నేనొక ఈజీ గోయింగ్
నాదంతా అనీజీ ఫీలింగ్,
మాటలకూ చేతలకూ రాజీ కుదరక
పెన్ను దొరికిందికదా అని పేజీలు నింపేస్తుంటాను,
నా జీతమంతా భార్యకే మెయిల్
అందుకేనేమో నా బి.పి.రిపోర్ట్ నిల్,
ప్రసాదాలవరకూ దేవుళు జాస్తి
ఉపవాసాలంటేనే భక్తి నాస్తి,
నా కిష్టం సింప్లిసిటీ అంటుంటాను
లోపలమాత్రం లాగుతుంటుంది ఆశల పబ్లిసిటీ,
రివార్డులెన్ని వస్తున్నా మనసు అవార్డులవైపు పరిగెడుతుంది,
విజయం నాకెప్పుడూ సప్లిమెంటరీయే
అందుకేనేమో...నా శ్రమకు నిరంతరం కాంప్లిమెంటరీ,
నాకు నేనే ఆస్తి
నా అలోచనల్ని బజ్జోపెట్టే కవితవమే నాకు స్థిరాస్తి.
శ్రీఅరుణం
1 comment:
chala bagundi sir. - vara prasad dasari (dasarigamalu.blogspot.in)
Post a Comment