Sunday, October 6, 2013

కుక్కల భాగోతం....


గజ్జికుక్కకి రత్నసిoహాసనం దొరికింది
గబ్బుకొడుతున్న దాని దురద తీర్చుకోవటానికీ
ఆ రత్నకంబళికి కుళ్ళురుద్దటం మొదలెట్టింది.
ఆ కుళ్ళూ, గజ్జీ కలిసి కారుతున్న రక్తంలోంచి
ఊడిపడుతున్న సి0హాసనపురత్నాలను ఏరుకుందామని
మరికొన్ని కుక్కలు దానిచుట్టూచేరి భజన మొదలుపెట్టాయి.
ఆ కుక్కలభాగోతానికి అర్ధ తెలియని ప్రజలు...
శాంతియుతంగానే తమ ఆశల్ని వెలిబుచ్చుతూ కాలంగడిపారు,
కానీ..అవి కుక్కలుకాదా! అందుకే ఆ శాంతియుతగమనాన్ని చేతకానితనమనుకున్నాయి.
వాటికి మొరగటమే వచ్చు పాపం
అందుకే...తముచూపిన నిశబ్దానికి వెనుకన దాచుకున్న
శబ్దం విశ్వరూపాన్ని ప్రజలిప్పుడు చూపెడుతుంటే,
హద్దులుదాటుకొని
సరిహద్దులు చీల్చుకుని
సామ్రాజ్యపు రాజధానిలో తలదాచుకున్నాయి.
అన్నంపెట్టిన యజమాని ఇంటనే అశుద్దాన్ని బోర్లించిన వాటికిప్పుడు
ఆ గజ్జికుక్కేదారయ్యింది.
దానిపంచన తలవంచి సంఘానికి అంటరానిబ్రతుకు బ్రతుకుతున్నాయి.
నిజమే. పాపం పండితే... పరమాత్మా రక్షించలేడు ఏ జాతినైనా.
శ్రీఅరుణం
విశాఖపట్నం
{ఇక్కడ సందర్భానుసారంగానే భాగోతం అనే మాటను వాడాను తప్ప, భాగోతం ప్రదర్శించే వారిని కించపరచాలనికాదు. గమనించంచగలరు] 






 


 

No comments:

atididevobhava

closest heart





నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు.

వీక్లీ నవల 2009 జనవరి 1 నుండి

ఇక్కడే మొదలవుతుంది


Blog Archive

naa gurenchi meethoo

My photo
visakhapatnam, hindu andhrapradesh, India
srinivasa,saritha,sahitya,srisaran this is my world. in my pen name sri is me,arunam is my heart.