మహాభారత ఉద్యమం అనేది నాకు ఒకరాత్రి వచ్చిన కలకి సాకారం. ఆ కల నాకు అందమైన భారతదేశాన్ని వీక్షింపచేసింది. కానీ మెలకువలో వెతుకుతున్ననాకు నాదేశం అలాలేదన్న వాస్తవం కనిపిస్తుంది. నా దేశసౌభాగ్యాన్ని నిజంచేయాలంటే నేనేం చేయాలన్న ఆశ నాలో పుట్టిన క్షణం ఒకటి అర్ధమయ్యేలా చేసింది. మనదేశం బాగుపడాలంటే మనమేం గొప్పగొప్పపనులు చేయనక్కరలేదు, రాజ్యాంబద్ధంగా మనం ఏర్పరుచుకున్న వ్యవస్థ మనతోడే వుంది. మనం చేయాల్సిందల్లా...ఎవరిపనినివారు చిత్తశుద్దితో, నిజాయితీతో, నైతికతతో నిర్వర్తిస్తే చాలనిపించింది. అందుకే ఒక కవిగా అప్పటికి నాలోవున్న కొన్ని సంకుచితత్వాలనూ పక్కనపెట్టి "భారతీయత"ధరించి నావంతు కృషితో రచన చేయాలనుకున్నాను. అలా ప్రారంభించినదే ఈ మహా భారత ఉద్యమం. దీనిని ప్రారంబించినప్పుడు నాకు సరిపడినంత విషయం చేతిలో లేదు. కాకపోతే ఎంతోచెప్పాలన్న తపన మాత్రం వుంది. దానితోటే రాయటం మొదలుపెట్టాను. అయితే దీనిని చదివే పాఠకుల సంఖ్యమాత్రం ప్రతీసారీ పెరగటం గమనించాను.మొదటి భాగం ఎనభైమంది చదవగా ఎనిమిదవభాగాన్ని సుమారుగా రెండువందల నలబైమంది చదివారు. మొత్తంగ ఎనీదిభాగాలనూ 1874మంది చదివారు. అది నాకు ఒక గొప్ప ఉత్సాహన్ని ఇస్తుంది. దానితోపాటు చాలామంది తమ అభిప్రాయాలను పంపుతూ...దీనిని మరింత సమగ్రంగా రాయాలనీ, పుస్తకరూపంలో మరింత తొందరగా అందించాలని కోరటం జరుగుతుంది. అదే అభిప్రాయాన్ని ఒక ప్రముఖ పబ్లిషింగ్ వారు కూడా పంపటం జరిగింది.వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీటన్నిటి దృష్ట్యా ప్రస్తుతానికి నా బ్లాగ్లో దీనిని ఆపేస్తూ సాధ్యమైనంత త్వరగా పుస్తకరూపంలో మార్కెట్లోకి తేవటానికి కృషి మొదలుపెట్టాను. సంక్రాంతికి ఈ పుస్తకం మార్కెట్లో లభ్యం అవుతుంది. ఇక ఎప్పటిలాగే నా ఈ బ్లాగ్ లో కవితలతో, అభిప్రాయాలతో అలరించే ప్రయత్నం చేస్తాను
మీ..
శ్రీ అరుణం
విశాఖ పట్నం
మీ..
శ్రీ అరుణం
విశాఖ పట్నం
No comments:
Post a Comment