుకునేవారు...

నా అంతర్ భ్రమణం పుస్తకం నవంబర్ నుండి రాష్ట్రంలోని వెంకటేశ్వర బుక్ సెంటర్ లలోనూ, అన్ని విశాలాంద్ర బుక్ సెంటర్ లలోను లభ్యమవుతుంది. ఈ లోపు కావాలనుకునేవారు నాకు తెలపండి.
sriarunam [visakhapatnam]
నా నెంబర్ 9885779207.
mail = sssvas123in@rediffmail.com

Thursday, October 24, 2013

అధ్యాయాలు












నా పుస్తకం అంతర్ భ్రమణం లో ఏ అధ్యాయాలుంటాయని అడిగిన మిత్రులకి వాటి వివరణ ఇస్తున్నాను.
అధ్యాయాలు
1.సమస్యా పురాణం
2.విజయదాహం
3.వ్యక్తిత్వవికాసానికి లక్షణాలు
4.జయాపజయాలలో మానసికభావాల పాత్ర
5.ప్రేమ...జీవితంలో దాని పాత్ర
6.ఆర్ధిక జీవితం
7.ధర్మార్ధకామమోక్షం
8.నిన్ను నువ్వు రాసుకో...
9.ఓడిపోయిన క్షణాలు...
10.జీవితసాధన

11.నాలుగుస్థంబాల మేడ.

శ్రీఅరుణం 

atididevobhava

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.